Homeజాతీయ వార్తలుKCR Medaram: కేసీఆర్ సార్ మేడారం రాకపోయే.. విమర్శల జడివాన మొదలాయే!

KCR Medaram: కేసీఆర్ సార్ మేడారం రాకపోయే.. విమర్శల జడివాన మొదలాయే!

KCR Medaram: తెలంగాణ సీఎం కేసీఆర్ మధ్యాహ్నం 2 గంటలకు మేడారం వస్తున్నారని.. గిరిజన దేవతలను స్వయంగా కుటుంబంతో దర్శించుకుంటారని షెడ్యూల్ ఫిక్స్ అయ్యింది. దీంతో మంత్రులు ఎర్రబెల్లి, తలసాని, సత్యవతి రాథోడ్ సహా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఉన్నతాధికారులు అంతా అక్కడ సీఎం కు స్వాగతం పలికేందుకు కాచుకూర్చున్నారు. కానీ కేసీఆర్ షాకిచ్చాడు.

KCR Medaram
KCR Medaram

మధ్యాహ్నం 2 గంటలు అయ్యింది రాలేదు. 4 గంటల వరకూ మంత్రులు వేచి ఉన్నారు అయినా రాలేదు. చివరకు 5 గంటలకు తెలంగాణ సీఎంవో కేసీఆర్ పర్యటన రద్దు అయ్యిందని ప్రకటించింది. దీంతో మంత్రులు, అధికారులు హతాషులయ్యారు. కేసీఆర్ మీటింగ్ కోసం వేచివేచి చివరకు ఉసూరుమన్నారు.

Also Read:  టంగుటూరి వీరేహం బకాహం పంతులు అంటే.. ట్రోలింగ్ చెయ్యరా ?

కేసీఆర్ మేడారం సమ్మక్క సారలమ్మలను ప్రతీ సంవత్సరం దర్శించుకుంటారు. గిరిజన దేవతల పట్ల భక్తిని చాటుకుంటాడు. అయితే ఈ సంవత్సరం కూడా ప్లాన్ చేసుకున్నా ఎందుకో సడెన్ గా రద్దు చేసుకున్నారు. ఇక కేసీఆర్ మేడారం పర్యటన రద్దు చేసుకోవడంతో బీజేపీ విమర్శలను ఎక్కుపెట్టింది. కేసీఆర్ ను ఇరుకునపెట్టింది.

Also Read:  ఆ ప్రాంతాల్లో కూడా స్టూడియోలు క‌ట్టాలంట‌.. జ‌గ‌న్ పెద్ద ప్లానే వేశారే..!

గిరిజనులు అంటే కేసీఆర్ కు లెక్కలేదని.. గిరిజన దేవతలను కేసీఆర్ అవమానించాడని.. సమ్మక్కను దర్శించుకునే టైం లేదా? అని రాజకీయ వివాదాన్ని రాజేసింది.ఆదివాసీల పండుగకు ఉదయం హాజరైన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డిలు ఫైర్ అయ్యారు. చివరి క్షణంలో మేడారం పర్యటనను రద్దు చేసుకోవడంపై కేసీఆర్‌ ను తప్పుబట్టారు. పేదలు, గిరిజనుల పండుగలపై కేసీఆర్‌కు ఎంత ఆసక్తి ఉందో ఇది స్పష్టంగా తెలియజేస్తోందని బండి సంజయ్ దుయ్యబట్టారు. పండుగను ఎగ్గొట్టి గిరిజన సమాజాన్ని, తెలంగాణ సంస్కృతిని కేసీఆర్ అవమానించారన్నారు. కేసీఆర్ అహంకారాన్ని మాత్రమే తెలియజేస్తుందన్నారు.

Also Read:  మ‌హేశ్ బాబు ఖాతాలో కొత్త యాడ్‌.. వీడియో హాలివుడ్ రేంజ్‌లో ఉందిగా..!

కేసీఆర్ ఏ కారణంతో మేడారం పర్యటనను రద్దు చేసుకున్నారో తెలియదు కానీ.. ఇప్పుడు రాజకీయంగా ఫోకస్ అయ్యారు.గిరిజనలు ఆగ్రహానికి గురికావాల్సి వస్తోంది. మరి ఈ ఉపద్రవం నుంచి కేసీఆర్ ఎలా బయటపడుతాడో వేచిచూడాలి.

Recommended Video:

Son Of India 2nd Day Collections || Mohan Babu Son Of India Collections || Ok Telugu Entertainment

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

6 COMMENTS

  1. […] Boyapati Srinu: యాక్షన్ చిత్రాల దర్శక దిగ్గజం బోయపాటి శ్రీను ‘అఖండ’తో అఖండమైన విజయాన్ని సాధించి ఫుల్ జోష్‌లో ఉన్నాడు. అఖండ’ విజయంతో మళ్లీ ఫుల్ ఫామ్‌ లోకి వచ్చిన ఈ మాస్‌ డైరెక్టర్‌ తన తర్వాతి చిత్రం ఎవరితో చేస్తారా ? అన్న ఆసక్తి ఇండస్ట్రీలో నెలకొంది. ఆ ప్రశ్నకు సమాధానం చెబుతూ ప్రకటన వచ్చేసింది. యువ కథానాయకుడు రామ్‌ హీరోగా బోయపాటి ఓ సినిమా చేయనున్నారు. […]

Comments are closed.

Exit mobile version