https://oktelugu.com/

ఊపందుకున్న ‘రియల్‌’ బిజినెస్‌ : హాట్‌ కేకుల్లా ఫ్లాట్ల అమ్మకాలు

కోవిడ్‌ కారణంగా దేశవ్యాప్తంగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ఢమాల్‌ అంది. ఎక్కడికక్కడ అమ్మకాలు.. కొనుగోళ్లు నిలిచిపోయాయి. అటు రిజిస్ట్రేషన్లు సైతం నిలిచిపోవడంతో ఆర్థిక లావాదేవీలకు బ్రేక్‌పడింది. కరోనా క్రైసిస్‌ కారణంగా కొంత మంది ఇచ్చిన అడ్వాన్స్‌లను సైతం రిటర్న్ తీసుకున్నారు. ఏడాదిపాటు బిజినెస్‌ పూర్తిగా డల్‌ కావడంతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు సైతం ఢీలా పడిపోయారు. Also Read: బీజేపీ తన నిర్ణయాన్ని మార్చుకుందా..? : తిరుపతి సీటు జనసేనకేనా..? ఇక ఈ మధ్యనే మళ్లీ రియల్‌ […]

Written By:
  • Srinivas
  • , Updated On : February 27, 2021 / 01:01 PM IST
    Follow us on


    కోవిడ్‌ కారణంగా దేశవ్యాప్తంగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ఢమాల్‌ అంది. ఎక్కడికక్కడ అమ్మకాలు.. కొనుగోళ్లు నిలిచిపోయాయి. అటు రిజిస్ట్రేషన్లు సైతం నిలిచిపోవడంతో ఆర్థిక లావాదేవీలకు బ్రేక్‌పడింది. కరోనా క్రైసిస్‌ కారణంగా కొంత మంది ఇచ్చిన అడ్వాన్స్‌లను సైతం రిటర్న్ తీసుకున్నారు. ఏడాదిపాటు బిజినెస్‌ పూర్తిగా డల్‌ కావడంతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు సైతం ఢీలా పడిపోయారు.

    Also Read: బీజేపీ తన నిర్ణయాన్ని మార్చుకుందా..? : తిరుపతి సీటు జనసేనకేనా..?

    ఇక ఈ మధ్యనే మళ్లీ రియల్‌ బిజినెస్‌ ఊపందుకుంది. ముఖ్యంగా హైదరాబాద్‌ కేంద్రంలో వ్యాపారం ఊపందుకుంది. కోవిడ్‌ ఒడిదుడుకులు, ధరణి అడ్డంకులను అధిగమించి.. పెరుగుతున్న ధరలతో పోటీపడుతూ ప్రస్తుతం స్థిరాస్తి రంగం పరుగులు పెడుతోంది. కొత్త సంవత్సరంలో లావాదేవీలు వేగం పుంజుకున్నాయి. బ్యాంకుల్లో డిపాజిట్లపై వడ్డీరేట్లు తగ్గడంతో స్థిరాస్తుల్లో పెట్టుబడి పెడుతున్న వారు పెరిగారు. ఇలాంటి వారు స్థలాలు కొనుగలు చేస్తుంటే.. హౌసింగ్‌ లోన్లపై వడ్డీ రేట్లు సైతం తగ్గడంతో రుణాల తీసుకొని అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్లు, విల్లాలు కొంటున్నారు. మార్కెట్లో సిద్ధంగా ఉన్న ఇళ్లు, కొత్త ప్రాజెక్టుల్లో ఫ్లాట్లు, వెంచర్లలో స్థలాలు హాట్‌ కేకుల్లా బుకింగ్‌లు అవుతున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

    నగరం చుట్టూ మౌలిక ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రభుత్వాలు ప్రాధాన్యం ఇస్తుండడం.. పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఓఆర్ఆర్‌‌ బయట పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తుండడంతో మార్కెట్లో సానుకూలత నెలకొంది. కోవిడ్‌తో ఐటీ కార్యాలయాలన్నీ చాలావరకు ఇంటి నుంచే పనిచేస్తున్నా ఆ ప్రభావం స్థిరాస్తి రంగంపై తాత్కాలికమేనని అంటున్నాయి. పశ్చిమ హైదరాబాద్‌ను దాటి ఐటీ కార్యాలయాలు నగరంలోని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి.

    Also Read: కుప్పంలో బాబుకు చేదు అనుభవం: తమ్ముళ్ల నోట జూనియర్‌‌ ఎన్టీఆర్‌‌ మాట

    ఉప్పల్‌ వైపు పోచారంలో మైక్రోసాఫ్ట్‌ సంస్థ కార్యాలయాలను విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. కొంపల్లి వైపు ఐటీ సంస్థల ఏర్పాటుకు సర్కార్‌‌ ప్రోత్సాహకాలు అందిస్తోంది. విజయవాడ జాతీయ రహదారి, బెంగళూరు జాతీయ రహదారి వైపు లాజిస్టిక్‌ పార్కులు వస్తున్నాయి. ఇప్పటికే కొన్ని అందుబాటులోకి రాగా.. మరికొన్ని వేర్వేరు దశలో ఉన్నాయి. దీంతో తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల నుంచే కాకుండా హైదరాబాద్‌ నగరానికి ఉత్తరాది నుంచి పెద్ద ఎత్తున వలసలు పెరిగాయి.

    ఐటీ కేంద్రంగా ఉన్న మదాపూర్‌‌, గచ్చిబౌలి చుట్టుపక్కల ప్రాంతాల్లో పలు కంపెనీల విస్తరణతో చుట్టూ పది కిలోమీటర్ల వరకు గృహనిర్మాణం ఊపందుకుంది. కొండాపూర్‌‌, కోకాపేట్‌, రాయదుర్గం, నార్సింగి, పుప్పాల్‌గూడ ప్రాంతాల్లోని నివాసాలకు డిమాండ్‌ పెరిగింది. ఆఫీసులకు సమీపంలో ఉండడంతో కొనుగోలు దారులు ఇటువైపు మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ చాలా అపార్ట్‌మెంట్లు నిర్మాణంలో ఉండగా.. పలు సంస్థలు కొత్త ప్రాజెక్టులను ప్రకటించాయి.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్