
తెలంగాణలో రాజ్యసభ స్థానానికి నామినేషన్ల గడువు నేటితో ముగిసింది. తెరాస రాజ్యసభ సభ్యులుగా కే.కేశవరావు, కె.సురేష్ రెడ్డిలతో పాటు మరో ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్ వేశారు. అయితే ఇండిపెండెంట్ అభ్యర్థుల ప్రతిపాదనలు లేకపోవడంతో నామినేషన్ల పరిశీలన సందర్భంగానే ఆ ఇద్దరి నామినేషన్లు తిరస్కణకు గురయ్యాయి. దీంతో తెరాస అభ్యర్థుల ఎన్నిక ఏకగీవ్రం అయింది. రాజ్యసభ నామినేషన్ల గడువు ముగిసే సమయానికి కే.కేశవరావు, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డిలే నామినేషన్ వేశారు. రాజ్యసభ స్థానాలకు పోటీ లేకపోవడంతో తెరాస అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు.
ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకే నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ఇండిపెండెంట్ అభ్యర్థుల ప్రతిపాదనలు లేకపోవడంతో నామినేషన్ల పరిశీలన సందర్భంగానే ఆ ఇద్దరి నామినేషన్లు తిరస్కణకు గురయ్యాయి. కాబట్టి కేశవరావు, సురేష్ రెడ్డిలు భరిలో నిలిచారు. వీరిద్దరూ ఏకగ్రీవం అయినట్టే. మరికొద్ది సేపట్లో ఇద్దరు అసెంబ్లీకి వచ్చి రిటర్నింగ్ అధికారి నుంచి ఎన్నికైన్నట్లు ధృవీకరణ పత్రాలు తీసుకోనున్నారు.