RBI Deputy Governor : కేంద్ర ప్రభుత్వం మరో మహిళా అధికారిణికి ప్రతిష్ఠాత్మక బాధ్యతలు అప్పగించింది. ఇటీవల 2014 బ్యాచ్ ఇండియన్ ఫారెన్ సర్వీస్ అధికారిణి నిధి తివారీ(Nidhi Thiwari)ని ప్రధాని నరేంద్ర మోదీ(Narendramodi)ప్రైవేట్ సెక్రటరీగా నియమించింది. తాజాగా పూనమ్ గుప్తా(Punam Guptha)ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డిప్యూటీ గవర్నర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 2, 2025న ఈ నిర్ణయం వెలువడింది, ఆమె మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు.
Also Read : బ్యాంకు ఖాతాదారులకు ఆర్‌బీఐ షాక్.. మే 1 నుంచి చార్జీలు పెంపు!
పూనమ్ గుప్తా ప్రస్తుతం..
పూనమ్ గుప్తా ప్రస్తుతం నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకానమిక్ రీసెర్చ్ (NCAER) డైరెక్టర్ జనరల్‌గా ఉన్నారు. ఈ ఏడాది జనవరి(January)లో రిటైరైన ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మైకల్ పత్రా స్థానాన్ని ఆమె భర్తీ చేయనున్నారు. ఏప్రిల్ 7–9 మధ్య జరగనున్న మానిటరీ పాలసీ కమిటీ సమావేశానికి ముందు ఈ నియామకం జరిగింది, దీనితో ఆర్థిక విధాన నిర్ణయాల్లో ఆమె కీలక పాత్ర పోషించనున్నారు. కేబినెట్ అపాయింట్‌మెంట్స్ కమిటీ ఆమె నియామకాన్ని ఆమోదించింది. పూనమ్ గుప్తా ఆర్థిక రంగంలో విశేష అనుభవం కలిగిన నిపుణురాలు. ఆమె ప్రధానమంత్రి(Priministar) ఆర్థిక సలహా కౌన్సిల్ సభ్యురాలిగా, 16వ ఫైనాన్స్ కమిషన్ సలహా మండలి సభ్యురాలిగా ఉన్నారు. గతంలో ఇంటర్నేషనల్ ఫైనాన్స్(International Finance)కార్పొరేషన్‌లో గ్లోబల్ మాక్రో, మార్కెట్ రీసెర్చ్ లీడ్ ఎకానమిస్ట్‌గా, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్‌లో పరిశోధకురాలిగా పనిచేశారు. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకానమిక్స్‌లో ప్రొఫెసర్‌గా, భారత అంతర్జాతీయ ఆర్థిక సంబంధాల పరిశోధనా మండలిలో బోధనలోనూ ఆమె అనుభవం ఉంది.
ప్రతిభావంతురాలు పూనమ్..
పూనమ్ గుప్తా.. విద్యాభూషణం కూడా ఆకట్టుకుంటుంది. యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్ నుంచి ఎకనామిక్స్‌లో పీహెచ్‌డీ (1998), ఎంఏ (1995) పూర్తి చేసిన ఆమె, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకానమిక్స్ నుంచి ఎంఏ (1991), హిందూ కాలేజ్, ఢిల్లీ యూనివర్స్శిటీ నుంచి బీఏ (1989) చదివారు. మాక్రో ఎకనామిక్స్, అంతర్జాతీయ ఫైనాన్స్, వాణిజ్యంలో స్పెషలైజేషన్ ఉన్న ఆమె, 1998లో అంతర్జాతీయ ఆర్థిక శాస్త్రంపై చేసిన పీహెచ్‌డీకి ఎక్సిమ్ బ్యాంక్ అవార్డు గెలుచుకున్నారు.
పూనమ్ గుప్తా నియామకం ఆర్బీఐలో మహిళా ప్రాతినిధ్యాన్ని పెంచడమే కాక, ఆర్థిక విధానాల్లో కొత్త దక్పథాన్ని తీసుకురానుంది. ఆమె నేతత్వంలో ఆర్బీఐ కీలక నిర్ణయాలు ఆసక్తికరంగా ఉండనున్నాయి.
Also Read : వాట్సాప్‌లో వికృత చేష్టలకు చెక్.. 97 లక్షల ఖాతాలపై నిషేధం!