Bhopal : పట్టుదల, దృఢ సంకల్పం ఉంటే జీవితంలో దేనినైనా సాధించవచ్చని నిరూపించింది ఓ మధ్యప్రదేశ్ యువతి. తాను అనుకున్న లక్ష్యాన్ని చేరాలనే పట్టుదలతో డీఎస్పీ అయ్యింది. చిన్న తనం నుంచే ఎన్నో కష్టాలను దాటి రోజుకి కొన్ని గంటల పాటు చదువుతూ.. ఉద్యోగాన్ని సాధించింది. ఓ సాధారణ కుటుంబంలో జన్మించిన ఓ యువతి తల్లిదండ్రుల కష్టాలను చూస్తూ పెరిగింది. ఎప్పటికైనా ఒక మంచి ఉద్యోగాన్ని పొందాలని ఎన్ని కష్టాలు ఉన్నా కూడా వాటిని పక్కన పెట్టి మరి ఉద్యోగాన్ని సాధించింది. తల్లిదండ్రులతో పాటు ఇతరులు కూడా షభాష్ అనుకునేలా ఉద్యోగం పొందింది. ఇంతకీ ఎవరు ఆ యువతి? ఎన్నోసారి డీఎస్పీ ఉద్యోగం సాధించింది? పూర్తి వివరాలు తెలియాలంటే మాత్రం మీరు స్టోరీ చదవాల్సిందే.
మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కి చెందిన రాంషా అన్సారీ మధ్యప్రదేశ్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌లో అర్హత సాధించింది. 2022కి సంబంధించిన ఫలితాలను జనవరి 18వ తేదీన విడుదల చేసింది. ఇందులో రాంషా అన్సారీ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌కు ఎంపికయ్యింది. ఈ పరీక్షలో ఈమె మొత్తం 880.50 మార్కులు సాధించి డీఎస్పీ పోస్టును కొట్టింది. బీఏ ఎకనామిక్స్ పూర్తి చేసినా ఈమె రోజుకి దాదాపుగా 12 గంటల పాటు చదివింది. డిగ్రీ పూర్తి అయిన తర్వాత ఎంతో కష్టపడి పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యింది. తన ఇష్టాలు అన్ని కూడా వదులకుని చదువు మీద ఇంట్రెస్ట్ పెట్టింది. ఈమె చదువుకు కుటుంబం కూడా ఎంతో ప్రోత్సాహించింది. తనకు చదువు మీద ఉన్న ఇంట్రెస్ట్, ఉద్యోగం సాధించాలనే పట్టుదలను చూసి పేరెంట్స్ కూడా ఆమెకు అండా నిలిచారు. ఎలాంటి కష్టం వచ్చినా కూడా కుటుంబం ఆమెకు అండగా ఉన్నారని ఆమె అంటోంది. ఈమె తండ్రి వ్యవసాయ శాఖలో యూడీసీగా పనిచేస్తుండగా తల్లి గృహిణిగా ఉన్నారు. ఈమె తన కుటుంబం సహకారం వల్లనే ఈ ఉద్యోగం సాధించిందని ఆమె తెలిపారు.
భోపాల్‌లోనే ఓ కోచింగ్ సెంటర్‌లో పరీక్షల కోసం ఆమె ప్రిపేర్ అయ్యింది. కోచింగ్‌లో కేవలం సబ్జెట్ మాత్రమే చెబుతారని ఎలా చదవాలనేది అది విద్యార్థిపైనే ఆధారపడి ఉంటుందని రాంసా అంటున్నారు. రాంసా ఎంతో పట్టుదలతో చదివింది. ముస్లింలో ఎక్కువగా అమ్మాయిలను బయటకు పంపడానికి ఇష్టపెట్టుకోరు. అయినా కూడా రాంసా పేరెంట్స్ అన్ని విధాలుగా కూడా ఆమెను సపోర్ట్ చేశారని.. అందువల్లే ఈ రోజు డీఎస్పీ హోదాలో ఉద్యోగం లభించిందని ఆమె అన్నారు.