Film Industry: గత రెండు సంవత్సరాలుగా టాలీవుడ్ తో పాటు దేశంలోని అన్ని చిత్ర పరిశ్రమలు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. కరోనా ఆగమనంతో పూర్తి సినారియో మారిపోయింది. 2020 పూర్తిగా కరోనా కోరల్లో చిక్కుకుంది. ప్రారంభం మినహాయిస్తే పది నెలల పాటు చిత్ర పరిశ్రమ స్తంభించి పోయింది. అయితే 2021 కొంత ఉపశమనం కలిగించింది. 2020 చివర్లో కరోనా ప్రభావం తగ్గడంతో 2021 ప్రారంభంలోనే చిత్రాలు విడుదలయ్యాయి.

రవితేజ క్రాక్ జనవరి 9న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అప్పటికి పూర్తిగా కరోనా ఆంక్షలు ఎత్తివేయలేదు. యాభై శాతం ఆక్యుపెన్సీకి మాత్రమే అనుమతి ఉంది. అయినప్పటికీ క్రాక్ రికార్డు వసూళ్లు రాబట్టింది. ఆ తర్వాత విడుదలైన వకీల్ సాబ్, ఉప్పెన, జాతి రత్నాలు, లవ్ స్టోరీ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ చిత్ర పరిశ్రమకు మునుపటి శోభ తీసుకువచ్చాయి. థియేటర్స్ కి ప్రేక్షకులను రప్పించాయి.
చివర్లో అఖండ తో బాలయ్య మరపురాని విజయం అందించారు. అఖండ టాప్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలవడంతో పాటు నిర్మాతలకు బయ్యర్లకు లాభాలు తెచ్చిపెట్టింది. ఇక పుష్ప మూవీతో అల్లు అర్జున్ ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. పుష్ప మూవీ తెలుగు రాష్ట్రాలలో లాభాలు రాబట్టలేకపోయింది. తెలంగాణాలో బ్రేక్ ఈవెన్ కి చేరిన పుష్ప ఆంధ్రప్రదేశ్ లో యాభై శాతానికి పైగా నష్టాలు మిగిల్చింది. అక్కడ టికెట్స్ ధరలు, థియేటర్స్ మూసివేత వంటి ప్రతికూల పరిస్థితులు దీనికి కారణమయ్యాయి.
ఇక కరోనా బాధ వదిలినట్లే.. పరిశ్రమ వరుసగా పాన్ ఇండియా చిత్రాల విడుదలతో దూసుకుపోతుందనుకుంటున్న తరుణంలో మహమ్మారి మరలా రంగంలోకి దిగింది. రెండు వారాల వ్యవధిలో సీన్ మొత్తం మార్చేసింది. దాదాపు ఏడాది కాలంగా ఆర్ ఆర్ ఆర్ కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకుల ఆశలపై నీళ్లు చల్లింది. కరోనా వ్యాప్తి రోజురోజుకు అధికం అవుతుండగా పలు రాష్ట్రాల్లో కరోనా ఆంక్షలు విధించాయి. యాభై శాతం సీటింగ్, నైట్ కర్ఫ్యూ, కొన్ని చోట్ల పూర్తిగా థియేటర్స్ మూసివేయడం జరిగింది.
Also Read: Sid Sriram: స్టార్ సింగర్ సిద్ శ్రీరామ్ కొత్త అవతారం?
దీనితో జనవరి 7న విడుదల కావాల్సిన ఆర్ ఆర్ ఆర్ వాయిదా వేశారు. కనీసం ప్రభాస్ రాధే శ్యామ్ సంక్రాంతికి విడుదలవుతుందని అనుకుంటే రాధే శ్యామ్ సైతం పోస్ట్ పోన్ చేశారు. దీనితో 2022 సంక్రాంతిపై పరిశ్రమకు, ప్రేక్షకులకు ఆశలు పోయాయి. మరోవైపు మహేష్ బాబుతో పాటు వివిధ పరిశ్రమలకు చెందిన ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. ఈ పరిణామాలు గమనిస్తుంటే 2022పై ఆశలు సన్నగిల్లుతున్నాయి. అసలు ప్రారంభమే ఇంత వరస్ట్ గా ఉంటే.. పూర్తి ఏడాది ఎన్ని గడ్డు పరిస్థితులు చూడాలనే భయం చోటు చేసుకుంటుంది. 2020, 2021తో పోల్చుకుంటే 2022 ప్రారంభం చాలా దరిద్రంగా ఉందనేది పలువురి అభిప్రాయం.
Also Read: Sonu Sood quits : సోనూసూద్ షాకింగ్ నిర్ణయం.. కారణం అదే !