https://oktelugu.com/

రాజ్‌దీప్ పై వేటు..: రెండు వారాలు స్క్రీన్‌ పైకి రాకూడదని ఆదేశం

మీడియాలో ఒక్క ఫేక్‌ న్యూస్‌ ఎలాంటి పరిస్థితులకైనా దారితీయచ్చు. ఒక్కోసారి కుటుంబాలకు కుటుంబాలే బలి అయ్యే ప్రమాదమూ వస్తుంది. ఇటీవల రైతుల ఆందోళనల నేపథ్యంలో ఓ ఇంగ్లిష్‌ న్యూస్‌ చానల్‌ అలాంటి ఫేక్‌ వార్త ప్రసారం చేసింది. దీంతో ఆ చానల్‌ యాజమాన్యం తప్పుడు వార్తలు ప్రచారం చేసిన ప్రముఖ జర్నలిస్ట్‌ రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌పై రెండు వారాలపాటు వేటు వేసింది. Also Read: అయోధ్య మసీదులో నమాజ్ చేసినా పాపమే.. అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు ఆయనను రెండు […]

Written By:
  • Srinivas
  • , Updated On : January 29, 2021 1:48 pm
    Follow us on

    Rajdeep
    మీడియాలో ఒక్క ఫేక్‌ న్యూస్‌ ఎలాంటి పరిస్థితులకైనా దారితీయచ్చు. ఒక్కోసారి కుటుంబాలకు కుటుంబాలే బలి అయ్యే ప్రమాదమూ వస్తుంది. ఇటీవల రైతుల ఆందోళనల నేపథ్యంలో ఓ ఇంగ్లిష్‌ న్యూస్‌ చానల్‌ అలాంటి ఫేక్‌ వార్త ప్రసారం చేసింది. దీంతో ఆ చానల్‌ యాజమాన్యం తప్పుడు వార్తలు ప్రచారం చేసిన ప్రముఖ జర్నలిస్ట్‌ రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌పై రెండు వారాలపాటు వేటు వేసింది.

    Also Read: అయోధ్య మసీదులో నమాజ్ చేసినా పాపమే.. అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు

    ఆయనను రెండు వారాలపాటు స్క్రీన్ పైకి రాకుండా వేటు వేసింది. అంతే కాదు.. నెల రోజులపాటు జీతం కూడా కత్తిరించాలని నిర్ణయించింది. ఇండియా టుడే యాజమాన్యం తీసుకున్న ఈ నిర్ణయం మీడియా వర్గాల్లో హైలెట్ అవుతోంది. ఎందుకంటే ఆయన ఆ చానల్‌కు కన్సల్టింగ్ ఎడిటర్ స్థాయిలో ఉన్నారు. ప్రైమ్ టైమ్‌లో ఆ చానల్ కార్యక్రమాలను నిర్వహిస్తారు.

    Also Read: మరో రూట్‌లో వెళ్లిన కేంద్రం..: రైతు ఉద్యమంపై ఉక్కుపాదం తప్పదా..?

    గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రైతులు భారీ ఎత్తున ట్రాక్టర్ల ర్యాలీ చేపట్టింది. ట్రాక్టర్ల ర్యాలీ ఢిల్లీలోకి ప్రవేశిస్తున్న సమయంలో ఓ రైతు చనిపోయాడు. ఆయన పోలీసు కాల్పుల్లోనే చనిపోయాడని.. రాజ్ దీప్ సర్దేశాయ్ ప్రచారం చేశారు. ఎన్డీటీవీ ప్రచారాన్ని ఇతర మీడియా సంస్థలు హైలెట్ చేశాయి. దీంతో రైతులపై పోలీసులు కాల్పులు జరిపారన్న ప్రచారం ఉధృతంగా సాగింది. అయితే.. పోలీసులు శరవేగంగా స్పందించారు. ఆ రైతు చనిపోయిన ప్రదేశంలో ఉన్న సీసీ టీవీ ఫుటేజీని విడుదల చేశారు. వేగంగా వచ్చిన ట్రాక్టర్ బోల్తా పడటంతో అందులో ఉన్న రైతు తీవ్ర గాయాల పాలై చనిపోయారని పోలీసులు ప్రకటించారు.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్

    అయితే.. రిలీజ్‌ చేసిన సీసీ టీవీ ఫుటేజీలోనూ అదే ఉంది. దాంతో రాజ్ దీప్ సర్దేశాయ్ తప్పు చేసినట్లుగా నిర్ధారణ అయింది. రాజ్ దీప్ సర్దేశాయ్ బీజేపీకి వ్యతిరేకంగా ఉంటారన్న ప్రచారం ఉంది. గతంలో ఆయనపై అమెరికాలో మోడీ పర్యటన సందర్భంగా బీజేపీ కార్యకర్తలు దాడి కూడా చేశారు. రిలయన్స్ గ్రూప్ చేజిక్కించుకోక ముందే సీఎన్ఎన్ ఐబీఎన్‌లో కీలక పాత్ర పోషించేవారు. న్యూస్ 18చేతికి ఆ చానల్ వెళ్లిన తర్వాత బయటకు వెళ్లాల్సి వచ్చింది. తర్వాత ఇండియా టుడేలో చేరారు. అయినా తన వైఖరిలో మాత్రం మార్పు రావడం లేదు. ఇప్పుడు మరోసారి ఇలాంటి భంగపాటుకు గురయ్యారు.