https://oktelugu.com/

Ratan Tata: కంపెనీ ఉద్యోగుల కోసం గ్యాంగ్‌స్టర్‌నే ఢీకొట్టిన వ్యాపార దిగ్గజం! రతన్ టాటాలోని హీరోయిజం ఇదీ!*

భారత వ్యాపార దిగ్గజం, టాటా గ్రూప్‌ సంస్థల గౌరవ చైర్మన్‌ రతన్‌ టాటా ముంబైలోని బ్రీచ్‌క్యాండీ ఆస్పత్రిలో బుధవారం రాత్రి కన్ను మూశారు. వ్యాపారంలోనే కాకుండా దాదృత్వంలోనే ఆయన అందనంత ఎత్తుకు ఎదిగారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : October 10, 2024 / 10:53 AM IST

    Ratan Tata Passed Away(1)

    Follow us on

    Ratan Tata: టాటా సంస్థల గౌరవ చైర్మన్‌ రతన్‌టాటాకు తన కంపెనీ అంటే చాలా ఇష్టం. సామాన్యులకు కూడా తమ ఉత్పత్తులు చేరాలన్న లక్ష్యంతో వివిధ రంగాల్లో వాపారాన్ని విస్తరించారు. రతన్‌ టాటా చైర్మన్‌ అయ్యాక సంస్థలే అనేక మార్పులు చేశారు. ఉద్యోగులను కూడా సొంతవారిలా చూసుకునేవారు. ఒత్తిడి లేకుండా పని చేయాలనే స్వభావం ఆయనది. ఎవరినీ నొప్పించకుండా పని చేయిస్తూ.. వ్యాపారంలో అగ్రస్థానానికి ఎదిగారు. తమ కంపెనీ అభివృద్ధికి పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులను కూడా రతన్‌ టాటా బాగా చూసుకునేవారు. వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించేవారు. పురాతన సంస్థ అయిన టాటా సంస్థను కొత్త స్థాయికి తీసుకెళ్లడంలో రతన్‌ టాటా కృషి ఎనలేనిది. దేశంలో అన్ని వర్గాల వారికి, అన్ని వయసుల వారికి టాటాను పరిచయం చేశారు. తన వ్యాపార విస్తరణకు ఎంతో కృషి చేసిన రతన్‌ టాటా.. ఉద్యోగుల సంక్షేమానికి అంతే తపించారు. తన కుటుంబ సభ్యులుగా చూసుకున్నారు.

    గ్యాంగ్‌స్టర్లతో పోరాటం..
    రతన్‌ టాటా తన ఉద్యోగుల కోసం గ్యాంగ్‌స్టర్లతోనూ పోరాడారు. టాటా మోటార్స్‌ వ్యాపారాన్ని దెబ్బతీయడానికి గ్యాంగ్‌స్టర్లు దెబ్బతీయాలని చూశారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ క్రమంలో ఉద్యోగులపై దాడి చేశారని వెల్లడించారు. బెదిరించారని పేర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న రతన్‌ టాటా గ్యాంగ్‌స్టర్లను అడ్డుకునేందుకు స్వయంగా రంగంలోకి దిగారు. ఈ ఘటన చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన 1980లో జరిగిందని వెల్లడించారు.

    పని మానేసిన ఉద్యోగులు..
    ఇక 2015లో ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. అందులో రతన్‌ టాటా గ్యాంగ్‌స్టర్లతో ఎలా పోరాడింది. వివరించారు. ఓ గ్యాంగ్‌స్టర్‌ తన కంపెనీ ఉద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నించాడు. ఉద్యోగులను ఇబ్బంది పెట్టాడు. విభేదాలు సృష్టించేందుకు యత్నించాడు. దీంతో 2 వేల మంది ఉద్యోగం మానేసే పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో గ్యాంగ్‌స్టర్‌ టాటా మోటార్స్‌ యూనియన్‌ను తన అధీనంలోకి తెచ్చుకున్నాడు. దీనికి గుర్తించిన రతన్‌ టాటా అడ్డుకట్ట వేశాడు.

    ప్లాంట్‌లో స్వయంగా ఉండి..
    ఈ క్రమంలో రతన్‌ టాటా స్వయంగా ప్లాంట్‌కు చేరుకున్నాడు. చాలా రోజులు అక్కడే ఉండిపోయారు. సంస్థను గాడిలో పెట్టేందుకు ఉద్యోగులకు అండగా నిలిచారు. తాను ఇక్కడే ఉంటానని భరోసా ఇచ్చారు. ఉద్యోగులను ప్రోత్సహిస్తూ.. మళ్లీ పని ప్రారంభించేలా చేశారు. దీంతో గ్యాంగ్‌స్టర్‌ తోక ముడిచాడు. అనంతరం మళ్లీ ప్లాంట్‌ పనులు ప్రారంభమయ్యాయి. దీంతో ఉద్యోగుల మధ్య బలమైన బంధం ఏర్పడింది.