
రాపాక వరప్రసాదరావు.. జనసేన పార్టీ నుంచి గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యే. ఈయన పేరుకు జనసేన ఎమ్మెల్యే అయినా వైసీపీ సర్కారు, సీఎం జగన్‌ను ప్రశంసించడంతో జనసైనికులు రగిలిపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ పరువు తీస్తున్నారని, స్థానిక సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించడం లేదని ఆడిపోసుకుంటున్నారు. వైసీపీ కార్యకర్తలు మాత్రం ఫుల్ ఖుషీలో ఉన్నారు.
Also Read: పోలవరం.. బీజేపీకి ప్లస్‌గా మారబోతుందా?
జగన్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉంది
జగన్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని.. ప్రజల శ్రేయస్సు కోసంఇంతగా పరితపించే సీఎంను తానెప్పుడూ చూడలేదని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ప్రశంసలు కురిపించారు. గురువారం అసెంబ్లీలో మాట్లాడిన ఆయన తాను బతికి ఉన్నవరకు వైఎస్ జగనే సీఎంగా ఉండాలని ఆకాంక్షించారు. లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించారని. సంక్షేమ పథకాలు అందరికీ అందించేలా ప్రతి గ్రామాల్లో వలంటీర్లను నియమించడం ప్రశంసనీయమన్నారు.. జగన్ నాయకుడిగా ఉన్న అసెంబ్లీలో తాను ఉండటం అదృష్టంగా భావిస్తున్నాని అన్నారు.
తండ్రి బాటలో నడుస్తున్నాడు
దివంగత నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన స్వర్ణ యుగంలా ఉండేదని.. వైఎస్ జగన్ అదే దారిలో నడుస్తున్నారని ప్రశంసించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తున్నారని, దేశమే ఆశ్చర్యపోయే విధంగా ప్రతినెలా పెన్షన్ ఇస్తున్నారని అభినందించారు. ఇలాంటి నాయకుడు పదికాలాల పాటు సీఎంగా ఉండాలని కోరారు.
Also Read: ఫిబ్రవరిలోనే ఏపీ స్థానిక ఎన్నికలు
జనసైనికుల ఆగ్రహం
సీఎం జగన్‌ను రాపాక అభినందించడంపై జన సైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనాలు అసెంబ్లీకి పంపించింది.. ప్రజా సమస్యలు ప్రస్తవించేందుకేగాని, సీఎంను అభినందించేందుకు కాదని సోషల్ మీడియాలో చురకలు అంటిస్తున్నారు. అసలు ఆయనకు విలువలు లేవని.. తమ పార్టీలో ఒక కార్యకర్తకి ఉన్నంత నైతికత కూడా లేదన్నారు. గతంలో సీఎం విమర్శలు చేసిన రాపాక.. ఇప్పుడు పొగడటం విడ్డూరంగా ఉందంటున్నారు. మరోవైపు వైసీపీ కార్యకర్తలు మాత్రం ఫుల్ ఖుషీగా ఉన్నారు. సీఎం పాలనకు రాపాక వ్యాఖ్యలే నిదర్శనమని సోషల్ మీడియాలో ఫుల్ ప్రచారం చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్