ఊహించని స్థాయిలో కొత్త కేసులు!

తెలంగాణలో ఊహించని స్థాయిలో కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. రాష్ట్రంలో కొత్తగా 209 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇవాళ జీహెచ్ఎంసీ పరిధిలో 175, మేడ్చల్‌ లో 10, రంగారెడ్డిలో 7, కరీంనగర్ మహబూబ్ నగర్ లో 3 చొప్పున, వరంగల్ అర్బన్‌, అసిఫాబాద్, సిద్దిపేటలో 2 చొప్పున, ములుగు, కామారెడ్డి, వరంగల్ రూరల్, సిరిసిల్లలో ఒక్కో కేసు నమోదయ్యాయి. ఇతర ప్రాంతాల నుంచి తెలంగాణకు వచ్చిన వారిలో […]

Written By: Neelambaram, Updated On : June 12, 2020 8:52 am
Follow us on

తెలంగాణలో ఊహించని స్థాయిలో కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. రాష్ట్రంలో కొత్తగా 209 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇవాళ జీహెచ్ఎంసీ పరిధిలో 175, మేడ్చల్‌ లో 10, రంగారెడ్డిలో 7, కరీంనగర్ మహబూబ్ నగర్ లో 3 చొప్పున, వరంగల్ అర్బన్‌, అసిఫాబాద్, సిద్దిపేటలో 2 చొప్పున, ములుగు, కామారెడ్డి, వరంగల్ రూరల్, సిరిసిల్లలో ఒక్కో కేసు నమోదయ్యాయి. ఇతర ప్రాంతాల నుంచి తెలంగాణకు వచ్చిన వారిలో ఒకరికి పాజిటివ్ వచ్చింది.

రాష్ట్రంలో నిన్న మరో 9 మంది చనిపోయారు. తాజా కేసులతో తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 4,320 కి చేరింది. వీరిలో 449 మంది విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు, వలస కార్మికులు ఉన్నారు. కరోనా వైరస్‌‌ తో పోరాడుతూ తెలంగాణలో ఇప్పటి వరకు 1993 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 2162 మంది బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక తెలంగాణలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 165కి చేరింది.