ఒక సంవత్సరం పరిపాలన పూర్తిచేసుకున్న వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనాపరంగా ఏమి సాధించినా న్యాయపరంగా ఉన్నత న్యాయస్థానాల నుండి గతంలో మరే ముఖ్యమంత్రికి ఎదురుకానన్ని మొట్టికాయలు మాత్రం వేయించుకొంటున్నారు. గత ఏడాది కాలంలో 60కి పైగా కీలకమైన కేసులలో ప్రభుత్వం హైకోర్ట్ దృష్టిలో దోషిగా నిలబడవలసి వచ్చింది. అయినా ప్రభుత్వ ధోరణిలో మార్పు రావడం లేదు.
అంటే ప్రతి నెల సగటున రెండు కేసులలో ప్రభుత్వానికి హైకోర్టు లో చుక్కెదురవుతున్నది. చట్టబద్దత, నిబంధనలను పట్టించుకోకుండా ఇష్టం వచ్చిన్నట్లు నిర్ణయాలు తీసుకోవడంతోనే ఇటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది. దానితో డిజిపి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వంటి వారు కూడా కోర్ట్ ముందు దోషులుగా నిలబడవలసి పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
కీలక నిర్ణయాలు తీసుకొనే ముందు సంబంధిత అధికారులతో గాని, నిపుణులతో గాని, కనీసం మంత్రులతో గాని మంచి, చెడ్డలు చర్చించకుండా; జిఓల జారీలో పాలనాపరమైన అంశాలను పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఉండడం కారణంగానే ఇటువంటి పరిస్థితులు వాపోతున్నారు.
ప్రభుత్వంకు హైకోర్టులో ఎదురు దెబ్బ తగలడంతో రాజకీయంగా సహితం తీవ్రమైన ఎదురు దెబ్బలుగా భావించే ముఖ్యమైన కొన్ని కేసులు:
* కొత్త ఎన్నికల కమిషనర్ కు హైకోర్టు బ్రేక్.. తిరిగి రమేష్ కుమార్ నియామకం
* గ్రామ సచివాలయాలకు వైసీసీ కలర్స్.. కోర్టుధిక్కరణ కేసులో సీఎస్
* డాక్టర్ సుధాకర్ పై దౌర్జన్యం మీద ఆగ్రహం.. కేసు సీబీఐకి అప్పగింత
* సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ఎత్తివేత
* స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం తప్పనిసరి జీవో కొట్టివేత
* హైకోర్టుపై సోషల్ మీడియాలో కామెంట్ల మీద కేసులు
* చంద్రబాబుకు భద్రత తగ్గించవద్దు.. కాన్వాయ్ లో జామర్ ఉండాల్సిందేనని తీర్పు
* చంద్రబాబును విశాఖలో పోలీసులు అడ్డుకోవడంపై సీరియస్
* ఏపీపీఎస్సీ చైర్మన్ ఉండగా ఇన్చార్జీని పెట్టడంపై ఆగ్రహం
* ఐపీఎస్ జాస్తి కృష్ణకిషోర్ సస్పెన్షన్ ఎత్తివేత.. పాలించే పద్ధతి ఇది కాదంటూ కామెంట్
* రాజధాని గ్రామాల్లో 144 సెక్షన్ పెట్టడంపై సీరియస్
* రాజధాని భూముల్ని ఇళ్ల స్థలాలకు ఇవ్వడంపై సీరియస్
* ఎల్జీ పాలిమర్స్ కంపెనీ సీజ్, డైరెక్టర్లు విదేశాలకు వెళ్లొద్దని ఆదేశం
* లాక్డౌన్ ఉల్లంఘనలపై ఐదుగురు వైసీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు
* కర్నూలుకు ఆఫీసుల తరలింపు జీవో సస్పెన్షన్