పెద్దగా రాజకీయాల్లో దశాబ్దాల చరిత్ర కాదు. అలా అనీ రాజకీయ బ్యాక్‌గ్రౌండ్ లేని పర్సన్ అంతకన్నా కాదు. ఆయనే ఏపీ సీఎం జగన్. ఎన్నో దశాబ్దాల చరిత్ర ఉన్న చంద్రబాబు వాళ్ల కాని పనిని జగన్ చేసి చూపించారు. చివరకు కేంద్రాన్ని ఒప్పించడంలో సక్సెస్ కాగలిగారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్రం మీద భారం పడకుండా కేంద్రాన్ని ఒప్పించడంలో జగన్ సఫలీకృతమయ్యారు.
పోలవరం జాతీయ ప్రాజెక్టుకు 2017–-18 ధరల ప్రకారం రూ.47,725.74 కోట్ల అంచనా వ్యయానికి కేంద్ర జల్ శక్తి శాఖ పెట్టుబడి అనుమతి ఇచ్చే దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ అంశంపై కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర పత్రాల్ని సిద్ధం చేస్తున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో చేపట్టిన 15 జాతీయ ప్రాజెక్టులకు ఇచ్చిన తరహాలోనే.. పోలవరం ప్రాజెక్టుకూ నీటిపారుదల విభాగం పనులకు నిధులు మంజూరు చేయాలన్న వాదనను జగన్ సర్కారు వినిపిస్తోంది. దీని కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసింది. తాజాగా జల్ శక్తి శాఖ సైతం సానుకూలంగా స్పందించింది. కేంద్రం తీసుకోనున్న నిర్ణయంతో 2017–-18 ధరల ప్రకారం పోలవరం ప్రాజెక్టు పనులకు కేంద్రం నిధులు విడుదల చేయనుంది.
Also Read: ఆలయాలపై దాడులు.. సీఎం జగన్ ఎందుకు స్పందించరు?
వాస్తవానికి విభజన చట్టం ప్రకారం వంద శాతం ఖర్చుతో పోలవరం ప్రాజెక్టును కేంద్రమే పూర్తి చేయాలి. అయితే.. అందుకు భిన్నంగా ఏపీకి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన చంద్రబాబు.. ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను రాష్ట్రానికి ఇవ్వాలని పదే పదే కోరారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినా పట్టించుకోలేదు. కమీషన్ల కక్కుర్తితోనే బాబు ఈ పని చేశారన్న ఆరోపణ ఉంది. బాబు చేసిన పనితో 2014 ఏప్రిల్ ఒకటి నాటికి ప్రాజెక్టు నీటిపారుదల విభాగంలో మిగిలిన పనికి అయ్యే ఖర్చును మాత్రమే ఇస్తానని చెప్పినా.. బాబు సర్కారు అందుకు అభ్యంతరం వ్యక్తం చేయలేదు. ఒకవిధంగా చూస్తే.. ప్రత్యేక హోదాను ప్యాకేజీ కోసం తాకట్టు పెట్టిన బాబు.. పోలవరం ప్రాజెక్టులో కేంద్రం ఇచ్చే నిధుల్లో కోత పడేలా చేశారని చెప్పాలి.
Also Read: ఏడాదిన్నరలో ఒక్కో రైతుకు లక్షన్నర ఇచ్చాం
అంతేకాదు.. 2014 ఏప్రిల్ ఒకటి నాటి ధరల ప్రకారం కేంద్రం నిధులు ఇస్తుందన్న మాటతో పాటు డిజైన్ మారినా.. ధరలు పెరిగినా.. అంచనా వ్యయం పెరిగినా.. భూసేకరణ వ్యయం పెరిగినా.. ఆ ఖర్చు రాష్ట్రమే భరించాలని చెప్పిన కేంద్రం మాటపై అభ్యంతరం వ్యక్తం చేసి.. రాష్ట్రానికి మేలు జరిగే ప్రయత్నం మీద పెద్దగా ఫోకస్ చేయలేదు. ఇదిలా ఉంటే.. పోలవరం విషయంలో బాబు చేసిన తప్పుల్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గనతో పాటు.. మరో మంత్రి అనిల్ ను వెంట పెట్టుకొని ఢిల్లీకి వెళ్లిన ఆయన.. 2017–-18 ధరల ప్రకారం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వాలని కోరారు. దీనిపై పలుమార్లు కేంద్రంతో మంత్రాంగం జరిపిన సీఎం జగన్ ఎట్టకేలకు మోడీ సర్కారును ఒప్పించగలిగారు. 2017–-18 నాటి ధరల ప్రకారం నిధులు ఇచ్చేందుకు సిద్ధమైంది. కేంద్రాన్ని ఒప్పించడంలో మొత్తానికి జగన్ సక్సెస్ అయ్యారు. ఇదంతా జగన్ క్రెడిట్ అనే చెప్పాలి.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్