సంచుల రాజకీయం.. బీజేపీ కపటం

ఒకప్పుడు సంచుల రాజకీయాలు కాంగ్రెస్ కు పేటెంట్ హక్కులా ఉండేవి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ కుదేలైన వేళ ఆ పార్టీపైనే బీజేపీ ఈ రాజకీయాన్ని చేస్తోంది. కాంగ్రెస్ ను మించిపోతూ ఆ పార్టీ పునాదులు కదులుస్తోంది. రాష్ట్రాల్లో కూలదోసి రాజకీయాన్ని హస్తగతం చేసుకుంటోంది. ఓ కర్ణాటక, ఓ మధ్యప్రదేశ్.. ఇప్పుడు రాజస్థాన్. ఇలా వరుసగా బీజేపీ స్కెచ్చులు వేస్తోంది. ఒక్క మహారాష్ట్రలో మాత్రమే శివసేన ముందర బీజేపీ పప్పులు ఉడకలేవు. అక్కడ పార్టీలు పట్టుదలతో ఉండడంతో బీజేపీకి […]

Written By: NARESH, Updated On : July 12, 2020 8:03 pm
Follow us on

ఒకప్పుడు సంచుల రాజకీయాలు కాంగ్రెస్ కు పేటెంట్ హక్కులా ఉండేవి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ కుదేలైన వేళ ఆ పార్టీపైనే బీజేపీ ఈ రాజకీయాన్ని చేస్తోంది. కాంగ్రెస్ ను మించిపోతూ ఆ పార్టీ పునాదులు కదులుస్తోంది. రాష్ట్రాల్లో కూలదోసి రాజకీయాన్ని హస్తగతం చేసుకుంటోంది.

ఓ కర్ణాటక, ఓ మధ్యప్రదేశ్.. ఇప్పుడు రాజస్థాన్. ఇలా వరుసగా బీజేపీ స్కెచ్చులు వేస్తోంది. ఒక్క మహారాష్ట్రలో మాత్రమే శివసేన ముందర బీజేపీ పప్పులు ఉడకలేవు. అక్కడ పార్టీలు పట్టుదలతో ఉండడంతో బీజేపీకి అధికార శృంగభంగం ఎందురైంది. కానీ కర్ణాటక, మధ్యప్రదేశ్ లో మాత్రం కోట్లు కుమ్మరించి ఎమ్మెల్యేలను కొని కాంగ్రెస్ ను కూలదోసి అధికారాన్ని హస్తగతం చేసుకుంది. బోటా బోటా మెజార్టీతో ఉన్న మధ్యప్రదేశ్ లో ఈ కరోనావ్యాప్తికి ముందు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చి బీజేపీ గద్దెనెక్కింది. కాంగ్రెస్ యువనేత జ్యోతిరాధిత్య సింధియాను బీజేపీవైపు తిప్పుకొని ఎమ్మెల్యేలను లాగేసి కొలువుదీరింది.

దేశంలో పార్టీలు, వాటి స్థితిగతులు

ఇప్పుడు బీజేపీ చూపు రాజస్థాన్ పై పడింది. రాజస్థాన్ లోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని.. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.15కోట్లు, మంత్రి పదవి కూడా ఆఫర్ చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత.. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో రాజకీయంగా అలజడి సృష్టించేందుకు బీజేపీ పన్నాగాలు పన్నుతోందని మండిపడ్డారు. కర్ణాటక, మధ్యప్రదేశ్ మాదిరిగా రాజస్థాన్ లోనూ బీజేపీ రాజకీయం మొదలుపెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరికీ డబ్బులు.. మరికొందరికీ పదవులు ఇస్తామని మభ్య పెడుతున్నారని ఆరోపించారు.

బీజేపీ చేసే పనులను ప్రజలు గమనిస్తున్నారని.. వచ్చే ఎన్నికల్లో వారికి తగిన బుద్ధి చెబుతారని సీఎం అశోక్ గెహ్లాట్ అన్నారు.సీబీఐ, ఈడీ పేరుతో బీజేపీ కాంగ్రెస్ నేతలను భయభ్రాంతులకు గురిచేస్తోందని ఆరోపించారు.

నిమ్మగడ్డ వ్యవహారంతో ఉలిక్కిపడ్డ ఆంధ్రా బీజేపీ..!

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జోషి తాజాగా కాంగ్రెస్ పార్టీకి కుషల్ ఘడ్ ఎమ్మెల్యేతో సంప్రదింపులు జరపాడని ఆ రాష్ట్ర మీడియాలో వార్తలు వచ్చాయి. ఒక వర్గానికి నాయకుడైన ఆయన చేతిలో చాలామంది ఎమ్మెల్యేలున్నారు. ఆయనకు మంత్రి పదవిని 15 కోట్ల ఆఫర్ ను ఇచ్చి బీజేపీ తనవైపు తిప్పుకొని రాజస్థాన్ లోని బోటాబోటీ కాంగ్రెస్ సర్కార్ కూల్చడానికి ప్రయత్నించిందన్నది ప్రధాన ఆరోపణ.

ఈ విషయం తెలిసి రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ పెడబొబ్బలు పెడుతున్నారు. నిజానికి కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి పనులు చాలా చేసి బీజేపీకి పాఠాలు నేర్పింది. ఇప్పుడు బీజేపీ అంతకంటే దారుణంగా చేస్తోంది.మారింద అధికారం తప్పితే రాజకీయం కాదన్నది ఇక్కడ అర్థమవుతోంది. ఏ పార్టీ మారినా.. ఎవరూ ఆ సీట్లో కూర్చున్నా సంచులతో రాజకీయాలు మారవని తేలిపోయింది..

-ఎన్నం