VH On CM Post: రాజీవ్‌గాంధీ నన్ను సీఎం చేయాలనుకున్నాడు.. వీహెచ్‌ సంచలన వ్యాఖ్యలు!

కొత్తగా పార్టీలోకి రాగానే వాళ్లకు పదవులు ఇవ్వాల్సిన అవసరం లేదని వీహెచ్‌ పేర్కొన్నారు. గాంధీభవ¯Œ లో ఆయన గురువారం మాట్లాడారు. కీలక పదువులు ఒరిజినల్‌ కాంగ్రెస్‌ నేతలకే ఇవ్వాలన్నారు.

Written By: Raj Shekar, Updated On : May 19, 2023 10:30 am

VH On CM Post

Follow us on

VH On CM Post: సీనియర్‌ కాంగ్రెస్‌ నేత.. సంచలనల వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే మాజీ పీసీసీ చీఫ్‌ వి.హనుమంతరావు(వీహెచ్‌) తాజాగా సంచలన కామెంట్స్‌ చేశారు. పదవులను ఒరిజినల్‌ కాంగ్రెస్‌ నేతలకే ఇవ్వాలని, కొత్తగా పార్టీలోకి రాగానే వాళ్లకు పదవులు ఇవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అంతేకాదు.. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ తనను సీఎం చేయాలనుకున్నాడు అని బాంబు పేల్చాడు. ఈ వ్యాఖ్యల ద్వారా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిస్తే.. తాను కూడా సీఎం రేసులో ఉన్నానని పరోక్ష సంకేతం ఇచ్చినట్లు తెలుస్తోంది.

పార్టీలో చేరగానే పదవులెందుకు..
కొత్తగా పార్టీలోకి రాగానే వాళ్లకు పదవులు ఇవ్వాల్సిన అవసరం లేదని వీహెచ్‌ పేర్కొన్నారు. గాంధీభవ¯Œ లో ఆయన గురువారం మాట్లాడారు. కీలక పదువులు ఒరిజినల్‌ కాంగ్రెస్‌ నేతలకే ఇవ్వాలన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ హవా మొదలైందని రాబోయే రోజుల్లో పార్టీలో చేరికలు పెరుగుతాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఉన్నోళ్లను కాదని, కొత్తవారికి అవకాశం ఇవ్వడం వలన పార్టీకి నష్టం జరుగుతుందని సూచించారు.

ఆలోచించాల్సిన సమయం..
టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌తోపాటు హైకమాండ్‌ను ఈమేరకు విన్నవిస్తానని వీహెచ్‌ తెలిపారు. గతంలో రాజీవ్‌ గాంధీ తనను ముఖ్యమంత్రి చేయాలని అనుకున్నాడని, కానీ బ్యాడ్‌ లక్‌ కారణంగా కాలేకపోయాయని ఆవేదన వ్యక్తం చేశాడు.

ఆలు లేదు.. చూలు లేదు..
ఆలు లేదు.. చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్న చందంగా వీహెచ్‌ కామెంట్స్‌ ఉన్నాయని అంటున్నారు రాజకీయం విశ్లేషకులు. కాంగ్రెస్‌ పార్టీలో హైకమాండ్‌ దగ్గర పేరున్న నేతల్లో చాలా మందికి ప్రజాక్షేత్రంలో బలం లేదు. ఇలాంటి వారు పెద్దల పేరు చెప్పుకుని కాలం వెళ్లదీస్తున్నారు. అధిష్టానం ఆశీస్సులతో పదవులు పొందారు. ఇలాంటి వారిలో వీహెచ్‌ కూడా ఒకరు. ఎప్పుడూ ప్రజాక్షేత్రంలో గెలవని వీహెచ్‌.. ఎన్నికల ఏడాదిలో సీఎం అయ్యేవాడిని అని కామెంట్స్‌ చేయడం చర్చనీయాంశమైంది. తనకు అధిష్టానం ఆశీస్సులు ఉన్నాయని, వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలిస్తే తాను కూడా సీఎం రేసులో ఉంటానని పరోక్షంగా సంకేతం ఇచ్చారన్న చర్చ జరుగుతోంది. అసందర్భంగా సీఎం కామెంట్స్‌ వెనుక ఉద్దేశం అదే అని భావిస్తున్నారు. పార్టీ గెలుపు ఓటముల్లో ఎలాంటి ప్రభావం చూపని వీహెచ్‌ కామెంట్స్‌ ఇప్పుడు.. సరికొత్త చర్చకు దారితీశాయి.