Ram Gopal Varma on Twitter: ఏపీలోని థియేటర్లలో టికెట్ల ధరల తగ్గింపుపైన తన వాదనను వినిపించేందుకుగాను వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల అమరావతి వెళ్లారు. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని, అధికారులకు తన వాదనను వినిపించారు. కాగా, తన వాదనను మళ్లీ డిజిటల్ వేదికగానూ వినిపించాలనుకున్నాడే ఏమో తెలియదు. కానీ, టికెట్ ధరల వివాదంపై వరుస ట్వీట్లు చేశాడు. గంటలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 24 ట్వీట్లు చేశారు.
ట్వీట్ల ద్వారా రామ్ గోపాల్ వర్మ పలు అంశాలను అయితే ఎత్తి చూపారు. ఆయన చేసిన ట్వీట్ల సారమిదే.. సినిమాల టికెట్ల ధరలను ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. కాగా, ఆ మాదిరిగా ఇంకా ఏదేని ప్రొడక్ట్స్ కు ప్రభుత్వం నిబంధనలు విధించిందా? ఒకవేళ విధించినట్లయితే వేటిపైననో తెలపాలి. రూ. 500 కోట్లతో తీసిన ‘ఆర్ఆర్ఆర్’ ఫిల్మ్‌కు , రూ.ఒక కోటితో తీసిన సినిమాను ఎలా పోలుస్తాం? భారీ మూవీల ధరలను చిన్న చిత్రాలతో సమానంగా ఎలా పోల్చి చూస్తామని అడిగారు.
పిక్చర్ నిర్మాణ వ్యయంతో సంబంధం లేదని చెప్పే ప్రభుత్వం అదే వాదన ప్రపంచంలో ఎక్కడ తయారైన వస్తువుకైనా వర్తింపజేస్తుందా అని ప్రశ్నించారు. పోటీ ఆధారంగానే వస్తువుల నాణ్యత, ధర నిర్ణయిస్తారని, బాహ్య శక్తుల ఆధారంగా కంపెనీలు ప్రైసెస్ డిసైడ్ చేయవని వివరించారు.
Also Read: ఆ మినిస్టర్ ఎవరో తెలియదంటున్న ఆర్జీవి… పంచ్ మామూలుగా లేదంటున్న ఫ్యాన్స్ ?
ఒక సినిమా టికెట్ ధర రూ.2,200లకు ఒక రాష్ట్రంలో విక్రయిస్తుంటే, అదే సినిమా టికెట్ ఏపీలో రూ.200కు ఎలా విక్రయిస్తారు? అది ఆర్టికల్ 14 ప్రకారం ..నిబంధనల ఉల్లంఘన కాదా అని వర్మ అడిగారు. ఒక నటుడికి ప్రొడ్యూసర్ ఎంత రెమ్యునరేషన్ ఇస్తాడనే విషయంలో ప్రభుత్వానికి ఉన్న సమస్య ఏంటని నిలదీశారు. 70 ఏళ్లుగా అమలు చేస్తున్న సినిమాటోగ్రఫీ చట్టం 1995ను ఏపీ సర్కారు తీసి అవతల పారేసిందని, దానిని కోర్టులో సవాలు చేయాలని అన్నారు.
ఈ క్రమంలోనే చివరకు తాను చెప్పేది ఇదేనని వర్మ అన్నారు. సినిమా టికెట్ల రేట్లు, షోలు వదిలేసి ఏపీ సర్కారు రక్షణ, భద్రత, పన్నుల వసూలుపై దృష్టి పెడితే బాగుంటుందని వరుస ట్వీట్లు చేశాడు.
Also Read: ఆర్జీవీతో ఏపీ ప్రభుత్వం చేతులు కాలాయా?