https://oktelugu.com/

తెలంగాణలో భారీ మొత్తంలో కొత్త కేసులు!

తెలంగాణలో శుక్రవారం భారీ మొత్తంలో కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 169 కొత్త కేసులు నమోదయ్యాయని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ లో వెల్లడైంది. అలాగే మెగాస్టార్ నమోదైన కేసుల్లో హైదరాబాద్ పరిధిలో 82, రంగారెడ్డిలో 14, మెదక్‌లో ఇద్దరు, సంగారెడ్డిలో ఇద్దరి (మొత్తం 100 మంది)కి కరోనా పాజిటివ్ వచ్చింది. వీరితో పాటు విదేశాల నుంచి వారిలో 64 మందికి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఐదుగురికి కరోనా […]

Written By: , Updated On : May 30, 2020 / 10:56 AM IST
Follow us on

Telangana

తెలంగాణలో శుక్రవారం భారీ మొత్తంలో కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 169 కొత్త కేసులు నమోదయ్యాయని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ లో వెల్లడైంది. అలాగే మెగాస్టార్ నమోదైన కేసుల్లో హైదరాబాద్ పరిధిలో 82, రంగారెడ్డిలో 14, మెదక్‌లో ఇద్దరు, సంగారెడ్డిలో ఇద్దరి (మొత్తం 100 మంది)కి కరోనా పాజిటివ్ వచ్చింది. వీరితో పాటు విదేశాల నుంచి వారిలో 64 మందికి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఐదుగురికి కరోనా నిర్ధారణ అయింది.

తాజా లెక్కలతో తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 2,425 కి చేరింది. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 1381 మంది కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి కాగా.. ఇప్పటి వరకు 71 మంది చనిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 973 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.

భారత్ లో శుక్రవారం నుంచి రోజుకు 7వేలకు పైగా కొత్త కరోనా కేసులు నమోదు మొదలైంది. తాజాగా 7,964 కొత్త కేసులు రావడంతో… మొత్తం కేసుల సంఖ్య 1,73,763కి చేరింది. అలాగే… నిన్న 265 మంది చనిపోవడంతో…. మొత్తం మరణాల సంఖ్య 4,971కి చేరింది. ఐతే… రికవరీ కేసులు నిన్న ఒక్క రోజే 11,264గా ఉన్నాయి. ఫలితంగా మొత్తం రికవరీలు… 82,369కి చేరాయి.