ఆంధ్రప్రదేశ్ మాజీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ తొలిగింపు వ్యవహారం పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని పిటీషనర్ల తరపు న్యాయవాదులు ధర్మాసననికి వివరించారు.పదవీ బాధ్యతలు చేపట్టినప్పుడే ఆ పదవి కాలం స్పష్టం చేస్తారని, మధ్యలో ప్రభుత్వం చేపట్టిన చర్యలు చట్టవ్యతిరేకమైనవిగా అభివర్ణించారు.
మరోవైపు ఈ రోజు విచారణలో భాగంగా పిటీషనర్ తరుపు న్యాయవాదుల వాదనలు విన్న అనంతరం తదుపరి విచారణను హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది. నిమ్మగడ్డ తొలగింపుపై పిటిషనర్ల తరుపున వాదనలు పూర్తయ్యాయి. ఏపీ మాజీ ఎస్ఈసీ తొలగింపుపై వాదనలు వినిపించేందుకు ప్రభుత్వానికి ఒకటిన్నర రోజు సమయాన్ని ధర్మాసనం ఇచ్చింది. శుక్రవారం సాయంత్రానికి విచారణ పూర్తి అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కోర్టు ముందు సీనియర్ న్యాయవాది జంధ్యాల రవి శంకర్ తన వాదనలు వినిపించారు.
వైన్ షాపులో ఉపాధ్యాయుల డ్యూటీపై పవన్ సీరియస్!
243(కె) ప్రకారం సర్వీస్ నిబంధనలు ఉద్యోగంలో చేరినప్పటి నుంచి రిటైర్ అయ్యే వరకు వర్తిస్తాయని అన్నారు. ఆర్డినెన్స్ తీసుకురావడానికి గల కారణాలు ఏవీ స్పష్టంగా చెప్పనపుడు ఆర్డినెన్స్ చెల్లదని జంధ్యాల వాదించారు. ఇది పూర్తిగా అధికార దుర్వినియోగానికి పాల్పడడమే అని సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం స్పష్టంగా చెప్పిందని జంధ్యాల అన్నారు.
ఎన్నికల సంస్కరణల పేరుతో 77 ఏళ్ల వ్యక్తిని ఎన్నికల కమిషనర్ గా నియమిస్తే ఆయన ఎంత వరకు సమర్ధవంతంగా పనిచేయగలరని జంధ్యాల వాధించారు. రమేష్ కుమార్ నియామకాన్ని రాజ్యాంగంలోని 243(కె) అధికారణ మేరకు నియమించారని, ప్రభుత్వం మాత్రం 200 ప్రకారం నియమించామని చెబుతుందని, 200 ప్రకారం చేయడానికి వీలేదని, ఎలక్షన్ కమిషనర్ నియామకాన్ని 243(కె) ప్రకారమే చేపట్టాలని రాజ్యాంగంలో స్పష్టంగా ఉందన్నారు. ప్రభుత్వం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించిందని, ప్రభుత్వ ఆర్డినెన్స్ వెనుక దురుద్దేశం ఉందని జంధ్యాల రవి శంకర్ వాదించారు.