ఈ మధ్య కాలంలో చాలామంది హెయిర్ లాస్ సమస్యతో బాధ పడుతున్నారు. కాలుష్యం, ఒత్తిడి, ఆహారపు అలవాట్లు హెయిర్ లాస్ సమస్యకు కారణమవుతున్నాయి. పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు చాలామందిలో ఈ సమస్య కనిపిస్తోంది. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా జుట్టు రాలే సమస్యకు సులభంగా చెక్ పెట్టవచ్చు. వంటింటి చిట్కాలు పాటించి జుట్టు రాలే సమస్యను పరిష్కరించుకోవచ్చు.
హెయిర్ లాస్ సమస్యతో బాధ పడేవాళ్లకు ఉసిరి అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది. యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉసిరిలో పుష్కలంగా ఉంటాయి. ఉసిరిని పొడిగా చేసి తలకు తరచూ పెట్టుకుంటే జుట్టు సంబంధిత సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఉసిరి పొడి, చుండ్రు, నెత్తి మంట లాంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. వేపాకులను కొబ్బరి నూనెలో మరిగించి ఆ ఆయిల్ ను తలకు రాసుకున్నా మంచి ఫలితాలు ఉంటాయి.
బీట్ రూట్ జుట్టు రాలే సమస్యను తగ్గించడంలో ఎంతగానో సహాయపడుతుంది. ప్రతిరోజు ఎవరైతే బీట్ రూట్ జ్యూస్ తీసుకుంటారో వారిలో కుదుళ్లు గట్టిపడి వెంట్రుకలు రాలే సమస్య తగ్గుతుంది. రాత్రంతా మెంతులను నానబెట్టి ఆ మెంతులను పేస్ట్ లా చేసి తలకు పట్టించినా అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ఉల్లిగడ్డలను జ్యూస్ లా చేసుకుని తలకు పట్టించినా ఆరోగ్యకరమైన ప్రయోజనాలు చేకూరుతాయి.
గుడ్లను పగలగొట్టి ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి తలకు రాసుకున్నా గుడ్లలో ఉండే ప్రోటీన్లు జుట్టు రాలే సమస్యను తగ్గిస్తాయి. ప్రతిరోజూ గ్రీన్ టీ తాగినా జుట్టు సంబంధిత సమస్యలు తగ్గుముఖం పడతాయి. జుట్టు రాలే సమస్యను నివారించడంలో మందారం సైతం అద్భుతంగా సహాయపడుతుంది. మందారం రెక్కలను క్రష్ చేసి నూనెలో కలుపుకుని తలకు పట్టిస్తే అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి.