EBC Nestham: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈబీసీలకు ఆర్థిక సహాయం అందించే ఈబీసీ నేస్తం పథకం కోసం రూపకల్పన చేసింది. ఈనెల పదిన నంద్యాలలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు కూడా చేసింది. కానీ అనివార్య కారణాల వల్ల వాయిదా వేసింది. దీంతో లబ్ధిదారుల్లో నిరాశే ఎదురవుతోంది. ఊరించి ఉసూరుమనిపించిన పథకం ప్రారంభం ఎప్పుడో తెలియడం లేదు. రాష్ర్టవ్యాప్తంగా ఈబీసీ నేస్తం లబ్ధిదారులకు పండగ కంటే ముందే డబ్బులు వేస్తే ఘనంగా జరుపుకుంటారని భావించారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఆర్థికంగా వెనుకబడిన తరగతి మహిళల కోసం ప్రతి ఏడాది రూ. 15 వేల చొప్పున మూడేళ్లకు రూ. 45 వేలు వారి ఖాతాల్లో వేస్తామని చెబుతోంది. అగ్రవర్ణ కులాలకు చెందిన మహిళల్లో 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకు ఉన్న వారికి అందజేసేందుకు ప్రభుత్వం సంకల్పించింది. దీంతో ప్రజల్లో ఉత్సాహం వచ్చినా కార్యక్రమం వాయిదా వేయడంతో లబ్ధిదారుల్లో అసహనం పెరుగుతోంది.
Also Read: చంద్రబాబు బాధ పగోడికి రావద్దట?
అయితే కార్యక్రమం ప్రారంభానికి ముహూర్తం ఖరారు చేసినా ఎందుకో వాయిదా వేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కరోనా కారణంగా వాయిదా వేశారా లేక ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వేశారా అనే విషయాల్లో స్పష్టత కానరావడం లేదు. ప్రభుత్వం కూడా దీనిపై క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఈబీసీ నేస్తం పథకం ప్రారంభం ఎప్పుడు చేపడతారో తెలియడం లేదు. నంద్యాలలో బహిరంగ సభ నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు చేసుకోవడంతో అర్థంతరంగా పథకం ప్రారంభం వాయిదా పడటం ఆందోళన కలిగిస్తోంది.
ఇప్పటికే వాలంటీర్లు పథకం ప్రారంభంపై లబ్ధిదారులకు సమాచారం అందజేశారు. మళ్లీ వాయిదా పడిందని కూడా వారు చెప్పాల్సి ఉంటుంది. మొత్తానికి తానొకటి తలిస్తే దైవమొకటి తలచిందన్నట్లుగా ప్రభుత్వం ఆలోచన ఒకటైతే జరిగేది మరొకటిలా ఉందని తెలుస్తోంది. దీంతో డబ్బులు ఎప్పుడు పడతాయోనని లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం మళ్లీ ఎప్పుడు ప్రారంభిస్తుందో అనే ఆలోచన అందరిలో వస్తోంది.
Also Read: రఘురామ రాజీనామా వెనుక ఇంత స్టోరీ ఉందా..?