https://oktelugu.com/

షాకింగ్… అమితాబ్‌, అభిషేక్‌ బచ్చన్‌లకు కరోనా

బాలీవుడ్‌లో అలజడి రేగింది. ఇండియన్‌ సూపర్ స్టార్, బిగ్‌ బి అమితాబ్ బచ్చన్ కు కరోనా సోకింది. ఆయనతో పాటు కుటుంబ సభ్యులు, స్టాఫ్ కరోనా టెస్టులు చేయించుకున్నారు. అమితాబ్ కొడుకు, నటుడు అభిషేక్ బచ్చన్ కూడా పాజిటివ్ అని తేలింది. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందంటూ అమితాబ్ శనివారం రాత్రి ట్వీట్ చేశారు. ‘నాకు కోవిడ్ పరీక్షలో పాజిటివ్ అని తేలింది. హాస్పిటల్లో చేరాను హాస్పిటల్ సిబ్బంది, నా కుటుంబ సభ్యులు, నా వద్ద పని […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 12, 2020 / 12:28 PM IST
    Follow us on


    బాలీవుడ్‌లో అలజడి రేగింది. ఇండియన్‌ సూపర్ స్టార్, బిగ్‌ బి అమితాబ్ బచ్చన్ కు కరోనా సోకింది. ఆయనతో పాటు కుటుంబ సభ్యులు, స్టాఫ్ కరోనా టెస్టులు చేయించుకున్నారు. అమితాబ్ కొడుకు, నటుడు అభిషేక్ బచ్చన్ కూడా పాజిటివ్ అని తేలింది. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందంటూ అమితాబ్ శనివారం రాత్రి ట్వీట్ చేశారు. ‘నాకు కోవిడ్ పరీక్షలో పాజిటివ్ అని తేలింది. హాస్పిటల్లో చేరాను హాస్పిటల్ సిబ్బంది, నా కుటుంబ సభ్యులు, నా వద్ద పని చేసే వారికి కూడా పరీక్షలు నిర్వహించారు. ఫలితాలు రావాల్సి ఉంది. గత పది రోజులుగా నన్ను కలిసిన, నాకు దగ్గరగా ఉన్న అందరూ దయచేసి కరోనా టెస్టులు చేయించుకోండి’ అని అమితాబ్ ట్వీట్ చేశారు. ఆయన కుమారుడు అభిషేక్ సైతం తనకు కోవిడ్ పాజిటివ్ అని నిర్ధరణ అయిందని ట్విటర్ ద్వారా తెలిపారు. తనకు, తన తండ్రికి కోవిడ్ లక్షణాలు స్వల్పంగా ఉన్నాయని అభిషేక్ చెప్పారు. అభిషేక్ ఆరోగ్యం స్థిరంగా ఉందని హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి.

    పవన్ కొత్త సినిమాల పైన ఎఫెక్ట్ !

    77 ఏళ్ల అమితాబ్, 44 ఏళ్ల అభిషేక్ ఇద్దరూ ప్రస్తుతం ముంబయిలోని నానావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మూత్ర పిండాల నొప్పితో కొన్ని రోజుల కిందట అమితాబ్‌ నానావతిలో చేరారు. అనుమానంతో వైద్యులు కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్‌ అని తేలింది. ఈ క్రమంలో అమితాబ్ భార్య జయా బచ్చన్, కొడుకు అభిషేక్‌, కోడలు ఐశ్వర్యా రాయ్ సహా కుటుంబ సభ్యులందరికీ కూడా కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. అభిషేక్‌ మినహా మిగతా వారికి కోవిడ్ నెగెటివ్ వచ్చిందని ఆదివారం ఉదయం మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపే తెలిపారు.అమితాబ్, అభిషేక్ బచ్చన్‌లకు కోవిడ్ లక్షణాలు స్వల్పంగా ఉన్నాయి. వారి కుటుంబ సభ్యులెవరికీ కరోనావైరస్ సోకలేదని ప్రకటించారు. మరోవైపు అమితాబ్‌ కుటుంబంలో ఇద్దరికి కరోనా రావడంతో బృహన్‌ ముంబై కార్పొరేషన్‌ (బీఎంసీ) అధికారులు అప్రమత్తమయ్యారు. తమ సిబ్బందిని బిగ్‌బి ఇల్లు జల్సాకి వచ్చారు. ఇంటి పరిసరాలతో పాటు చుట్టు పక్కల ప్రాంతాలను పూర్తిగా శానిటైజ్‌ చేశారు. ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్‌ జోన్‌గా ప్రకటిస్తు.. అమితాబ్‌ ఇంటి ముందు నోటీసులు అంటించారు. ఇక, అమితాబ్‌, అభిషేక్‌ త్వరగా కోలుకోవాలని బాలీవుడ్‌ ప్రముఖులు ఆకాంక్షించారు.

    https://twitter.com/juniorbachchan/status/1282018653215395840