Covid Rules in AP: ఏపీలో రోజు రోజుకూ కరోనా కేసులు తగ్గుతున్నాయి. దీంతో ప్రభుత్వం కూడా కొవిడ్ రూల్స్‌ను ఎత్తి వేస్తోంది. ఒక్కొక్కటిగా తగ్గించుకుంటూ వస్తోంది జగన్ ప్రభుత్వం. వ్యాపార రంగాలు, చిన్న వృత్తుల వారిని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే ఆంక్షలను సడిలించింది. రీసెంట్ గానే నైట్ కర్ఫ్యూను కూడా ఎత్తి వేసింది జగన్ సర్కార్.
ఇక తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. సచివాలయంలో కొవిడ్ ఆంక్షలను తొలగిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు సీఎస్ సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. సచివాలయంలో ఇప్పటి వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న వారందరూ తిరిగి ఆఫీసులకు రావాలని ఆదేశించారు. ఇక నుంచి అన్ని సమావేశాలకు ఆన్ లైన్‌లో కాకుండా భౌతికంగా హాజరు కావాలంటూ తెలిపారు.
Also Read: KCR-Jagan: మూడో కూటమిలో జగన్ చేరతారా? కేసీఆర్ తో కలుస్తారా?
అందరూ ఆఫీసులకు రావాలని, ఏ ఒక్కరికీ మినహాయింపు లేదని తెలిపారు. ఇక నుంచి ప్రభుత్వం నిర్వహించే అన్ని మీటింగులకు అందరూ రావాలంటూ తెలిపారు. ఇక నుంచి రెగ్యులర్ గానే అన్ని రకాల మీటింగులు నడుస్తాయన్నారు. అన్ని శాఖలకు సూచనలు వెళ్లాయని ఆయన వివరించారు. కాగా సచివాలయానికి వచ్చే ఉన్నతాధికారులు కూడా బయోమెట్రిక్ తో పాటు ఫేస్ రికగ్నేషన్ ప్రాసెస్ ను పాటించాలన్నారు.
సెకండ్ వేవ్ అప్పటి నుంచే సచివాలయంలో ఆంక్షలు కొనసాగుతున్నాయి. కొందరికి అప్పటి నుంచే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు. ఆ తర్వాత 50శాతం సిబ్బంది హాజరయ్యే విధానాన్ని కూడా మొన్నటి వరకు అమలు చేశారు. అయితే మంత్రులు నిర్వహించే సమావేశాలకు అందరూ వీడియో కాన్ఫరెన్స్ లోనే హాజరవుతున్నారు. దీని వల్ల పనుల్లో ఆలస్యం జరుగుతోందని గ్రహించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఏపీలో 500 కంటే తక్కువనే కేసులు నమోదవుతున్నాయి. కాగా అందరూ కరోనా జాగ్రత్తలు పాటించాలని సీఎస్ కోరారు.
Also Read: అయ్యో పాపం గౌతం సవాంగ్? బదిలీ చేయడంలో ఆంతర్యమేమిటో?