Yadadri Yagam: కేసీఆర్, చిన్నజీయర్ స్వామి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. శిలాఫలకం మీద సీఎం పేరు లేకపోవడంతో అలక బూనిన కేసీఆర్ చిన్న జీయర్ స్వామిని పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ఇకపై ఆయనతో ఏ కార్యక్రమం కూడా నిర్వహించేందుకు ఇష్టపడటం లేదని చెబుతున్నారు. దీంతో యాదాద్రి పనుల్లో కూడా ఆయన పాత్ర ఉండకుండా చేసేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే మార్చి 28న చేపట్టే సంప్రోక్షణ యాగం వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
కేసీఆర్ కు ఒకసారి కోపం వస్తే ఇక అంతే సంగతి. ఇక వారిని గురించి ఆలోచించరు. వారితో ఏ పని కూడా పెట్టుకోరు. ఇది చాలా సందర్భాల్లో జరిగిందే. కానీ ప్రస్తుతం మాత్రం కేసీఆర్ లో వచ్చిన ఆగ్రహంతో భక్తి కార్యక్రమాల్లో సైతం రాజకీయాలు చోటుచేసుకోవడం ఏ మాత్రం సరికాదనే వాదన వస్తోంది. కేసీఆర్ చిన్న జీయర్ స్వామిపై ఉన్న కోపంతోనే ఇలా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో మహా కుంభ సంప్రోక్షణ కార్యక్రమం వాయిదా వేయడానికి కారణాలు వేరే ఉన్నాయని తెలుస్తున్నాయి. కానీ దీనికి అధికారులను బాధ్యులను చేస్తూ పనులు పూర్తి కాకపోవడంతోనే వాయిదా వేస్తున్నామని కేసీఆర్ ప్రకటించడం అనుమానాలకు తావిస్తోంది. ఏదైనా కేసీఆర్ అనుకుంటే చేయడానికి వెనుకంజ వేయరు. అది భక్తి అయినా సరే ఇంకేదైనా కానీ అలా చేయడం ఆయనకు అలవాటే.
Also Read: నేడు జగ్గారెడ్డి రాజీనామా? కాంగ్రెస్ కు షాక్?
చిన్న జీయర్ స్వామిని యాదాద్రి రాకుండా చూసేందుకు నిర్ణయించుకున్నారు. ఇన్నాళ్లు అన్ని పనులు దగ్గరుండి పర్యవేక్షించిన జీయర్ స్వామికి ఇక ఆలయంలోకి వెళ్లే అవకాశం లేదని తెలుస్తోంది. ఏదో చిన్న పొరపాటుకు కేసీఆర్ ఇంతలా కక్ష కట్టడంలో అర్థం లేదని పలువురు పేర్కొంటున్నారు. కానీ అసలు కారణం అది కాదని కూడా భావిస్తున్నారు.
ముచ్చింతల్ కు ప్రధానిని ఆహ్వానించడమే కేసీఆర్ కు ఇష్టం లేదని చెబుతున్నారు. కానీ నాలుగేళ్ల క్రితమే అనుకున్న కార్యక్రమం కావడంతో సమతామూర్తి విగ్రహావిష్కరణకు ప్రధానిని ఆహ్వానించడంలో ఏం తప్పుందో ఎవరికి అర్థం కావడం లేదు. ప్రధాని మీద ఉన్న కోపంతోనే కేసీఆర్ చిన్న జీయర్ స్వామిని కూడా టార్గెట్ చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Also Read: పేరు లేదనే అలకబూనిన కేసీఆర్ః వివరణ ఇచ్చిన జీయర్ స్వామి