Rajasthan : మనదేశంలో నిర్భయ ఘటన సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.. ఆ తర్వాత తెలంగాణలో వెటర్నరీ వైద్యురాలి హత్యాచారం కూడా దేశంలో కలకలం రేపింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు కోల్ కతా లో చోటు చేసుకున్న అభయ ఘటన దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. అయితే మారుతున్న కాలంలోనూ ఆడవాళ్లపై అత్యాచారాలు తగ్గకపోవడం విశేషం. పైగా రోజురోజుకు మహిళలపై జరిగే అఘాయిత్యాలు మరింత పెరిగిపోతున్నాయి.. ప్రభుత్వాలు ఎన్ని రకాల చట్టాలు తీసుకొచ్చినా.. కేసులు ఎంత త్వరగా పడేలా చూస్తున్నప్పటికీ.. నిందితుల వ్యవహార శైలి మారడం లేదు. పైగా ఆడవాళ్ళపై దారుణాలు తగ్గడం లేదు. ఇవి అంతకంతకు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. మహిళలపై నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో అప్పటికప్పుడు నిందితులను శిక్షించాలనే డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.
హోం మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం.
హోం మంత్రిత్వ శాఖ 2022లో విడుదల చేసిన జాతీయ నేర నివేదిక ప్రకారం మన దేశంలో మొత్తం 31,516 గృహహింస కేసులు చోటుచేసుకున్నాయి. అయితే ఈ నివేదిక 2023 లో ప్రచురించలేదు.. లైంగిక వేధింపులకు సంబంధించిన ఫిర్యాదుల నమోదులో అస్సాం పదవ స్థానంలో ఉంది. 2022లో ఈ రాష్ట్రంలో 1,113 కేసులు నమోదయ్యాయి. ఇక్కడ నేరాల శాతం 6.4 గా ఉండడం విశేషం. ఆ తర్వాత ఢిల్లీ 9వ స్థానంలో ఉంది. ఆ ఏడాదిలో ఢిల్లీలో మొత్తం 1,212 లైంగిక వేధింపుల కేసులు నమోదయ్యాయి. నేరాల శాతం 12.3గా నమోదయింది. లైంగిక వేధింపులకు సంబంధించి నమోదవుతున్న కేసుల్లో చత్తీస్గడ్ రాష్ట్రం ఎనిమిదో స్థానంలో ఉంది. ఈ రాష్ట్రంలో 1,246 కేసులు నమోదయ్యాయి. నేరాల శాతం 8.3 గా ఉంది. ఈ జాబితాలో జార్ఖండ్ రాష్ట్రం ఏడవ స్థానంలో కొనసాగుతోంది. 2022లో ఈ రాష్ట్రంలో 1,298 లైంగిక వేధింపుల కేసులో నమోదయ్యాయి. నేరాల శాతం 6.8 గా ఉంది. ఒడిశా రాష్ట్రం ఆరవ స్థానంలో కొనసాగుతోంది. ఆ ఏడాదిలో ఈ రాష్ట్రంలో 1,464 లైంగిక వేధింపుల కేసులు నమోదయ్యాయి. అలాగే నేరాల శాతం 6.4 గా నమోదయింది. హర్యానా రాష్ట్రం ఐదవ స్థానాన్ని ఆక్రమించగా.. ఈ రాష్ట్రంలో ఆ ఏడాది 1,787 లైంగిక వేధింపుల కేసులో నమోదయ్యాయి. నేరాల శాతం 12.7 గా నమోదయింది. ఈ జాబితాలో మహారాష్ట్ర నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. ఇక్కడ మొత్తం 2,904 లైంగిక వేధింపుల కేసులు నమోదయ్యాయి. ఈ రాష్ట్రంలో నేరాల శాతం 4.8 గా నమోదయింది. లైంగిక వేధింపుల కేసులకు సంబంధించి మధ్యప్రదేశ్ రాష్ట్రం మూడవ స్థానంలో నిలిచింది. 2022లో ఈ రాష్ట్రంలో 3,029 లైంగిక వేధింపుల కేసులు నమోదయ్యాయి. ఈ రాష్ట్రంలో నేరాల శాతం 7.3 గా ఉంది. ఇక ఉత్తరప్రదేశ్ లైంగిక వేధింపుల కేసులకు సంబంధించి రెండవ స్థానంలో నిలిచింది. 2022లో ఈ రాష్ట్రంలో 3,690 లైంగిక వేధింపుల కేసులో నమోదయ్యాయి. ఇక ఈ రాష్ట్రంలో నేరాల శాతం 3.3 గా నమోదయింది. రాజస్థాన్ రాష్ట్రం ఆడపిల్లలపై జరిగే లైంగిక వేధింపుల కేసుల్లో మొదటి స్థానాన్ని ఆక్రమించింది. ఈ రాష్ట్రంలో 2022లో 5,399 లైంగిక వేదింపులకు సంబంధించిన ఫిర్యాదులు నమోదయ్యాయి.
తమిళనాడు 20వ స్థానం
ఈ జాబితాలో దక్షిణాది రాష్ట్రాల్లో కీలకమైన తమిళనాడు 20వ స్థానంలో నిలిచింది. 2022లో ఈ రాష్ట్రంలో 421 లైంగిక వేధింపుల కేసులు నమోదయ్యాయి. సిక్కిం రాష్ట్రం చివరి స్థానంలో నిలిచింది. 2022లో ఈ రాష్ట్రంలో 13 లైంగిక హింసకు తాలూకూ సంబంధించిన కేసుల నమోదయ్యాయి. కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్ ఈ జాబితాలో చివరి స్థానాన్ని ఆక్రమించింది. ఆ సంవత్సరంలో ఆ ప్రాంతంలో నాలుగు లైంగిక వేధింపుల కేసులు నమోదు కావడం విశేషం.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Rajasthan has the highest number of crimes against women in our country
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com