Rajasthan : ప్రస్తుతం సమాజంలో కొడుకు, కూతురు సమానమే అని చాలా మంది అంటుంటారు కానీ అందరికీ కొడుకు మాత్రమే కావాలి. కూతుళ్లు కావాలని అంటారు కానీ భవిష్యతును ఆలోచించుకుని వారు కాస్త వెనకంజ వేయడం చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు కొడుకులు, కూతుళ్లకు సమాన హక్కులు ఉండే గ్రామం రాజస్థాన్‌లో ఉంది. ఆడపిల్లల పేరిట లక్షల మొక్కలు నాటడం వల్లే ఈ గ్రామం నేడు పచ్చగా ఉంది. 2005లో ఈ గ్రామం రూపురేఖలు మారిపోయాయి. 2005లో శ్యామ్ సుందర్ పలివాల్ రాజస్థాన్‌లోని రాజ్‌సమంద్ జిల్లా పిప్లాంత్రి గ్రామానికి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. అతని కూతురు పేరు కిరణ్. సమాజంలో మంచి సందేశం అందించేందుకు సర్పంచ్ పలివాల్ తన కూతురు కిరణ్ పేరిట ‘కిరణ్ నిధి యోజన’ని ప్రారంభించారు. ఈ పథకం కింద ప్రతి ఆడపిల్ల పుట్టినప్పుడు 111 మొక్కలు నాటడంతోపాటు 20 ఏళ్ల పాటు కూతురి పేరిట 21 వేల రూపాయలు కూడా బ్యాంకులో జమ చేస్తారు. ఈ పథకం ఇప్పుడు పిప్లంత్రి గ్రామంలోని ప్రతి గ్రామస్తులకు సంస్కృతిలో భాగమైంది. నేటికీ ఇక్కడ ఆడపిల్లలు పుడితే 111 మొక్కలు నాటే సంప్రదాయం కొనసాగుతోంది.
ఇలా మొక్కలు నాటే సంప్రదాయం వల్ల నేడు పిప్లంత్రి గ్రామం పూర్తిగా సస్యశ్యామలంగా మారింది. ఆడపిల్లలు పుట్టిన సందర్భంగా ఇప్పటి వరకు ఈ గ్రామంలో మూడు లక్షలకు పైగా మొక్కలు నాటారు. ఈ గ్రామంలోని ప్రతి కుమార్తె పాఠశాలకు వెళుతుంది. ఈ గ్రామంలో ఒక్క భ్రూణ హత్యలు జరగవు. బాల్య వివాహాలు, వరకట్న వ్యవస్థను నియంత్రించారు. దాదాపు 25 లక్షల కలబంద మొక్కలు నాటడం వల్ల మహిళలు, పురుషులు షాంపూలు, జ్యూస్‌లు, జెల్‌లు తయారు చేయడం ద్వారా ఉపాధి పొందుతున్నారు.
ఈ గ్రామాన్ని సందర్శించడానికి ఇతర దేశాల నుండి పర్యాటకులు వచ్చినప్పుడు, వారు రాగానే ఒక మొక్కను నాటుతారు. పిప్లంత్రి గ్రామం నమూనాలో అనేక పుస్తకాలు రచించారు. ఏళ్ల క్రితం ఎడారిగా కనిపించిన ఈ గ్రామం ఇప్పుడు పచ్చదనంతో కళకళలాడుతోంది. క్రమంగా పిప్లంత్రి గ్రామం పర్యాటక గ్రామంగా అభివృద్ధి చెందుతోంది. ఈ గ్రామం 2007లో బహిరంగ మలవిసర్జన రహితంగా మారినందుకు స్వచ్ఛత అవార్డును కూడా అందుకుంది. 2021లో ఈ గ్రామ మాజీ సర్పంచ్ శ్యామ్ సుందర్ పలివాల్ కూడా పద్మశ్రీతో సత్కరించారు. ఇప్పుడు గ్రామం క్రమంగా సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులు వేస్తోంది. ఆడపిల్లలు పుడితే 111మొక్కలు నాటడం ఆనవాయితీగా రావడంతో పిప్లంత్రి గ్రామ పరిసరాలు కాలుష్య రహితంగా తయారయ్యాయి. కూతుళ్లు మొక్కలను సోదరులుగా భావించి ప్రతి రక్షాబంధన్ రోజున మొక్కలకు రాఖీ కడతారు. గ్రామస్తులు అందరూ కలిసి చెట్లను, మొక్కలను సంరక్షిస్తారు. పరిశుభ్రమైన, అందమైన, స్వచ్ఛమైన వాతావరణంతో పాటు, ఈ గ్రామం ఆడపిల్లలకు సురక్షితంగా, భారతదేశానికి కీర్తిని తీసుకువస్తోంది.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Rajasthan that town is an ideal not only for the country but also for the world do you know what will be done if a girl child is born there
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com