https://oktelugu.com/

బీజేపీ తన నిర్ణయాన్ని మార్చుకుందా..? : తిరుపతి సీటు జనసేనకేనా..?

మరికొద్ది రోజుల్లోనే తిరుపతి లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక జరగబోతోంది. ఈ నేపథ్యంలో ఆ సీటు కోసం పార్టీలు పోట్లాడుకుంటున్నాయి. ఇప్పటికే వైసీపీ, టీడీపీ క్యాండిడేట్లను దాదాపు ఫైనల్‌ చేసేశాయి. ఇక మిత్రపక్షాలైన బీజేఈప–జనసేనల మధ్య పంచాయతీ ఇంకా నడుస్తూనే ఉంది. ఇప్పటిదాకా తిరుపతి నుంచి తామే బరిలో ఉంటామంటూ ఇరు పార్టీల నేతలు చెప్పుకుంటూ వచ్చారు. బీజేపీ నేతలు ఈ విషయాన్ని బాహాటంగానే ప్రకటించారు కూడా. దీంతో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తిరుపతి సీటు […]

Written By:
  • Srinivas
  • , Updated On : February 27, 2021 12:46 pm
    Follow us on

    Janasena BJP
    మరికొద్ది రోజుల్లోనే తిరుపతి లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక జరగబోతోంది. ఈ నేపథ్యంలో ఆ సీటు కోసం పార్టీలు పోట్లాడుకుంటున్నాయి. ఇప్పటికే వైసీపీ, టీడీపీ క్యాండిడేట్లను దాదాపు ఫైనల్‌ చేసేశాయి. ఇక మిత్రపక్షాలైన బీజేఈప–జనసేనల మధ్య పంచాయతీ ఇంకా నడుస్తూనే ఉంది. ఇప్పటిదాకా తిరుపతి నుంచి తామే బరిలో ఉంటామంటూ ఇరు పార్టీల నేతలు చెప్పుకుంటూ వచ్చారు. బీజేపీ నేతలు ఈ విషయాన్ని బాహాటంగానే ప్రకటించారు కూడా. దీంతో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తిరుపతి సీటు కోసం ఇప్పటికే ఢిల్లీ బీజేపీ నేతలను కలిశారు. ఆ సీటును జనసేనకు కేటాయించాలని అభ్యర్థించారు. ఇప్పుడు తాజాగా మరో వార్త వినిపిస్తోంది.

    Also Read: ఏపీలో కొత్త కొలువులకు బ్రేక్‌ : జగన్‌ నిర్ణయంతో కన్‌ఫర్మ్‌

    ఏపీలోని విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేసేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో కేంద్రంలో ఉన్నది బీజేపీ పార్టీనే కాబట్టి రాష్ట్రంలోనే ఆ పార్టీ పట్ల వ్యతిరేకత వచ్చే అవకాశాలే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తిరుపతి సీటును జనసేనకే త్యాగం చేయాలని బీజేపీ డిసైడ్‌ అయిందట. తాజాగా దేశ వ్యాప్తంగా ప‌లు రాష్ట్రాల‌కు అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు షెడ్యూల్ వెల్లడైన నేప‌థ్యంలో, తిరుప‌తి ఉప ఎన్నిక‌కు కూడా గ్రీన్ సిగ్నల్‌ వచ్చినట్లైంది. ఈ నేప‌థ్యంలో తిరుప‌తిలో పోటీ చేసేందుకు బీజేపీ ముందు చూపినంత ఆస‌క్తి.. ఇప్పుడు చూప‌డం లేద‌నే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

    ఆంధ్రుల సెంటిమెంట్ అయిన విశాఖ ఉక్కును ప్రైవేటీక‌రిస్తున్న కేంద్రంలోని బీజేపీపై రాష్ట్ర ప్రజ‌లు ర‌గిలిపోతున్నారు. ఈ వాస్తవాన్ని ప‌సిగ‌ట్టిన రాష్ట్ర బీజేపీ నేత‌లు, తిరుప‌తి సీటును మిత్రపక్షమైన జ‌న‌సేన‌కు ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నార‌ని తెలిసింది. మ‌రోవైపు ఇటీవ‌ల ఐదు బ‌లిజ సంఘాలు చంద్రగిరిలో స‌మావేశ‌మై, తిరుప‌తి ఎంపీ సీటును జ‌న‌సేనకు కేటాయించాల‌ని, ఒక‌వేళ ఇవ్వక‌పోతే త‌మ సామాజిక వ‌ర్గీయులంతా నోటాకు ఓటు వేస్తామ‌ని హెచ్చరించారు.

    Also Read: కాంగ్రెస్‌ సీనియర్‌‌ లీడర్ల ఐక్యతారాగం

    వీటన్నింటి నేపథ్యంలో పలుకుబడి లేని చోట పోటీ చేసి ప‌రువు పోగొట్టుకోవ‌డం కంటే, మిత్రపక్షమైన జనసేనకే కేటాయించి గౌర‌వాన్ని కాపాడుకోవ‌డం ఉత్తమమనే అభిప్రాయానికి వచ్చినట్లుగా సమాచారం. ఆ సీటను జ‌న‌సేన‌కు కేటాయిస్తే, ఆ పార్టీకి మ‌ద్దతుగా నిలిచే బ‌లిజ‌ల ఓట్లు వ‌స్తాయ‌ని, క‌నీసం ప‌రువైనా నిలుస్తుంద‌నే చర్చ జ‌రుగుతోంది.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

    Janasena Activist Rama Krishna Strong Warning To Bhimavaram MLA Grandhi Srinivas |  ok telugu