https://oktelugu.com/

రామతీర్థం రాములవారి విగ్రహం ధ్వంసం.. కల్లోలం సృష్టించేందుకేనా..?

మొన్నటివరకు ఏపీలో హిందూ దేవాలయాలపై దాడులు జరుగగా.. హిందూ సమాజం ఒక్కసారిగా భగ్గుమన్నది. ముఖ్యంగా జగన్‌ పర్యటన నేపథ్యంలో మరోసారి చిచ్చురేపాలని చూశారు గుర్తుతెలియని ఆగంతకులు. రామతీర్థం బోడికొండపై ఉన్న కోదండరామ స్వామి వారి దేవాలయంలో ఆలయ తాళాలు పగులగొట్టి శ్రీరాముడి విగ్రహ శిరస్సును గుర్తు తెలియని అగంతకులు ధ్వంసం చేశారు. ఉదయం స్వామివారి కైంకర్యాలకు చేసేందుకు ఆలయ పూజారి వచ్చేసరికి విగ్రహం ధ్వంసం అయ్యి కనిపించింది. దీంతో పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలానికి చేరుకొని […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 30, 2020 / 01:23 PM IST
    Follow us on


    మొన్నటివరకు ఏపీలో హిందూ దేవాలయాలపై దాడులు జరుగగా.. హిందూ సమాజం ఒక్కసారిగా భగ్గుమన్నది. ముఖ్యంగా జగన్‌ పర్యటన నేపథ్యంలో మరోసారి చిచ్చురేపాలని చూశారు గుర్తుతెలియని ఆగంతకులు. రామతీర్థం బోడికొండపై ఉన్న కోదండరామ స్వామి వారి దేవాలయంలో ఆలయ తాళాలు పగులగొట్టి శ్రీరాముడి విగ్రహ శిరస్సును గుర్తు తెలియని అగంతకులు ధ్వంసం చేశారు. ఉదయం స్వామివారి కైంకర్యాలకు చేసేందుకు ఆలయ పూజారి వచ్చేసరికి విగ్రహం ధ్వంసం అయ్యి కనిపించింది. దీంతో పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు అన్ని ఆధారాలనూ సేకరిస్తున్నారు.

    Also Read: ఆలయాలపై దాడులు.. సీఎం జగన్ ఎందుకు స్పందించరు?

    ఎవరో ఈ దారుణానికి పాల్పడ్డారని జిల్లా ఎస్పీ రాజకుమారి పేర్కొన్నారు. ఘటనపై ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. నిందితులకు కఠినంగా శిక్షపడేలా చేస్తామని ఆమె పేర్కొన్నారు. రామతీర్థంలో జరిగిన రాములవారి విగ్రహ విధ్వంసం ఘటనపై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సీరియస్ అయ్యారు. జిల్లా ఎస్పీ రాజకుమారితో మాట్లాడి విచారణ వేగవంతం చేయాలని, దోషులను కఠినంగా శిక్షపడేలా చేయాలని మంత్రి ఆదేశించారు.

    Also Read: ప్రశ్నిస్తే చంపేస్తారా..: కడప జిల్లాలో రాజకీయ హత్యలు

    అంతేకాదు విచారణ కోసం రీజినల్ జాయింట్ కమిషనర్ స్థాయి అధికారిని నియమించాలని దేవాదాయ ప్రత్యేక కమిషనర్ కు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం రామతీర్థం రాములవారి విగ్రహం ధ్వంస ఘటనపై విచారణకు విచారణ అధికారిగా డి.భ్రమరాంబను నియమించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహం ధ్వంసం ఘటన నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలు ఆలయాన్ని సందర్శించారు. స్వామివారి విగ్రహాన్ని ధ్వంసం చేయడం దురదృష్టకరమని అంటున్నారు.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

    భక్తుల మనోభావాలను దెబ్బతినేలా చేయడం కోసం, సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో కావాలనే ఎవరో ఈ దారుణానికి పాల్పడ్డారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా స్వామి వారి విగ్రహాన్ని శాస్త్రోక్తంగా యథావిధిగా ప్రతిష్ఠింప చేయడం కోసం తగిన చర్యలు తీసుకుంటామని స్థానిక ప్రజా ప్రతినిధులు చెప్తున్నారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పాలన చూసి ఓర్వలేని రాజకీయ అరాచక శక్తులు ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారు అని వైసీపీ నేతలు మండిపడుతున్నారు.