Chicken Price Increase: భగ్గుమన్న చికెన్ ధరలు.. ఎందుకు పెరిగాయి? ప్రస్తుత ధరలివీ

హైదరాబాద్ లో నెల రోజుల కింద చికెన్ ధర కిలో కు 154 రూపాయలు ఉండేది. కానీ వాతావరణ పరిస్థితులతో ఈ ధరలు మెల్లమెల్లగా పెరుగుతూ వస్తున్నాయి. మే మొదటి వారంలో ఊహించని వర్షాలు..

Written By: Chai Muchhata, Updated On : May 19, 2023 2:56 pm

Chicken Price Increase

Follow us on

Chicken Price Increase: తెలంగాణలో చికెన్ ధరలకు రెక్కలొచ్చాయి. నెల రోజులుగా తగ్గుముఖం ఉన్న ధరలు ఒక్కసారిగా అమాంతం పెరిగాయి. ఓవైపు ఎండలు మండి పోతుండగా ఇప్పటికే చాలామంది మాంసానికి దూరం అయ్యారు. ఇదే సమయంలో చికెన్ ధరలు పెరగడంతో ఇక అటువైపు చూడలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో చికెన్ మాంసం విక్రయాలు గణనీయంగా తగ్గుతాయని అంటున్నారు. అసలు చికెన్ ధరలు పెరగడానికి కారణమేంటి? ప్రస్తుతం తెలంగాణలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

హైదరాబాద్ లో నెల రోజుల కింద చికెన్ ధర కిలో కు 154 రూపాయలు ఉండేది. కానీ వాతావరణ పరిస్థితులతో ఈ ధరలు మెల్లమెల్లగా పెరుగుతూ వస్తున్నాయి. మే మొదటి వారంలో ఊహించని వర్షాలు.. ఆ తరువాత విపరీతమైన ఎండలతో చాలా కోళ్లు అనారోగ్యానికి గురయ్యాయి. దీంతో పౌల్ట్రీ ఉత్పత్తి లో మార్పులు వచ్చాయి. ఇది తీవ్ర నష్టాన్ని చేకూర్చాయని కొందరు పౌల్ట్రీ రైతులు అంటున్నారు. మరో వైపు కోళ్ల దానాలు, తదితర ధరలు పెరుగుతుండడంతో మాంసం ధరలు పెరిగాయని అంటున్నారు.

ఏప్రిల్ 1న హైదరాబాద్ లో విత్ స్కిన్ కిలో చికెన్ రూ.154 ఉండేది. మే 18 నాటికి ఇది రూ.213కి పెరిగింది. స్కిన్ లెస్ విషయానికొస్తే ఏప్రిల్ 1న రూ.175 ఉండేది.. మే 19 నాటికి రూ.243 కి పెరిగింది. ఫామ్ కోడి ధర అప్పుడు రూ.84 ఉండగా..ప్రస్తుతం రూ.125కి విక్రయిస్తున్నారు. నెలరోజుల్లో చికెన్ ధరు రూ.50కి పైగా పెరగడంతో మాంసం ప్రియులు షాక్ అవుతున్నారు. చికెన్ ధరలు పెరగడంతో ఈ మాంసానికి సంబంధించిన ఆహార పదార్థాలు కూడా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.

ఇక కోడిగుడ్ల విషయానికొస్తే ప్రస్తుతం ఒక్కోటి రూ.4.50 విక్రయిస్తున్నారు. వీటి ధర కూడా పెరుగుతాయని అంటున్నారు. చికెన్ ధరలు పెరగడం వల్ల వీటి అమ్మకాలు తగ్గుతాయని కొందరు అంటున్నారు. ఇప్పటికే ఎండవేడితో చాలా మంది మాంసానికి దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం వీటి ధరలు పెరగడంతో అమ్మకాలు గణనీయంగా తగ్గిపోతాయని వ్యాపారులు అంటున్నారు. అయితే ఈ ధరలు ఇలాగే ఉంటాయా? మరింత పెరుగుతాయా? అనేది చూడాలి.