జగన్ ఎడ్డెమ్ అంటే తెడ్డం అంటారు పవన్ కళ్యాణ్ జనసేన స్థాపించిన నాటి నుండి పవన్ తన ప్రధాన రాజకీయ ప్రత్యర్థిగా జగన్ నే భావించారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల తరుపున పోరడతాం అని చెప్పిన పవన్, తెలంగాణా ప్రభుత్వం పట్ల ఎప్పుడూ సానుకూల దృక్పథం కలిగి ఉన్నాడు. వీలైతే కేసీఆర్ నిర్ణయాలను స్వాగతిస్తూ పవన్ మీడియా ముఖంగా కృతజ్ఞతలు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఐతే జగన్ పట్ల ఆయన వైఖరి అలా ఉండదు. దూకుడు స్వభావం, పరుష వ్యాఖ్యలతో రెచ్చిపోతూ ఉంటారు. జగన్ తీరు మారి…తన పాలనపై నమ్మకం కుదిరే వరకు జగన్ రెడ్డి అని మాత్రమే అని పిలుస్తాను అని చెప్పి పవన్ తన వ్యతిరేకత తెలియజేశారు.
కారణం ఏమిటో తెలియదు కానీ గతకొంత కాలంగా పవన్ జగన్ పై విమర్శల దాడి తగ్గించారు. ఈ మధ్య జగన్ తీసుకున్న నిర్ణయాలపై ఆయన పల్లెత్తి మాటనలేదు. రాజకీయ నాయకుల అరెస్టులపై టీడీపీ నానా యాగీ చేస్తున్నా, పవన్ మాత్రం నోరుమెదపలేదు. గతంలో టీడీపీ చేసే ప్రతి విమర్శకు పవన్ కూడా వంతపాడే వారు కాగా, అది ఇప్పుడు కనిపించడం లేదు. ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంపై టీడీపీ హై కోర్ట్ నుండి స్టే తీసుకువచ్చి నిలిపివేసింది. దీనిపై అటు జగన్ ప్రభుత్వం గురించి కానీ ఇటు టీడీపీ విమర్శలపై కానీ పవన్ తన స్టాండ్ ఏమిటో వ్యక్తపరచలేదు. టీడీపీ రోజుకొక విమర్శతో సోషల్ మీడియా వేదికగా నానా యాగీ చేస్తున్నా, పవన్ ఇదివరలా మాట్లాడక పోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇక ఇటీవల అమరావతి ఉద్యమం 200రోజులు పూర్తి చేసుకోగా పవన్ సోషల్ మీడియాలో కేవలం ఒక లెటర్ లో రైతుల అభిప్రాయాలను గౌరవించాలని, వారికి రావలసిన పరిహారం చెల్లించాలని నివేదన పూర్వకంగా వ్యవహరించారు. ఒకప్పుడు ఆయన రాజధానిని ఒక అంగుళం కూడా కదిలించలేరు..నేను ఉన్నాననని శబధం చేసిన తెలిసిందే.
టీడీపీ బలాన్ని దెబ్బకొడుతున్న జగన్.
ఒంటరిగా ఉన్నప్పుడు దూకుడు చూపిన పవన్ అధికార పార్టీ బీజేపీ అండ ఉంచుకొని సైలెంట్ ఎందుకయ్యాడనేది, ఎవరికీ అర్థం కావడం లేదు. విమర్శించకపోగా కొత్త అంబులెన్సుల కొనుగోళ్లు, కరోనా నిర్వహణలో భేష్ అంటూ జగన్ ని పొగడం కూడా చూశాం. అకస్మాత్తుగా పవన్ లో మొదలైన ఈ పరివర్తనకు కారణం ఏమిటో అంతుబట్టడం లేదు. ప్రస్తుతానికి జగన్ ప్రభుత్వంపై విమర్శల దాడి తగ్గించారా లేక ఇదే వైఖరిని భవిష్యత్తులో కూడా కొనసాగిస్తాడా అనేది చూడాలి. ఏపీ ప్రభుత్వంపై పవన్ విమర్శల దాడి తగ్గించిన వేళ…ఆంధ్రా బీజేపీ నాయకులు విమర్శల జోరు పెంచడం విశేషం.