RDO Shoking Comments For Kaaleshwaram: తెలంగాణలో పరిస్థితులు చూస్తుంటే అధికారులపై ఏ స్థాయిలో ఒత్తిడిలు ఉన్నాయో అర్థం అవుతోంది. దీనికి నిదర్శనంగా సిరిసిల్ల జిల్లాలోని బోయిన్ పల్లి మండలంలో జరిగిన ఘటన అందరినీ ఆందోళన చెందేలా చేస్తోంది. ఇప్పటి వరకు మనం భూముల కోసం పురుగుల మందు తాగిన రైతులను చూశాం. కానీ రైతులు భూములు ఇవ్వకుంటే తామే పురుగుల మందు తాగుతామని బెదిరించిన అధికారులను చూడలేదు కదా.
కానీ ఇప్పుడు బంగారు తెలంగాణలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతల పథకంలో భాగంగా ప్రస్తుతం మూడో టీఎంసీ కాలువ కోసం భూసేకరణ సర్వే జరుగుతోంది. సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మండలంలో ఈ సర్వే కోసం విలాసాగర్ కు అధికారులు వెళ్లారు. అయితే ఇప్పటికే భూ సేకరణ ఆలస్యం అవుతోందని ఆర్డీవో చాలా ఆగ్రహం మీద ఉన్నారు.
Also Read: Dharmana Krishna Das: ‘ధర్మ’యుద్ధం.. ధర్మాన కుటుంబంలో పదవుల చిచ్చు
ఈ క్రమంలోనే విలాసాగర్‌కు వచ్చిన అధికారులను రైతులు అడ్డుకున్నారు. తాము నమ్ముకున్న భూములను ఇవ్వబోమని తేల్చి చెప్పారు. గ్రామ సభ పెట్టి తమకు నష్టపరిహారం మీద స్పష్టత ఇవ్వాలంటూ కోరారు. ఇక ఓ రైతు కుటుంబం అయితే తాము భూమి ఇవ్వబోమని, బలవంతంగా లాక్కోవాలని చూస్తే.. పురుగుల మందు తాగి చనిపోతామంటూ హెచ్చరించారు.
విషయం తెలుసుకున్న ఆర్డీవో శ్రీనివాస్ అక్కడకు చేరుకున్నారు. రైతుల బెదిరింపులు చూసిన ఆయన.. తనమీద బోలెడు మంది ఒత్తిడిలు ఉన్నాయని, కాబట్టి ఇప్పుడు మీరు భూమి ఇవ్వకపోతే నేనే పురుగుల మందు తాగి ఇక్కడే చనిపోతానంటూ ఆర్డీవో శ్రీనివాస్ హెచ్చరించారు. ఇప్పుడు భూ సేకరణ పూర్తి కాకపోతే నా పరిస్థితి కూడా ఇదేనని చెప్పుకొచ్చారు.
ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. టీఆర్ ఎస్ ప్రభుత్వంలో ఉద్యోగులు ఇలా బలైపోతున్నారని అటు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఉద్యోగులపై ఈ స్థాయిలో ఒత్తిడి పెంచడం ఏంటంటూ మండిపడుతున్నాయి. ముందస్తు ఆలోచనలో ఉన్న కేసీఆర్.. ఈ రేంజ్‌లో ఒత్తిడిలు పెచుతున్నాడని అంటున్నారు ప్రతిపక్ష నేతలు.
Also Read:Arrest Warrant On MLA Roja Husband: రోజా భర్త సెల్వమణిపై అరెస్ట్ వారెంట్.. ఆ కేసులో అలా చేశారంట