Homeజాతీయ వార్తలుఇక రిజిస్ట్రేషన్లు స్ట్రాట్.. ధరణి పోర్టల్‌ నేడే షురూ..

ఇక రిజిస్ట్రేషన్లు స్ట్రాట్.. ధరణి పోర్టల్‌ నేడే షురూ..

KCR to launch Dharani portal from Muduchintalapalli today

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న ధరణి పోర్టల్‌ నేటి నుంచి అందుబాటులోకి రానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌‌ కొత్త రెవెన్యూ చట్టంలో భాగంగా ఈ ధరణి వెబ్‌ పోర్టల్‌లో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రెవెన్యూ సంస్కరణల్లో ఇదో మైలురాయిగా నిలవనుంది. ధరణి ద్వారా ఇకపై తహసీల్దారు కార్యాలయంలోనే రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల సేవలు అందనున్నాయి. దస్తావేజుల రాతలు అవసరం లేని ఈ విధమైన సేవలు వేరే ఏ రాష్ట్రంలోనూ లేవు.

Also Read: తనది కాని చోట..! ఎంపీగా గెలిచినా తృప్తి లేని ‘కోమటిరెడ్డి’..!

కాగా.. ఈ ధరణి పోర్టల్‌ను సీఎం కేసీఆర్‌ మేడ్చల్‌ జిల్లా మూడుచింతలపల్లిలో ప్రారంభించనున్నారు. ధరణి సేవలు అందుబాటులోకి వస్తే.. ఇప్పటివరకు కాగితాలపై కొనసాగుతున్న దస్త్రాల నిర్వహణ ఇకపై పోర్టల్‌లో డిజిటల్ రూపంలో కొనసాగుతాయి. భూమి యజమానికి తెలియకుండా భూ వివరాల్లో ఎటువంటి మార్పు చేర్పులకు వీలుండదు. యజమాని ఆధార్‌ కార్డు ఆధారంగానే దస్త్రాల్లో మార్పులు జరుగుతాయి.

భూమి యజమాని సెల్‌ఫోన్‌కు పంపే ఓటీపీ ఆధారంగానే ఈ మార్పులుచేర్పులు జరుగుతాయి. అక్రమంగా హక్కులు మార్చే పరిస్థితి లేదు. అంతేకాదు బయోమెట్రిక్‌తోనే దస్త్రాలు తెరుచుకుంటాయి. అంతేకాదు రిజిస్ట్రేషన్లు మ్యుటేషన్ల విధానాన్ని ప్రభుత్వం పూర్తిగా మార్చివేసింది. రిజిస్ట్రేషన్‌, రెవెన్యూ శాఖల సేవలను ఒకే సాఫ్ట్‌వేర్‌లో పొందుపరచింది. దీనివల్ల వ్యవసాయ భూములను మండల తహసీల్దారు కార్యాలయాల్లోనే రిజిస్టర్‌ చేసుకోవచ్చు. గతంలో భూమిపై యాజమాన్య హక్కులు పొందాలంటే మ్యుటేషన్‌ కోసం గ్రామస్థాయిలో వీఆర్వో నుంచి డిప్యూటీ తహసీల్దారు వరకు పలుమార్లు తిరిగితే తప్ప పూర్తయ్యేదికాదు. కొత్త విధానంలో రిజిస్ట్రేషన్‌ కాగానే మ్యుటేషన్‌ కూడా పూర్తయిపోతుంది.

Also Read: రాములమ్మా.. చల్లబడమ్మా..!

రాష్ట్రంలో ఇప్పటివరకు 141 సబ్‌ రిజిస్ట్రార్‌‌ ఆఫీసులు ఉన్నాయి. వీటికితోడు కార్యాలయాలను కూడా సబ్‌ రిజిస్ట్రార్‌‌ కార్యాలయాలుగా గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అంటే.. రాష్ట్రవ్యాప్తంగా 570 తహసీల్దారు కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల సేవలు అమల్లోకి రానున్నాయి. ధరణి అమలుకు రూ.51.30 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ప్రతీ తహసీల్దార్‌ కార్యాలయానికి రూ.9 లక్షల చొప్పున కేటాయించింది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version