https://oktelugu.com/

చంద్రబాబు మౌనం.. మరణ శాసనమేనా?

నాడు తెలంగాణ.. నేడు రాయలసీమ.. టీడీపీ అధినేత చంద్రబాబులో అదే సందిగ్ధత. అదే వ్యూహాత్మక మౌనం.. ఒప్పుకుంటే ఓ ప్రాంతానికి నష్టం.. ఒప్పుకోకుంటే రాజకీయంగా తీవ్ర నష్టం. ఏమీ చేయాలో తెలియక చంద్రబాబు ‘వ్యూహాత్మక మౌనం’ అనే ఎజెండాను ఎంచుకుంటారు. ఇప్పుడూ అదే జరిగింది. కానీ అదిప్పుడు తెలంగాణలో వలే రాయలసీమలోనూ చంద్రబాబుకు మరణశాసనాన్ని లిఖిస్తోందన్న వాదన టీడీపీ వర్గాల్లో ఆందోళనకు గురిచేస్తోందట.. చంద్రబాబుది ఎప్పుడూ రెండుకళ్ల సిద్ధాంతమే.. తెలంగాణ ఉద్యమం సందర్భంగా రెండు కళ్ల సిద్ధాంతంతో […]

Written By:
  • NARESH
  • , Updated On : August 12, 2020 / 04:50 PM IST
    Follow us on


    నాడు తెలంగాణ.. నేడు రాయలసీమ.. టీడీపీ అధినేత చంద్రబాబులో అదే సందిగ్ధత. అదే వ్యూహాత్మక మౌనం.. ఒప్పుకుంటే ఓ ప్రాంతానికి నష్టం.. ఒప్పుకోకుంటే రాజకీయంగా తీవ్ర నష్టం. ఏమీ చేయాలో తెలియక చంద్రబాబు ‘వ్యూహాత్మక మౌనం’ అనే ఎజెండాను ఎంచుకుంటారు. ఇప్పుడూ అదే జరిగింది. కానీ అదిప్పుడు తెలంగాణలో వలే రాయలసీమలోనూ చంద్రబాబుకు మరణశాసనాన్ని లిఖిస్తోందన్న వాదన టీడీపీ వర్గాల్లో ఆందోళనకు గురిచేస్తోందట.. చంద్రబాబుది ఎప్పుడూ రెండుకళ్ల సిద్ధాంతమే.. తెలంగాణ ఉద్యమం సందర్భంగా రెండు కళ్ల సిద్ధాంతంతో చంద్రబాబు విసిరిన పాచిక ఎంత పాపులర్ అయ్యిందో మనం చూశాం.. తెలంగాణను వ్యతిరేకించకుండా ఆంధ్రాను కాదనకుండా బాబు గారు ప్రవేశపెట్టిన ఈ సిద్ధాంతం ఇప్పుడు మళ్లీ ఆయనకు అవసరమైంది.

    Also Read: ఎక్స్ క్లూజివ్: రాపాక విషయంలో పవన్ కి హెల్ప్ చేసిన జగన్..! ఏమన్నా రాజకీయమా….?

    సీఎం జగన్ రాయలసీమ కరువు తీర్చేలా ‘రాయలసీమ ఎత్తిపోతల పథకం’ చేపట్టారు. రాయలసీమ ఎత్తిపోతల ద్వారా సీమ రూపురేఖలే మారతాయి. అది జరిగితే చంద్రబాబుకు రాయలసీమలో రాజకీయ సమాధి తప్పదు. అందుకే రాయలసీమ ప్రయోజనాల కన్నా తన స్వార్థ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తూ… ఆ ప్రాజెక్ట్‌ను అడ్డుకునే వెన్నుపోటు రాజకీయానికి తెరతీశారన్న ప్రచారం రాజకీయవర్గాల్లో సాగుతోంది. తాను అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేదు. ఇప్పుడు సీఎం జగన్‌ చేస్తుంటే తెలంగాణ నేతల వాదానికి అనుకూలంగా, సీమకు వ్యతిరేకంగా మాట్లాడుతూ కరువు సీమ జనం నోట్లో మరోసారి మట్టికొట్టే ప్రయత్నం చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

    చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు సాగునీటి ప్రాజెక్ట్‌ల నిర్మాణాన్ని పట్టించుకోలేదు. అందుకు పోలవరమే ఉదాహరణ. ఆయన చేసిన అభివృద్ధి ఎలాంటిదో ఎడారిగా మారిన సీమను చూస్తే అర్థమవుతుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నవారికి అడ్డం పడడమే ఆయన లక్ష్యం. అప్పుడు రాజశేఖరరెడ్డి జలయజ్ఞం చేపట్టినా, ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మిస్తున్నా అడ్డంకులు సృష్టించడమే ఆయన గొప్పతనం. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వంతో సహా రాజకీయ పార్టీలన్నీ ముక్తకంఠంతో ఒక్కటై దక్షిణ తెలంగాణకు అన్యాయం జరుగుతుందని గగ్గోలు పెడుతున్నాయి. ఏపిలో పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి అండగా నిలవాల్సిన ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా తెలుగుదేశం, కాంగ్రెస్, సిపిఐ లాంటివి ప్రభుత్వంపైనే ఎదురుదాడి చేస్తున్నాయి. చంద్రబాబు నాయుడు ఏ విధంగానైనా ప్రాజెక్ట్ ఆగిపోవాలనే ధోరణిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. రాయలసీమ ఎత్తిపోతలను జగన్ పూర్తి చేస్తే రాజకీయంగా చంద్రబాబుకు అక్కడ సమాధి అనే ఆందోళన టీడీపీలో ఉంది.

    Also Read: “పోలవరం కూలిపోయిందా…?” ఎంత దురదృష్టకరం….మరిప్పుడు వైసీపీ చేస్తున్నదేంటి?

    రాయలసీమ ప్రాజెక్ట్ ను పరుగులు పెట్టిస్తే జగన్ కు మంచి పేరు వస్తుందనేది చంద్రబాబు భయంగా కనిపిస్తోంది. ఇక్కడ కూడా రాజకీయంగా ఆలోచిస్తున్నారే తప్ప రాష్ట్ర ప్రయోజనాల గురించి అస్సలు మాట్లాడడం లేదు. సీమ ఎత్తిపోతలతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు ప్రయోజనం చేకూర్చాలని జగన్ మోహన రెడ్డి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సిద్ధమయ్యారు. ఆ పథకం ప్రస్తుతం టెండర్ల దశలో ఉంది. ఈ పథకంపై తెలంగాణ ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీలు ఒక్కటై ఆరోపణలు చేస్తుంటే ఏపిలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. చంద్రబాబు మాటే వేదంగా నడుచుకునే పచ్చమీడియా, పార్టీలు, ఆయనకు వంతపాడుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ పైన ప్రభుత్వ వైఖరి వల్ల నష్టం జరుగుతుందని కలర్ ఇచ్చేలా చంద్రబాబు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు.

    ఏపి ప్రభుత్వం రాయయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి మే లో ఉత్తర్వులు జారీ చేసినా తెలంగాణ సీఎం వారం రోజుల క్రితం వరకు నోరు మెదపలేదు. తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు కూడా స్పందించలేదు. రాజకీయ ప్రయోజనాలతో ఇటు చంద్రబాబు అండ్ కో తెలంగాణాలో కాంగ్రెస్ లోని గ్రూపులు, బిజెపీ నేతలు ఇటు ఏపీ, అటు తెలంగాణ ప్రభుత్వాలపై విమర్శలు చేస్తుండటం స్పందించక తప్పని పరిస్థితి నెలకొనటంతో ఏపీ చర్యలను అడ్డుకుంటామని తెలంగాణ ముఖ్యమంత్రి ప్రకటించారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే విధంగా చర్యలు చేపట్టిన జగన్ ను అభినందిచకపోయినా నష్టం కలిగించేలా వ్యహరించకుండా ఉండాల్సిన చంద్రబాబు మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. అటు కేసీఆర్ ను, తెలంగాణ రాజకీయపక్షాలను ఎగదోస్తూ.. ఇటు ఏపీలో సీమ ఎత్తిపోతల జరగకుండా అడ్డుపుల్లులు వేస్తూ ఏపీని నాశనం చేసేలా చంద్రబాబు చర్యలు ఉంటాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

    -ఎన్నం