డిఫరెంట్ సంక్షేమ పథకాలకు దూసుకెళ్తున్నారు ఏపీ సీఎం జగన్. ఆ పథకాలను కూడా ప్రజలకు వెరైటీగా చేర్చేందుకు ప్లాన్ చేశారు. ఇందుకోసం డోర్ డెలివరీ చేయాలనుకున్నారు. కానీ.. అధికార యంత్రాంగం, వ్యవస్థ మాత్రం ఇందుకు పెద్దగా సహకరించడం లేదు. రేషన్ డోర్ డెలివరీ కోసం ఇప్పటికే పలు ముహూర్తాలు కూడా నిర్ణయించారు. కానీ.. అవి పదేపదే వాయిదా పడుతూ వచ్చాయి. అయితే.. కొత్త ఏడాదిలో కన్ఫర్మ్‌గా అందజేసుడే అని చెప్పారు. కానీ.. మరోసారి వాయిదా పడింది. మళ్లీ మరో తేదీని ఖరారు చేశారు. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి డోర్ డెలివరీ ప్రారంభిస్తామంటూ చెప్పుకొస్తున్నారు.
Also Read: కేసీఆర్ రంగంలోకి దిగితే.. ఆ కిక్కే వేరప్పా
అయితే.. ఈ డోర్ డెలివరీ మొదటగా గోతాల్లో నీట్‌గా ప్యాక్ చేయించి.. ఇంటిదగ్గరే వాలంటీర్లు ఇస్తారని చెప్పారు. ఇందుకు శ్రీకాకుళం జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా సెలక్ట్ చేశారు. గోతాల ఖర్చు తడిసి మోపెడు కావడంతో వాలంటీర్లు వెనక్కి తగ్గారు. అందుకే.. ప్రభుత్వం రూటు మార్చి గోతాలు ఒక్క సారే ఇచ్చి బియ్యం మాత్రం ఇంటికి తెచ్చి ఆ గోతాల్లో పోసే విధానాన్ని పెట్టాలని నిర్ణయించారు. మరి ఎలా ఆ బియ్యాన్ని ఇళ్ల వద్దకు తీసుకెళ్తారు..? ఎలా కొలిచి పోయాలో తీరిగ్గా ఆలోచించారు. చివరికి కొత్త వెహికల్స్ పెట్టాలని నిర్ణయించుకున్నారు.
అనేక రకాల డిజైన్లు చూసిన తర్వాత చివరికి మామూలు టాటా ఎస్ తరహా వాహనాన్ని ఖరారు చేశారు. వాటికి స్టిక్కర్లు వేయించి.. ఏపీకి తీసుకువచ్చారు. కానీ.. బాలారిష్టాలు మాత్రం తొలగలేదు. ఎలా పంపిణీ చేయాలన్న దానిపై స్పష్టత లేకుండా పోయింది. వాలంటీర్లు పంపిణీ చేయాలా.. లేక వాహనాల డ్రైవర్లు పంపిణీ చేయాలా అన్నదానిపై క్లారిటీలేదు. చివరికి వాలంటీర్లు దగ్గర ఉండి.. వాహనాల డ్రైవర్లు పంపిణీ చేయాలని నిర్ణయించారు.
Also Read: నామో మోడీ.. పట్టంకట్టిన ప్రపంచ సర్వే సంస్థ..!
సాధారణంగా ఏ పథకం ప్రారంభించడానికి అయినా ముందుగా ఎలా కొనసాగించాలో కసరత్తు చేయాలి. అవసరమైతే ఒకనెల వాయిదా వేసి సరైన నిర్ణయం తీసుకోవాలి. కానీ.. జగన్ సర్కార్ మాత్రం ఏది రెడీ కాకముందే నిర్ణయం తీసుకోవడంతో ఆదిలోనే అడ్డంకులు వస్తున్నాయి. పైగా వాహనాలు కూడా పూర్తి స్థాయిలో అందలేదు. మరోవైపు.. ఇంటింటికీ సన్నబియ్యమా.. లేక నాణ్యమైన బియ్యమా.. లేకపోతే ఇప్పటివరకు ఇస్తున్న బియ్యమే ఇవ్వడమా అన్నదానిపై స్పష్టత లేకుండా లేదు. నాణ్యమైన బియ్యం ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. కానీ.. నాణ్యమైన బియ్యం అంటే.. పంపిణీ చేసేదే అనుకోవాలని శ్రీకాకుళంలో పైలట్ ప్రాజెక్ట్ సమయంలో విమర్శలు వచ్చాయి.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్