Rashi Phalalu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. అక్టోబర్ 21 శనివారం 12 రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేషరాశి:
ఒక సమాచారం ఆందోళనను కలిగిస్తుంది. శత్రువులకు దూరంగా ఉండండి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని విషయాల్లో ఇతరుల సలహాలు తీసుకుంటారు.
వృషభం:
ఉద్యోగం చేసేవారు ఇబ్బందులను అధిగమించాల్సి ఉంటుంది. కొన్ని విషయాల్లో కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. అనవసర ఖర్చులు పెరుగుతాయి.
మిథునం:
కొన్ని కీలక విషయాల్లో ఇతరుల సలహాలు తీసుకొవద్దు. సొంత నిర్ణయాలు తీసుకుంటే లాభిస్తాయి. డెవలప్మెంట్ కోసం చేసే పనులు సక్సెస్ అవుతాయి. పట్టుదలతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు.
కర్కాటకం:
ఉద్యోగులు కార్యాలయాల్లో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. మనశ్శాంతి లోపించే అవకాశం. ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి.
సింహం:
కుటుంబ సభ్యుల సహకారంతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ ఉంచాలి. బంధువులు, మిత్రులతో అనవసర వాదనలకు దిగొద్దు.
కన్య:
రుణరభారం పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. కుటుంబంలో చికాకులు కలిగే ఛాన్స్ ఉంది. ఇష్టమైన వారితో గడపడం వల్ల ఉల్లాసంగా ఉండగలుగుతారు.
తుల:
సమస్యలన్నింటికీ పరిష్కారం దొరుకుతాయి. ప్రశాంతంగా ఆలోచించాలి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు ఉంటాయి. కుటుంబ సభ్యుల సలహాలు తీసుకుంటారు.
వృశ్చికం:
కొన్ని కీలక విషయాల్లో సొంత నిర్ణయాలు లాభిస్తాయి. అయితే చేయని పొరపాటుకు నిందలు పడాల్సి వస్తుంది. చంచల మనస్తత్వం నుంచి బయటపడేందుకు ప్రయత్నించాలి.
ధనస్సు:
ఓ విషయంలో అధికారులు సహాయం మెండుగా ఉంటుంది. బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఓ సమాచారం మనశ్శాంతినిస్తుంది.
మకరం:
అనవసరంగా ఇతరులతో విబేధించొద్దు. అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఒక పనిలో అధికారుల నుంచి ఒత్తిడి తగ్గుతుంది. వాదనలకు దిగకుండా గౌరవం కాపాడుకోవాలి.
కుంభం:
సమాజంలో గౌరవం పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలు చేసేవారికి అనుకూల సమయం. స్థిర నిర్ణయాలు లాభిస్తాయి. మంచి పనులు చూసిఅందరి చేసత ప్రశంసలు పొందుతారు.
మీనం:
కీలక సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొంటారు. ప్రయాణాలు లాభిస్తాయి. ఉద్యోగం, వ్యాపారం చేసేవారికి కొన్ని ఇబ్బందులు తప్పవు.