
Jagan vs Ramoji Rao : పచ్చ పార్టీ నే కాదు, పచ్చ మీడియాను సైతం జగన్ వదలడం లేదు. సమయం దొరికితే చాలు ఎక్కడికక్కడ తొక్కేయాలని చూస్తున్నాడు. మొన్నటిదాకా మార్గదర్శి మీద గుడ్లు ఉరిమిన జగన్.. ఇప్పుడు ఏకంగా రామోజీరావు కుంభస్థలం మీదే గురి పెట్టాడు.. రాజశేఖర్ రెడ్డి బతికున్నప్పుడు ఆ రెండు పత్రికలపై యుద్ధం ప్రకటిస్తే.. ఆయన తనయుడు జగన్ మాత్రం కేవలం ఈనాడు పైనే కత్తి కట్టారు. అంటే ఆయన ఆంధ్రజ్యోతి పత్రికను ఇప్పటికీ తోక పత్రిక గానే భావిస్తున్నట్టు అనుకోవాలా?
అసలు ఇప్పుడు జగన్, రామోజీరావు మధ్య యుద్ధం మళ్లీ ఎందుకు మొదలైందంటే… ఆ మధ్య రామోజీరావు వద్దకు జగన్ వెళ్ళాడు. కొద్దిరోజులు కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. తర్వాత ఏమైందో తెలియదు కానీ మళ్ళీ మొదలైంది.. సాక్షి వర్ష ఈనాడు పంచాయతీ ఈసారి ఏకంగా కోర్టు తలుపులు తట్టింది..సాక్షి సర్క్యులేషన్ పెంచుకునేందుకు జగన్ ప్రత్యేకంగా ఒక జీవో ఇచ్చాడు. దాన్ని సవాల్ చేస్తూ ఈనాడు హైకోర్టులో దావా వేసింది. సాక్షి, ఈనాడు ద్వంద్వ యుద్ధం మరోసారి రచ్చకెక్కింది. వాలంటీర్లు, గ్రామ _ వార్డు సెక్రటేరియట్ సిబ్బంది దినపత్రికలు కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక జీవో ఇచ్చింది. అది ముఖ్యమంత్రి జగన్ సొంత పత్రిక సాక్షి సర్కులేషన్ పెంచుకోవడం కోసమే అని ఈనాడు వాదన.. ఆ జీవోను రద్దు చేయాలని, ఏ బి సి సర్కులేషన్ ను పరిగణనలోకి తీసుకోకుండా ఉత్తర్వులు ఇవ్వాలని ఈనాడు కోరుతోంది.
ఈ పిటిషన్ పై కోర్టు సాక్షి డైరెక్టర్ కు, ముఖ్యమంత్రికి, సాక్షి చైర్పర్సన్ గా వ్యవహరిస్తున్న ఆయన భార్య భారతి రెడ్డికి, సాక్షి ప్రధాన వాటాదారులకు జారీ చేసింది.. అంతేకాదు ఏబీసీ కార్యదర్శి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి కూడా టిఫిన్ ఇచ్చింది.. పురపాలకం, రెవెన్యూ, పంచాయతీరాజ్, విలేజ్ సెక్రటరీస్, సమాచార శాఖల ముఖ్య కార్యదర్శులకు కూడా నోటీసులు జారీ చేసింది. సాక్షికి ప్రభుత్వ ప్రకటనలో ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని మరో పిటిషన్ లో కూడా కోర్టు కౌంటర్ వేయాలని ప్రభుత్వానికి నోటిఫికేషన్ ఇచ్చింది. తనే కేసు వేసినప్పటికీ ఈనాడులో ఈ వార్త రాలేదు. ఆంధ్రజ్యోతి మాత్రం ఈ వార్తను రాసేసింది.. దినపత్రికలు కొనుగోలు చేసుకోవచ్చినట్టు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంటే తప్ప సాక్షిని కొనుగోలు చేయాలని ప్రత్యేకంగా అందులో చెప్పారు కదా, అందుకని సాంకేతికంగా ప్రభుత్వ శాఖలు ఇరుక్కుపోవచ్చు.. కోర్టులో అడ్వకేట్ జనరల్ వాదన ఇదే కోణంలో ఉంది. ఈవో ఇచ్చింది ప్రభుత్వం కాబట్టి సాక్షికి ఇరకాటం ఉండకపోవచ్చు. ఏమని అఫీషియల్ కౌంటర్ ఇస్తారో చూడాలి. సాక్షిని కాదని వేరే పత్రికల్ని వాలంటీర్లు, ఇతర ఉద్యోగులు ఎలాగూ కొనుగోలు చేయరు కాబట్టి ఒక రకంగా ఇది అధికార దుర్వినియోగమే అనేది సాక్షి ప్రత్యర్థుల వాదనగా చూడాలి.
ఒకటి మాత్రం నిజం… పాఠకుడు ఒక పత్రిక కొనుగోలు చేయాలి అనిపించేలా అందులో కంటెంట్ ఉండాలి. యాజమాన్యాలు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. వార్తల్లో ఒక వర్గానికి కొమ్ముకాకుండా ఉండాలి. ప్రచురించే రంగులు రాజకీయరంగులను పోలి ఉండకూడదు.. అదే అంతిమంగా నిలబడేది. అది కాదని డొంక తిరుగుడు పద్ధతుల్లో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ఫాయిదా స్థిరంగా నిలబడేది కాదు. ఇక్కడ ఈనాడు కేసు పరమార్ధం సర్క్యులేషన్ గురించే కాదు, తన నెంబర్ వన్ స్థానం పోతుందని మాత్రమే కాదు, ఆ పేరిట దక్కుతున్న ప్రైవేట్ కంపెనీల యాడ్స్ కూడా పోతాయని సందేహం.