IAS రమామణి మృతికి వేధింపులే కారణమా?

ఐఎఎస్‌ అధికారిణి రమామణి మృతి వెనుక నిజాలు ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయి. ఆమె మృతికి కారణం మానసిక వేధింపులేనని కుటుంబ సభ్యుల‌తో పాటు బ్రాహ్మణ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఆమె అనారోగ్యంతో మృతి చెందారని తొలుత అంతా భావించారు. కొద్ది నెలలుగా ఆమెకు పోస్టింగ్‌ ఇవ్వకుండా వేధించడంతో తీవ్రమైన మానసిక వేదనకు గురై ఆమె మృతి చెందిందని అంటున్నారు. ఈ వ్యవహారమంతా ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) కేంద్రంగా చోటు చేసుకుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రమామణి మృతిపై బీజేపీ […]

Written By: Neelambaram, Updated On : June 4, 2020 11:36 am
Follow us on


ఐఎఎస్‌ అధికారిణి రమామణి మృతి వెనుక నిజాలు ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయి. ఆమె మృతికి కారణం
మానసిక వేధింపులేనని కుటుంబ సభ్యుల‌తో పాటు బ్రాహ్మణ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఆమె అనారోగ్యంతో మృతి చెందారని తొలుత అంతా భావించారు. కొద్ది నెలలుగా ఆమెకు పోస్టింగ్‌ ఇవ్వకుండా వేధించడంతో తీవ్రమైన మానసిక వేదనకు గురై ఆమె మృతి చెందిందని అంటున్నారు. ఈ వ్యవహారమంతా ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) కేంద్రంగా చోటు చేసుకుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రమామణి మృతిపై బీజేపీ నేత రఘురాం డీఓపీటీ (డిపార్ట్మెంట్ ఆఫ్ పెర్సనల్ అండ్ ట్రైనింగ్) కార్యదర్శికి ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారు. సీఎంఓలో ఉన్న ఐఎఎస్ అధికారి పోస్టింగ్ ఇచ్చే విషయంలో సాటి అధికారిపై వేధింపులకు పాల్పడిన విషయం ఈ లేఖ బహిర్గతం అవడంతో వెలుగులోకి వచ్చింది.

విధి నిర్వహణలో అవినీతికి తావు ఇవ్వకుండా ప్రజలకు సేవ చేసిన ఒక ఐఏఎస్ అధికారి కనీసం గుర్తింపు, పోస్టింగ్ ఇవ్వకుండా ఉండటం సరైన చర్య కాదనే అభిప్రాయాన్ని ఐఏఎస్ అధికారులు సైతం వ్యక్తం చేస్తున్నారు. రమామణి మృతి విషయం ఇప్పుడు ఐఏఎస్ అధికారులలో చర్చనీయాంశంగా మారింది. సీఎంఓలో ముఖ్య కార్యదర్శిగా ఉన్న ప్రవీణ్ ప్రకాష్ అంతా తానేగా చక్రం తిప్పుతూ ఐఏఎస్ అధికారుల పోస్టింగ్ విషయంలో ఇబ్బందులకు గురిచేస్తున్న సంఘటనలు వాస్తవమేననే వాదనలు వినిపిస్తున్నాయి.

మరోవైపు వైసీపీ ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా వేధింపులు సామాన్యులకు, ప్రతిపక్ష పార్టీ సభ్యలకే పరిమితం అవలేదు, ఐఏఎస్ అధికారులకు వీటి బెడద ఎదుర్కొంటున్నారనడానికి రమామణి ఘటనే ఒక ఉదాహరణ. ఇటీవల మృతి చెందిన ఆమెకు పోస్టింగ్ ఇచ్చే విషయంలో సీఎంఓ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారని ఆమెను ప్రశించగా, ఈ అంశం వాస్తవం కాదని ఆమె అధికారి దృష్టికి తెచ్చారు. తనకు వాట్సప్ తప్ప వేరే సోషల్ మీడియా ఖాతాలు లేవని ఆమె స్పష్టం చేసినా ప్రవీణ్ ప్రకాష్ వినిపించుకోకుండా వాట్సప్ లొనే పోస్టింగ్స్ పెట్టుంటారు అని బెదిరింపులకు దిగారని, అదేవిధంగా ఈ సాకుతో పోస్టింగ్ ఇవ్వకుండా వేధిస్తున్నారంటూ ఆమె కొందరు సన్నిహితుల వద్ద వాపోయారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

సీనియర్ ఐఏఎస్ అధికారిణిని జూనియర్ వేధింపులకు గురిచేయడం ఏంటని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర కన్వీనర్ శ్రీధర్ ప్రశ్నించారు. ప్రవీణ్ ప్రకాష్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని విచారణ జరిపించి బాద్యులైన వారిపై చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని స్పష్టం చేశారు.