Khairatabad Ganesh 2023: ఒక్కో ఏడాది ఒక్కో ఎత్తుతో.. ఒక్కో ప్రత్యేక రూపంతో దర్శనమిచ్చే ఖైరతాబాద్ గణపతి అంటే.. తెలుగు రాష్ట్రాలకే కాదు, దేశం ఆ మాటకొస్తే విదేశీ పర్యాటకులకు సైతం ఆసక్తే. ఇక ఈ ఏడాది ఖైరతాబాద్ గణేశుడి ఎత్తు, రూపం ఎలా ఉండనుందో తెలుసా? ఈసారి 63 అడుగుల ఎత్తుతో.. శ్రీ దశమహా విద్యాగణపతి అవతారంలో భారీ విఘ్నేషుడు ఖైరతాబాద్‌లో కొలువు దీరి ప్రజలను అలరించనున్నాడు.
69వ ఏడాది..
69 ఏళ్లుగా ఖైరతాబాద్ వినాయకుడు భక్తులను అలరిస్తున్నాడు. గణేశ్ ఉత్సవ సమితి ఏటా వినాయక నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తోంది. ఈసారి 63 అడుగుల ఎత్తుతో.. శ్రీదశమహా విద్యాగణపతి అవతారంలో భారీ విఘ్నేషుడు కొలువు దీరనున్నాడు. శ్రీపంచముఖ లక్ష్మీనారసింహస్వామి ఒకవైపు, శ్రీ వీరభద్రస్వామి మరోవైపు.. విఘ్నేషుడి మండపంలోనే సరస్వతీ దేవి, వరాహ దేవి కొలువు కానున్నారు. ఈ మేరకు మండప నమునా చిత్రాన్ని విడుదల చేసింది ఉత్సవ కమిటీ విడుదల చేసింది.
పూర్తిగా మట్టితో..
గత ఏడాది నుంచి ఖైతాబాద్ వినాయకుడిని మట్టితో తయారు చేస్తున్నారు. పర్యావరణ హితంగా నిర్మిస్తున్నారు. గతంలో ఏటా ప్లాస్టర్ ఆఫ్ పారీస్‌తో వినాయక ప్రతిమ రూపొందించేవారు. పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించకుండా ఎకో ఫ్రెండ్లీ గణేషుడిని రూపొందిస్తున్నారు. ఇందుకోసం కర్ర పూజతో గణనాథుడి విగ్రహ తయారీ ప్రారంభించారు.