TV9 – Raviprakash : ఒకప్పుడు న్యూస్ చానెల్స్ లేని రోజుల్లో టీవీ9ను కొందరు పెట్టుబడిదారులతో స్థాపించి దాన్ని దేశంలోనే నంబర్ 1కు చేర్చిన ఘనత ఖచ్చితంగా రవిప్రకాష్ దే. అయితే ఆయన ప్రభుత్వాలను శాసించే శక్తిగా ఎదగడం.. కొందరు రాజకీయ నేతలతో జట్టు కట్టి గేమ్స్ ఆడడం కొంప ముంచిందన్న ప్రచారం మీడియాలో ఉంది. ఆ కారణంగానే తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ సర్కార్ పై వ్యతిరేక వార్తలు రాసి ఆయనకు కోపం తెప్పించాడు. కేసీఆర్ స్కెచ్ కు ఇక టీవీ9 నుంచి రవిప్రకాష్ ఎగ్జిట్ కావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని ఓ ప్రచారం ఉంది.
టీవీ9తో పూర్తి బంధాలు తెంచుకున్న రవిప్రకాష్ ప్రస్తుతం ఒక న్యూస్ చానెల్ తీసుకొచ్చేందుకు చాలా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు రిక్రూట్ మెంట్ కూడా మొదలుపెట్టాడని టాక్.
అయితే టీవీ9 నుంచి బయటకు వచ్చాక మరో పెద్ద ఛానెల్ ను పెట్టాలని.. దేశంలో పవర్ ఫుల్ గా మారాలని రవిప్రకాష్ చేయని ప్రయత్నాలు లేవు. బీజేపీ అప్పటి జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కలిసి బీజేపీకి మద్దతుగా ఓ జాతీయ న్యూస్ చానెల్ తేవడానికి రవిప్రకాష్ రెడీ అయ్యారు. కానీ రవిప్రకాష్ లాంటి అపర మేధావి జర్నలిస్టును నమ్మి సొమ్ములు పెట్టడానికి ఎవరూ రాలేదన్న ప్రచారం నడిచింది. రవిప్రకాష్ తో డీల్ చేయడానికి భయపడ్డారని కొందరు అంటున్నారు. పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేతలను ఆటాడించే రవిప్రకాష్ తో అందరూ జాగ్రత్తగా వ్యవహరిస్తూ దూరం జరిగారని అంటున్నారు.
అయితే ఏమైందో ఏమో కానీ సడెన్ గా రవిప్రకాష్ ఇప్పుడు తనను ఎక్కడి నుంచి అయితే గెంటేశారో అదే ఆఫీసులోకి ఈరోజు వచ్చాడు. అవమానకరంగా పంపిన ఆఫీసుకి రవిప్రకాష్ వచ్చాడన్న వార్త తెలియగానే మీడియా అంతా అక్కడ చేసి అసలు రవిప్రకాష్ ఎందుకు వచ్చాడు? టీవీ9తో రవిప్రకాష్ కు రాజీ కుదిరిందా? మళ్లీ టీవీ9లోకి రవిప్రకాష్ వస్తున్నాడా? అని హోరెత్తించారు.
అయితే టీవీ9 కంపెనీ ఏబీసీఎల్ లో మైహోం రామేశ్వరరావు, మేఘా కృష్ణారెడ్డి, ఎంవీకేఎన్ మూర్తితోపాటు రవిప్రకాష్ అయిన నేను కూడా వాటాదారుడిని అని.. టీవీ9లో అకౌంట్స్ చూడడానికి వచ్చినట్టు అసలు విషయాన్ని బయటపెట్టాడు.
అయితే నిజంగానే అకౌంట్స్ కోసమే వచ్చాడా? లేక కేసీఆర్ తో రవిప్రకాష్ కు సంధి కుదిరిందా? మళ్లీ టీవీ9లోకి ఎంట్రీ ఇస్తున్నాడా? అన్న చర్చ సాగుతోంది.
#tv9 అఫీస్ లో రవి ప్రకాష్ pic.twitter.com/Dccp0VEzPr
— devipriya (@sairaaj44) February 21, 2023