https://oktelugu.com/

పదవులకు మేం పనికిరామా..? అన్నీ వాళ్లకేనా..?

ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక.. సంక్షేమ పథకాల అమలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. కులాలకతీతంగా పథకాలను అమలు చేస్తున్నారు. జగన్‌పై ఇప్పుడు ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గం అసంతృప్తిలో ఉందట. పదవులన్నీ ఇతర సామాజికవర్గాలకు కేటాయిస్తుండంతో రెడ్డి సామాజిక వర్గం నేతలు తప్పు పడుతున్నారు. నేరుగా బహిరంగంగా అసంతృప్తిని వ్యక్తం చేయకపోయినా సీనియర్ నేతల ఎదుట తమ ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. Also Read: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు వేల రూపాయాలు.. ప్రలోభాలు షురూ.. […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 13, 2021 / 01:43 PM IST
    Follow us on


    ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక.. సంక్షేమ పథకాల అమలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. కులాలకతీతంగా పథకాలను అమలు చేస్తున్నారు. జగన్‌పై ఇప్పుడు ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గం అసంతృప్తిలో ఉందట. పదవులన్నీ ఇతర సామాజికవర్గాలకు కేటాయిస్తుండంతో రెడ్డి సామాజిక వర్గం నేతలు తప్పు పడుతున్నారు. నేరుగా బహిరంగంగా అసంతృప్తిని వ్యక్తం చేయకపోయినా సీనియర్ నేతల ఎదుట తమ ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు.

    Also Read: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు వేల రూపాయాలు.. ప్రలోభాలు షురూ..

    అంతేకాదు.. మరో అడుగు ముందేకేసి వచ్చే ఎన్నికల్లో తమ మద్దతు జగన్‌కు అవసరం లేదా అని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పదవులన్నీ 60 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు మాత్రమే కేటాయిస్తున్నారు. వారికి ఇస్తున్న ప్రాధాన్యత పార్టీని ఆర్థికంగా, సామాజికపరంగా ఆదుకున్న తమకు ఇవ్వడం లేదన్నది రెడ్డి సామాజికవర్గం ఆందోళన. ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత భర్తీ చేసిన పదవుల్లో తమకు కేటాయించడం లేదని, భవిష్యత్ లోనూ ఆ అవకాశం లేనట్లే కన్పిస్తోందంటున్నారు.

    గత ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని ఢీకొట్టేందుకు జగన్ వెంట రెడ్డి సామాజికవర్గం నడిచింది. ఎనిమిదేళ్లపాటు పార్టీని పెట్టి అష్టకష్టాలుపడిన జగన్‌కు రెడ్డి సామాజిక వర్గం కూడా అండగా నిలిచింది. ఉదాహరణకు శాసనమండలిలో ఖాళీ అవుతున్న పదవులన్నీ ఇతర సామాజికవర్గాలకే కేటాయిస్తుండటం రెడ్డి సామాజికవర్గంలో ఆందోళన నెలకొంది. జగన్ తొలిసారి అధికారంలోకి రావడంతో వీరంతా ఆశలు పెంచుకున్నారు.

    Also Read: ముగిసిన ప్రచారం.. మొదలైన పలుకరింపు

    శానసమండలిలో ఇప్పటివరకూ భర్తీ చేసిన పదవులన్నీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకే జగన్ కేటాయించారు. మైనారిటీ కోటా కింద మహ్మద్ ఇక్బాల్, జకియా ఖాన్, కరీమున్నీసాలకు అవకాశం ఇచ్చారు. ఇక ఎస్సీ కోటా కింద బలి కల్యాణ చక్రవర్తి, పండుల రవీంద్ర బాబు, డొక్కా మాణిక్య వరప్రసాద్‌కు అవకాశం ఇచ్చారు. ఇక రెడ్డి సామాజికవర్గం కింద ఒక్క చల్లా భగీరథరెడ్డికే ఛాన్స్ ఇచ్చారు. రానున్న ఎమ్మెల్సీ పదవులు కూడా జగన్ వేరే సామాజికవర్గాల వారికే ఇవ్వాలని నిర్ణయించడం వీరిలో అసహనం వ్యక్తమవుతోంది. అందుకే.. నేరుగా కలిసి తమ అసంతృప్తిని వెల్లగక్కుతున్నట్లు తెలుస్తోంది.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్