
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్.. పార్టీ పెట్టడం ఖరారైపోయింది. అనుకున్నట్టు జరిగితే.. ఆయన పార్టీ విజయఢంకా మోగిస్తే.. రజనీకాంత్ మాత్రం సీఎం కుర్చీ ఎక్కరట! ఆయన కాకుండా.. ఓ యువకుడిని ముఖ్యమంత్రి చేస్తానని చెబుతున్నారు.
Also Read: రజనీ పార్టీ చిహ్నం ఇదే..?ప్రజలను ఆకట్టుకోనుందా..?
ఎందుకీ మాటలు..?
వాస్తవానికి రజనీకాంత్ రాజకీయాల్లోకి ఎప్పుడో రావాల్సింది. కానీ.. పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి తలైవా.. ఒక అడుగు ముందుకేస్తే.. నాలుగు అడుగులు వెనక్కి వేస్తూ వచ్చారు. మొత్తానికి ఆ సస్పెన్స్ కు తెర దించుతూ.. పార్టీ పెడతానని ప్రకటించారు. అయితే.. గెలిస్తే.. వేరే యువకుడ్ని సీఎం చేస్తానని చెప్పడం పై చర్చ మొదలైంది. నిజానికి.. ఒకవేళ గెలిచి, వేరే యువకుడిని సీఎం చేస్తే.. ఇతర ఎమ్మెల్యేలతోపాటు.. జనం కూడా ఒప్పుకోరు. ఖచ్చితంగా తలైవానే సీఎం అవ్వాలి. మరి, ఈ యువ సీఎం వాదన ఎందుకు తెచ్చారు..?
Also Read: కాళ్లకు మొక్కి బ్లెస్సింగ్స్ తీసుకున్న రజినీకాంత్ !
ఇది ఆ వ్యూహమేనా..?
రజనీకాంత్ ప్రకటన వెనుక వ్యూహం ఉందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. 70 ఏళ్ల వయసులో రజనీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం ఇప్పటికే తమిళనాడులో చర్చనీయాంశం అయింది. ఆయనకు వయస్సు మీద పడటంతో పాటు పలు అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ఈ విషయాన్ని ఆయనే వెల్లడించారు. దీంతో.. ఈయన గెలిస్తే ప్రజలకు ఏం సేవ చేస్తారన్న ప్రశ్నలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో.. కేసీఆర్ అమలు చేసిన దళిత సీఎం వ్యూహం లాంటి ఎత్తుగడనే రజనీ తెరపైకి తెచ్చారనే వాదన వినిపిస్తోంది. మరి, ఏది నిజం అనేది భవిష్యత్ లోనే చూడాలి.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్