గ్రేటర్ ఎన్నికలు.. విడిపోయిన సినిమా వాళ్లు..

ఆటాపాటా మాయింట.. మాపటి భోజనం మీయింట..అన్నట్లు గ్రేటర్ ఎన్నికల్లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుల తమ వంతు ప్రచారం చేస్తున్నారు. సినిమా వాళ్లు ప్రచారం చేయడం దశాబ్దాల నుంచి ఉన్నదే. సినిమా వాళ్లకూ తెలుగు రాజకీయాలకు ఉన్న అనుబంధం ఏమిటో చెప్పనక్కర్లేదు. సాధారణంగా సినిమా వాళ్లు ఏ పార్టీ లీడింగ్లో కనిపిస్తే దానివైపు ఉంటారు. 1999 నుంచి 2004 మధ్యన తెలుగు సినిమా వాళ్లు చంద్రబాబుకు మద్దతుగా ఉన్నారు. Also Read: టీఆర్ఎస్ వర్సెస్ మజ్లిస్.. కొట్లాట పైకి మాత్రమేనా? […]

Written By: NARESH, Updated On : November 24, 2020 11:52 am
Follow us on

ఆటాపాటా మాయింట.. మాపటి భోజనం మీయింట..అన్నట్లు గ్రేటర్ ఎన్నికల్లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుల తమ వంతు ప్రచారం చేస్తున్నారు. సినిమా వాళ్లు ప్రచారం చేయడం దశాబ్దాల నుంచి ఉన్నదే. సినిమా వాళ్లకూ తెలుగు రాజకీయాలకు ఉన్న అనుబంధం ఏమిటో చెప్పనక్కర్లేదు. సాధారణంగా సినిమా వాళ్లు ఏ పార్టీ లీడింగ్లో కనిపిస్తే దానివైపు ఉంటారు. 1999 నుంచి 2004 మధ్యన తెలుగు సినిమా వాళ్లు చంద్రబాబుకు మద్దతుగా ఉన్నారు.

Also Read: టీఆర్ఎస్ వర్సెస్ మజ్లిస్.. కొట్లాట పైకి మాత్రమేనా?

టాలీవుడ్‌ అంటే.. తెలుగుదేశం, తెలుగుదేశం అంటే టాలీవుడ్‌ అన్నట్టుగా అప్పట్లో వ్యవహారం నడిచింది. ఒకరిని కాదు.. స్టార్‌ హీరోల దగ్గర నుంచి కమేడియన్ల వరకూ అంతా పచ్చ పార్టీ అభిమానులుగానే కనిపించారు. 2004 ఎన్నికలు వచ్చే సమయానికి అది పీక్స్‌కు చేరిపోయింది. ఆ తర్వాత గెలిచిన కాంగ్రెస్ కు కొద్దిమంది మాత్రమే సపోర్టుగా ఉండేవారు.

అయితే తాజాగా గ్రేటర్ పోరులో టీఆర్ఎస్ వైపు పోసాని కృష్ణ‌ముర‌ళి, ద‌ర్శ‌కుడు ఎన్.శంక‌ర్ లు ప్రెస్ క్ల‌బ్ లో ప్రెస్ మీట్ పెట్టి.. త‌మ వాద‌న వినిపించారు. బీజేపీ వైపు రంగంలోకి దిగారు సీనియ‌ర్ న‌టి క‌విత‌, మ‌రో న‌టుడు సీవీఎల్ న‌ర‌సింహారావు. వీరు బీజేపీ ఆఫీసులో మాట్లాడుతూ టీఆర్ఎస్ త‌ర‌ఫున వాణి వినిపించిన ద‌ర్శ‌కుడు ఎన్.శంక‌ర్ ను ల‌క్ష్యంగా చేసుకున్నారు. పోసానిని విమ‌ర్శించేందుకు ఎలాగూ విష‌యం లేదు కాబ‌ట్టి, ఆయ‌న‌ను ప‌క్క‌న పెట్టి భూములు తీసుకున్నారంటూ శంక‌ర్ పై ధ్వ‌జ‌మెత్తారు.

Also Read: గ్రేటర్‌‌లో గులాబీ బాస్‌ వెరైటీ వ్యూహం

గ‌తంలో క‌విత తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల్లో ప‌ని చేసిన‌ట్టున్నారు. రోశ‌య్య సీఎంగా ఉన్న‌ప్పుడు కాంగ్రెస్ వైపు మాట్లాడారు, కొంత‌కాలం టీడీపీలో పనిచేశారు కూడా. ఇప్పుడు ఈమె బీజేపీ వైపున వ‌క‌ల్తా పుచ్చుకున్నారు. సీవీఎల్ న‌ర‌సింహారావు గ‌తంలో లోక్ స‌త్తా త‌ర‌ఫున టీవీ చ‌ర్చ‌ల్లో పాల్గొన్న‌ట్టున్నారు. అప్ప‌ ట్లో చిరంజీవి పార్టీ పెట్టిన‌ప్పుడు టీవీ కార్య‌క్ర‌మాల్లో విమ‌ర్శ‌లు చేశారు సీవీఎల్. ఈయ‌న ఇప్పుడు బీజేపీ త‌ర‌ఫున స్పందించారు.

తెలంగాణ సినిమాను టీఆర్ఎస్ చంపేసింద‌న్న‌ట్టుగా విమ‌ర్శించారు. భార‌తీయ జ‌న‌తా పార్టీ హిందువుల తరుఫున ఉంటామ‌న్నందుకు టీఆర్ఎస్ ర‌చ్చ చేస్తోంద‌ని సీవీఎల్ విమ‌ర్శించారు. హిందువుల‌ను చంపేస్తాం, ఆవుల‌ను చంపేస్తామంటూ మాట్లాడిన‌ప్పుడు ఎవ‌రికీ అభ్యంత‌రం లేక‌పోయిందా? అంటూ సీవీఎల్ ప్ర‌శ్నించారు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

కేసీఆర్‌ కుటుంబం సినిమా వాళ్లతో అత్యంత సన్నిహితంగా ఉంటుంది. కేసీఆర్‌ ఏవైనా పిలుపులిస్తే దానికి సినిమా వాళ్లు స్పందించడం మొదలైంది. దీంతో సినిమా వాళ్లు ఎక్కువగా టీఆర్ఎస్ అనూకులంగా ఉంటున్నారు.