Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరో వివాదంలో ఇరుక్కున్నారు. ఎప్పుడు ఏదో ఒక వివాదంలో ఉండటం ఆయనకు మామూలే. కానీ ఇప్పుడు ఆయన పర్యటనపై దుమారం రేగుతోంది. ఎంపీలు విదేశీ పర్యటనకు వెళ్లేటప్పుడు కేంద్రం అనుమతి తీసుకోవాల్సి ఉన్నా లెక్కచేయలేదు. దీంతో ఆయన పర్యటనపై విమర్శలు వస్తున్నాయి. ప్రతిపక్ష నేత అయినా పర్మిషన్ తీసుకోవాల్సిందే అని తెలిసినా నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ గాంధీ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ఈ విషయం తెగ వైరల్ అవుతోంది.
అధికారిక పర్యటనలకు అనుమతి కావాలి కానీ వ్యక్తిగత పర్యటనలకు ఎందుకని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. ఎప్పటి నుంచే పార్లమెంట్ సభ్యులు దేశం విడిచిపెట్టి పోయినప్పుడు మూడు వారాల ముందే విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు తెలియజేయాల్సి ఉంటుంది. కానీ రాహుల్ గాంధీ మాత్రం ఈ పని చేయకుండా స్వతంత్ర నిర్ణయంతో వెళ్లడం వివాదాలకు తావిస్తోంది. రాహుల్ గాంధీ తన పర్యటనతో మరోమారు వార్తల్లో నిలిచారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతగా పలుమార్లు ఇలా వివాదాల్లో దూరం తెలిసిందే.
Also Read: NTR- Srinidhi Shetty: ఎన్టీఆర్ సినిమాలో కేజీఎఫ్ స్టార్.. సెట్ ఐతే రికార్డ్సే
మరోవైపు బ్రిటన్ లో రాజకీయ నాయకుడు జెరెమీతో సమావేశం అయ్యారు. దీంతో బీజేపీ నేతలు మండిపడుతున్నారు. జెరెమీ కశ్మీర్ వేర్పాటు వాదానికి మద్దతు ఇచ్చే వాడని ఆయనను ఎందుకు కలిసినట్లు అని ప్రశ్నిస్తున్నారు. దీనిపై కాంగ్రెస్ నేతలు కూడా కౌంటర్ ఇస్తున్నారు. గతంలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఆయనను బ్రదర్ అని పిలుస్తూ ఆలింగనం చేసుకోలేదా అని ఎదురుదాడికి దిగుతున్నారు. మొత్తానికి రాహుల్ గాంధీ తీరుపై రెండు పార్టీల్లో ప్రకంపనలు రేగుతున్నాయి.
రాహుల్ గాంధీ పర్యటన రెండు పార్టీల్లో అలజడి సృష్టిస్తోంది. లండన్ లో ఆయన వివాదాస్పదమైన వ్యక్తులను కలవడంతో బీజేపీ నేతలు విమర్శలు చేస్తుంటే కాంగ్రెస్ కూడా తనదైన శైలిలో స్పందిస్తోంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనుమతులు తీసుకోకుండా పర్యటనకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. దేశంలో మరోమారు రాహుల్ గాంధీ వార్తల్లో నిలుస్తుండటం గమనార్హం. ముందస్తు అనుమతులు తీసుకోకపోవడంతో ఇంత రాద్ధాంతం జరిగినట్లు తెలుస్తోంి. కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం బీజేపీ నేతలకు కౌంటర్లు ఇస్తూ తమ నాయకుడు చేసింది సమంజసమనే వాదనలు చేస్తున్నారు.