https://oktelugu.com/

Nandamuri Bala Krishna: ఆ మాస్ డైరెక్టర్ తో మూవీ ఓకే చేసిన నందమూరి నటసింహం ?

Nandamuri Bala Krishna: నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నారు. ఇటీవలే బాలయ్య నటించిన ‘అఖండ’ చిత్రం భారీ విజయం సాధించింది. బాలయ్య – బోయపాటి కాంబినేషన్ లో హ్యాటిక్ మూవీ గా వచ్చిన ఈ చిత్రం సూపర్ సక్సెస్ సాధించింది. ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ కూడా ప్రాణం పోసింది అని చెప్పాలి. కలెక్షన్స్ కూడా 100 కోట్లు దాటాయి. మరో వైపు ప్రముఖ ఓటిటీ సంస్థ ఆహా లో ‘అన్ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : January 5, 2022 / 01:15 PM IST
    Follow us on

    Nandamuri Bala Krishna: నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నారు. ఇటీవలే బాలయ్య నటించిన ‘అఖండ’ చిత్రం భారీ విజయం సాధించింది. బాలయ్య – బోయపాటి కాంబినేషన్ లో హ్యాటిక్ మూవీ గా వచ్చిన ఈ చిత్రం సూపర్ సక్సెస్ సాధించింది. ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ కూడా ప్రాణం పోసింది అని చెప్పాలి. కలెక్షన్స్ కూడా 100 కోట్లు దాటాయి. మరో వైపు ప్రముఖ ఓటిటీ సంస్థ ఆహా లో ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే ’ షోలో తనదైన శైలిలో దుమ్ము రేపుతున్నారు.

    బాలయ్య నెక్స్ట్ సినిమా గోపీచంద్ మలినేనితో అని ఇప్పటికే అనౌన్స్ చేశారు. ఈ సినిమా పూజా కార్యక్రమం కూడా పూర్తయింది. ఈ నెలలోనే షూటింగ్ మొదలవ్వబోతుంది. ఆ తర్వాత అనిల్ రావిపూడితో సినిమా ఉండబోతుంది అని కూడా ఇటీవలే అనౌన్స్ చేశారు. ఆహా షోలో వచ్చినప్పుడు అనిల్ రావిపూడి కూడా ఈ సినిమా గురించి మాట్లాడాడు. ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలని ఓకే చేస్తున్నాడు బాలయ్య. తాజాగా మరో సినిమాని కూడా ఓకే చేసినట్టు సమాచారం.

    రచ్చ, గౌతమ్ నంద, సీటిమార్ లాంటి మాస్ సినిమాలు తీసిన సంపత్‌నంది దర్శకత్వంలో బాలకృష్ణ సినిమాను ఓకే చేసినట్టు సమాచారం. మాస్ సినిమాలు చేసే సంపత్ నంది బాలకృష్ణ మాస్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని యాక్షన్‌, మాస్‌ అంశాలతో ఓ కథను బాలయ్యకి వినిపించినట్లు, ఆయన ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన ఇస్తారని సమాచారం. వరుసగా మాస్ సినిమాలు చేస్తున్న బాలయ్య అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇస్తున్నారు.