https://oktelugu.com/

NBK talk show :  పవన్ కళ్యాణ్ తో గొడవపై బాలయ్యకు క్లారిటీ ఇచ్చిన అల్లు అర్జున్..’అన్ స్టాపబుల్ 3′ మొదటి ఎపిసోడ్ చిత్రీకరణ పూర్తి!

NBK' టాక్ షో. నందమూరి బాలకృష్ణ ఈ సీజన్ మొదటి ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ ని ఇటీవలే పూర్తి చేశారట. ఈ మొదటి ఎపిసోడ్ కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా విచ్చేసినట్టు తెలుస్తుంది.

Written By:
  • Gopi
  • , Updated On : October 10, 2024 / 10:58 AM IST

    NBK talk show

    Follow us on

    NBK talk show. :  ఓటీటీ రంగంలో ఆహా మీడియా ఇండియా లోనే టాప్ 10 యాప్స్ లో ఒకటిగా నిలబడడానికి ముఖ్య కారణం ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ టాక్ షో. నందమూరి బాలకృష్ణ తన కెరీర్ లో మొట్టమొదటిసారిగా హోస్ట్ గా వ్యవహరిస్తూ చేసిన ఈ టాక్ షోకి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు, రెబల్ స్టార్ ప్రభాస్, రవితేజ ఇలా ఎంతో మంది టాప్ స్టార్లు ఈ బిగ్గెస్ట్ టాక్ షోలో అతిథులుగా పాల్గొన్నారు. వాళ్ళు బాలయ్య తో ముచ్చటించిన సంభాషణలు ఇప్పటికీ ట్రెండింగ్ లోనే ఉన్నాయి. విజయవంతంగా రెండు బ్లాక్ బస్టర్ సీజన్స్ ని పూర్తి చేసుకున్న ఈ బిగ్గెస్ట్ టాక్ షో, త్వరలోనే మూడవ సీజన్ ని ప్రారంభించుకోనుంది. ఈ సీజన్ మొదటి ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ ని ఇటీవలే పూర్తి చేశారట. ఈ మొదటి ఎపిసోడ్ కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా విచ్చేసినట్టు తెలుస్తుంది.

    మొదటి సీజన్ లో కూడా అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా విచ్చేస్తాడు కానీ, కేవలం కొద్దిసేపు మాత్రమే కనిపిస్తాడు. సుకుమార్ ఆ ఎపిసోడ్ కి ముఖ్య అతిథిగా పాల్గొనగా, అల్లు అర్జున్ చివర్లో వచ్చి నాలుగు మాటలు మాట్లాడేసి వెళ్తాడు. కానీ ఈ సీజన్ లో మాత్రం పూర్తి ఎపిసోడ్ ని, అది కూడా మొదటి ఎపిసోడ్ ని అల్లు అర్జున్ తో చిత్రీకరించారట. ఈ ఎపిసోడ్ లో పుష్ప 2 గురించి అనేక విశేషాలను పంచుకోవడమే కాకుండా, రీసెంట్ గా మెగా అభిమానుల్లో ఏర్పడిన గందరగోళంకి క్లారిటీ ఇచ్చాడని తెలుస్తుంది. ముఖ్యంగా తన చిన్న మామయ్య పవన్ కళ్యాణ్ తో ఉన్న అనుబంధం గురించి మాట్లాడుతూనే , నంద్యాల ఘటనపై కూడా క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తుంది. గత మూడు నెలలుగా ఈ ఘటనపై పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ అభిమానుల మధ్య గొడవలు ఏ స్థాయిలో కొనసాగుతున్నాయి మనమంతా చూస్తూనే ఉన్నాము.

    అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ ని కామన్ గా ఇష్టపడేవాళ్లు లక్షల సంఖ్యలో ఉన్నారు. వాళ్లకు ఈ గొడవలు అసలు ఏమాత్రం నచ్చడం లేదు. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ ఈ గోడపై క్లారిటీ ఇస్తే బాగుంటుందని చాలా మంది కోరుకున్నారు. కానీ ఈ ఇద్దరు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ గా గడుపుతున్నారు. అలాంటి సమయంలో అన్ స్టాపబుల్ సీజన్ 3 కి అల్లు అర్జున్ మొదటి ఎపిసోడ్ కి ముఖ్య అతిథిగా పాల్గొని ఈ విషయాలపై క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అతి త్వరలోనే ఈ ఎపిసోడ్ ఆహా యాప్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. త్వరలోనే ఈ ఎపిసోడ్ కి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు. కనీసం ఈ ఎపిసోడ్ తో అయినా అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య గొడవలు ఆగుతాయో లేదో చూడాలి.