Rahul Gandhi Tweet On Paddy Procurement: ధాన్యం కొనుగోలు విషయంలో ప్రస్తుతం టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ తో టీఆర్ఎస్ నేతలు ఘాటుగానే సమాధానాలు ఇస్తున్నారు. తమదైన శైలిలో కాంగ్రెస్ పై దుమ్మెత్తిపోస్తున్నారు కేటీఆర్ నుంచి మొదలుకొని ప్రశాంత్ రెడ్డి, జీవన్ రెడ్డి, హరీష్ రావు, కవిత తదితరులు రాహుల్ ట్వీట్ కు బదులిస్తున్నారు. కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడుతున్నారు. రైతుల కోసం పోరాటం చేస్తున్న టీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వాల్సిందిపోయి విమర్శలు చేయడం వారి అనైతికతకు నిదర్శనమని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో బీజేపీని పట్టించుకోకుండా టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా మాటల యుద్ధం పెరుగుతోంది.
తెలుగులో రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ తో సీన్ మొత్తం మారిపోయింది. రెండు పార్టీల్లో వైరుద్ధం పెరిగిపోయింది. తెలంగాణలో ధాన్యం కొనుగోలును రాజకీయం చేయొద్దని రాహుల్ ట్వీట్ చేయడంతో గొడవ తారాస్థాయికి చేరింది. దేశానికి అన్నంపెట్టే రైతుల కష్టం తీర్చే విషయంలో టీఆర్ఎస్ వైఖరిని తప్పుబట్టారు. దీంతో టీఆర్ఎస్ నేతలు కోపోద్రిక్తులయ్యారు. రాహుల్ ట్వీట్ తో టీఆర్ఎస్ కౌంటర్లు మొదలు పెట్టింది.
Also Read: AP Cabinet Expansion Date Fixed: కేబినెట్ విస్తరణ ముహూర్తం ఈనెల 11కు జగన్ ఫిక్స్ అయ్యారా?
దీనికి కాంగ్రెస్ నేతలు కూడా స్పందించారు. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి నేతలు టీఆర్ఎస్ నేతల తీరుపై ఆక్షేపించారు. ఎఫ్ సీఐకి సీఎం కేసీఆర్ బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని మీ తండ్రి గత ఆగస్టులోనే ఒప్పందంపై సంతకం చేసిన సంగతి గుర్తుకు లేదా అని మండిపడుతున్నారు. దీంతో బీజేపీ టీఆర్ఎస్ మధ్య ఉన్న వ్యవహారం కాస్త టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా మారిపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ నేతల తీరుపై కాంగ్రెస్ నేతలు ఎదురుదాడి చేస్తున్నారు. దీంతో రాజకీయ వ్యూహాలు మారిపోతున్నట్లు తెలుస్తోంది.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కవిత చేసిన ట్వీట్ కు సమాధానం చెప్పారు. టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ హాల్ లో కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు. ధాన్యం కొనుగోలు విషయంలో రాజీనామాలు చేయడానికి సిద్ధమేనని కోమటిరెడ్డి చేసిన సవాలుకు టీఆర్ఎస్ నేలు ముందుకు రావాలని కోరారు మొత్తానికి రాహుల్ ట్వీట్ విషయం కాస్త రెండు పార్టీల్లో రగడ రేగడానికి కారణమవుతోంది.
Also Read: CM Jagan Gets Negative Review: జగన్ కు మరో అవకాశం ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా లేరా?