NTR: ఆర్ ఆర్ ఆర్ మూవీతో ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోల లిస్ట్ లో చోటు దక్కించుకున్నాడు. దేశంలోని టాప్ 5 అగ్ర హీరోల్లో ఎన్టీఆర్ ఒకరు అనడంలో సందేహం లేదు. ఆయన లైన్ అప్ కూడా అలానే ఉంది. బడా డైరెక్టర్స్ తో వరుస చిత్రాలు ప్రకటించాడు. ప్రస్తుతం దర్శకుడు కొరటాల శివతో దేవర చేస్తున్న విషయం తెలిసిందే. నవంబర్ కల్లా ఎన్టీఆర్ పార్ట్ పూర్తి కానుందట. ఈ మూవీలో ఆరు భారీ ఫైట్స్, 500 మందితో కూడిన ఓ సాంగ్ ఉంటుందట. ఈ సాంగ్ లో విలన్ సైఫ్ అలీ ఖాన్ సైతం ఉంటారట.
మొత్తం నాలుగు సాంగ్స్ అంటున్నారు. సీజీ వర్క్ కి దాదాపు మూడు నెలల సమయం పడుతుందట. అందుకే కొరటాల శరవేగంగా షూటింగ్ పూర్తి చేస్తున్నాడు. చెప్పినట్లు 2024 సమ్మర్ బరిలో దేవరను నిలపాలనేది ఆయన ఆలోచనట. కాగా ఎన్టీఆర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఆసక్తికర సమాచారం అందుతుంది. ఎన్టీఆర్ భారీగా కండలు పెంచనున్నాడట. దీనికోసం అమెరికా లేదా దుబాయ్ వెళ్లనున్నారట.
అక్కడ స్పెషల్ ట్రైనర్స్ ఆధ్వర్యంలో శిక్షణ తీసుకోనున్నాడట. ఈ మేకోవర్ వార్ 2 కోసం అట. హృతిక్ రోషన్-ఎన్టీఆర్ కాంబోలో వార్ 2 ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ వచ్చే ఏడాది మొదలుకానుంది. మరి వార్ 2 మూవీ అంటే భారీ విలన్స్ తో పాటు బడా ఆయుధాలను హ్యాండిల్ చేయాలి. గన్ షూటింగ్ సమయంలో ప్రత్యేకంగా చేతి కండరాలు కనిపించేలా ఎన్టీఆర్ ని తీర్చిదిద్దనున్నారట.
ఇందులో భాగంగా ఎన్టీఆర్ శిక్షణ తీసుకోనున్నాడని సమాచారం. ఈ మేరకు టాలీవుడ్ లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. వార్ 2 చిత్రానికి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకుడు. ఆయన వార్, పఠాన్ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టాడు. ఆయన దర్శకత్వంలో నెక్స్ట్ వార్ 2 తెరకెక్కనుంది. పార్ట్ 1 లో హృతిక్ రోషన్-టైగర్ ష్రాఫ్ నటించారు. ఇక వార్ 2 అనంతరం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ చేయనున్నారు.