Homeజాతీయ వార్తలుRAW History: RAW ఇలా పుట్టింది.. ఇలా పెరిగింది.. మన గూఢచార లెజెండ్స్ వీరే

RAW History: RAW ఇలా పుట్టింది.. ఇలా పెరిగింది.. మన గూఢచార లెజెండ్స్ వీరే

RAW History: ఇవాళ సినిమాల్లో దూరందర్‌ లాంటి హీరోలను చూస్తున్నాం. శత్రు దేశాల్లోకి దూసుకెళ్లి, కనిపించకుండా తిరిగి, తెలివితోనే దెబ్బ తీసి, దేశాన్ని కాపాడుతున్నారు దురంధరులన ఆ థ్రిల్, ఆ సస్పెన్స్, ఆ తెలియని ధైర్యం మనల్ని ఆకట్టుకుంటుంది. కానీ ఆ సినిమా హీరోలకు పునాది వేసిన అసలు గొప్ప మనిషి ఇద్దరు ఉన్నారు. వారు ఎవరో తెలుసా? ఒకరు పరమేశ్వర్‌నాథ్‌ కౌ.. మరొకరు అజిత్‌ దోబల్‌.

Also Read: మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత.. ఇంత దారుణమా.. అసలు వాళ్ళు ఏమైపోవాలి?

రా స్థాపనకు పునాది..
రమేశ్వర్‌ నాథ్‌ కౌ (1918–2002) భారతదేశానికి మొదటి విదేశీ గూఢచార మేధస్సు. 1962 చైనా, 1965 పాక్‌ యుద్ధాల్లో ఇంటెలిజెన్స్‌ వైఫల్యాలు ఆయనకు రా(RAW) స్థాపనకు పునాది వేశాయి. 1968 సెప్టెంబర్‌ 21న 250 మంది సిబ్బందితో ప్రారంభమైన ఈ సంస్థ, ఇంటెలిజెన్స్‌ బ్యూరో నుంచి విడిపడి ప్రపంచ స్థాయి బలాన్ని తెచ్చింది.

1971 విజయవంతమైన ఆపరేషన్లు
రా మొదటి పరీక్ష 1971 బంగ్లాదేశ్‌ యుద్ధంలో విజయవంతమైంది. కౌ నాయకత్వంలో ఈస్ట్‌ పాకిస్థాన్‌లో రహస్య నెట్‌వర్క్‌లు, ముక్తి బాహినికి శిక్షణ, పాక్‌ సైన్య కదలికలపై ఖచ్చిత ఇన్ఫో – 13 రోజుల్లో 93 వేల మంది లొంగుబాటు, కొత్త దేశ సృష్టి. ఆయన ’కావ్‌ బాయ్స్‌’ టీమ్‌ సీఐఏను ఆకట్టుకుంది.

రహస్య జీవనశైలి
కౌ ఫొటోలు అరుదు, ఇంటర్వ్యూలు లేవు, పబ్లిక్‌ స్పీచ్‌లు లేకుండా ‘సైలెంట్‌ ఇంటెలిజెన్స్‌‘ సూత్రంతో పని చేశారు. అణు రహస్యాల రక్షణ, విదేశీ రాజకీయాల ముందస్తు అంచనా – ఆయన వ్యూహాలు దేశ భద్రతను మార్చాయి. రాజీవ్‌ గాంధీకి సలహాదారుగా కొనసాగారు.

కౌ వారసుడిగా దోవల్‌..
అజిత్‌ దోవల్‌ కౌ వారసత్వాన్ని అందిపుచ్చుకున్నాడు. 1945లో జన్మించిన దోవల్‌ ఐపీఎస్‌ 1968లో ఎంపికయ్యాడు. రాలో రహస్య ఆపరేషన్లలో పేరు తెచ్చుకున్నారు. గోల్డెన్‌ టెంపుల్‌లో రిక్షావాలా వేశంతో తీవ్రవాదుల్లోకి దూసుకెళ్లి ఆపరేషన్‌ బ్లాక్‌ థండర్‌కు ఇన్ఫో సేకరించారు. పాకిస్థాన్‌లో ఏడేళ్లకుపైగా రహస్య పని, మిజోరం, పంజాబ్, కాశ్మీర్‌ తిరుగుబాటులను అరికట్టారు.

దోవల్‌ కీలక ఆపరేషన్లు..
ఎన్‌ఎస్‌ఏగా 2014 నుంచి దోవల్‌ పనిచేస్తున్నారు. 2016 సర్జికల్‌ స్ట్రైక్స్, బాలకోట్‌ ఎయిర్‌ స్ట్రైక్‌ (2019), డోక్లాం స్టాండాఫ్, ఆర్టికల్‌ 370 రద్దు – ఆయన తంత్రాలు రక్షణను దాడి రూపంలో మలిచాయి. దావూద్‌ ఇబ్రహీం కూతురు పెళ్లి టార్గెట్, ఉగ్ర క్యాంపులపై దాడుల్లో దౌత్య సక్సెస్‌. కౌ సైలెన్స్‌ను ఆధునిక ఆక్రమణాత్మకతతో కొనసాగిస్తున్నారు.

కౌ రహస్య పునాది వేసి రాను బలోపేతం చేయగా, దోవల్‌ దాన్ని ప్రపంచ బలంగా మార్చారు. ఇద్దరూ హెడ్‌లైన్స్‌లో లేకుండా దేశాన్ని కాపాడారు. సినిమా హీరోలకు నిజ ఆదర్శం. వారి వల్ల భారత్‌ అజేయ గూఢచార శక్తిగా నిలిచింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Public Movement : ప్రధానుల తల వంచిన ప్రజా ఉద్యమాలు..

Public Movement : ప్రజా ఉద్యమాలు భారత దేశానికి కొత్తకాదు. మన స్వాతంత్య్రమే ప్రజా ఉద్యమాలతో సాధించుకున్నాం. స్వతంత్ర భారతదేశంలో ప్రజా ఉద్యమాలు ప్రభుత్వాలపై గణనీయమైన ప్రభావం చూపాయి. కొన్ని సందర్భాల్లో ప్రధానులు...
Narendra Modi

Narendra Modi : నాడు రైతులు.. నేడు విద్యార్థులు.. మోదీతో వెనకడుగు వేయించిన ఉద్యమాలు!

Narendra Modi : ప్రధాని నరేంద్రమోదీ.. వరుసగా మూడోసారి ప్రధాని అయ్యారు. ఇటీవలే పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును కూడా అధిగమించారు. అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా చరిత్ర సృష్టించారు....
Cockroach Janata Party youth politics

Cockroach Janata Party రాజకీయ పార్టీగా సిజెపి.. తర్వాతి అడుగు అదే..

Cockroach Janata Party ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కొత్త విద్యా శాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు. ఇక్కడితోనే సీజేపీ ఆగిపోతుందా.. తదుపరి ఏం చేస్తుంది.. అసలు బొద్దింకల తదుపరి లక్ష్యం...

Chiranjeevi : బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన గబ్బర్ సింగ్ నటుడికి మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం..

Chiranjeevi : ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మెగాస్టార్ చిరంజీవి కి కొత్తేమి కాదు. ప్రతీ నెల ఎవరికో ఒకరికి ఆయన నుండి సహాయం అందుతూనే ఉంటుంది. చిరంజీవి చేసినన్ని సహాయ కార్యక్రమాలు...
CJP Protests

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...
Oktelugu Epaper