https://oktelugu.com/

NTR- Srinidhi Shetty: ఎన్టీఆర్ సినిమాలో కేజీఎఫ్ స్టార్.. సెట్ ఐతే రికార్డ్సే

NTR- Srinidhi Shetty: ప్రశాంత్ నీల్- ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో హీరోయిన్ గురించి ఒక క్రేజీ అప్ డేట్ వినిపిస్తోంది. ఈ సినిమాలో కేజీఎఫ్ స్టార్ శ్రీనిధి శెట్టిని హీరోయిన్‌ గా తీసుకుంటే బాగుంటుందని తారక్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి, ప్రశాంత్ నీల్‌ శ్రీనిధికి మరో క్రేజీ ఆఫర్ ఇస్తాడా ? లేదా ? అనేది చూడాలి. ప్రస్తుతానికి ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారని తెలుస్తోంది. వారిలో ఒకరిగా శ్రీనిధి శెట్టికి అవకాశం […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : May 26, 2022 / 05:23 PM IST
    Follow us on

    NTR- Srinidhi Shetty: ప్రశాంత్ నీల్- ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో హీరోయిన్ గురించి ఒక క్రేజీ అప్ డేట్ వినిపిస్తోంది. ఈ సినిమాలో కేజీఎఫ్ స్టార్ శ్రీనిధి శెట్టిని హీరోయిన్‌ గా తీసుకుంటే బాగుంటుందని తారక్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి, ప్రశాంత్ నీల్‌ శ్రీనిధికి మరో క్రేజీ ఆఫర్ ఇస్తాడా ? లేదా ? అనేది చూడాలి. ప్రస్తుతానికి ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారని తెలుస్తోంది. వారిలో ఒకరిగా శ్రీనిధి శెట్టికి అవకాశం ఉండే ఛాన్స్ ఉంది.

    NTR- Srinidhi Shetty

    ఇక ఈ సినిమాలో మరో కీలక పాత్ర ఉంది. ఈ పాత్ర.. కథనే మలుపు తిప్పుతుంది. అందుకే, ఈ పాత్రలో కమల్ హాసన్ ను ఒప్పించాలని ప్రశాంత్ నీల్ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ వార్త వాస్తవ రూపం దాల్చితే.. భారతీయ సినీ తెరకు మరో పండుగ ఖరారు అయినట్టే. మరి ఆ పండుగ త్వరగా రావాలని కోరుకుందాం. కమల్ హాసన్ కూడా ఈ సినిమా ఒప్పుకుంటాడని ప్రశాంత్ నీల్ నమ్మకంగా ఉన్నాడు.

    Also Read: Netizens trolls on Allu Arjun daughter: అల్లు అర్జున్ కూతురు పై నెటిజెన్స్ ట్రోల్ల్స్..కారణం అదేనా!

    ఈ చిత్రం పీరియాడిక్ మూవీ. ఆఫ్ఘనిస్తాన్ యుద్ధ నేపథ్యంలో ఈ చిత్రం జరగనుంది. ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంలో జరిగిన కొన్ని పరిస్థితుల ఆధారంగా కథ మొదలవుతుంది. నిజానికి ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం పైనే కమల్ హాసన్ తన “విశ్వరూపం” సినిమా తీశాడు. ఈ నేపథ్యం పై కమల్ కి ప్రత్యేకమైన ఆసక్తి ఉంది. ఆ యుద్ధ వాతావరణంలో కొన్ని ఊహించిన పరిణామాలు జరిగాయని కొందరి వాదన.

    Srinidhi Shetty

    కమల్ కి తన సినిమాలో వాటిని పూర్తిగా చూపించే అవకాశం కలగలేదు. ముఖ్యంగా అల్ ఖైదా, డర్టీ బాంబు లాంటి క్లిష్టమైన, కష్టమైన అంశాలను.. ఒక ఆర్మీ ఆఫీసర్ ఎలా ప్రభావితం చేసి, వాటిని లేకుండా చేశాడనేది మెయిన్ కథ. ఆ ఆఫీసర్ మెంటర్ పాత్రలోనే కమల్ నటించే అవకాశం ఉంది. కథ చాలా మలుపులు తిరుగుతుందట. కమల్ – ఎన్టీఆర్ మధ్యే భీకరమైన పోరు జరుగుతుందని.. దేశం కోసం కమల్ పాత్ర ప్రాణ త్యాగం చేస్తోందని కూడా తెలుస్తోంది.

    మొత్తానికి ఈ కథ చాలా బరువైనది. ఇలాంటి బరువైన కథలో బలమైన నటులు నటిస్తే.. ఆ అపూర్వమైన నటనా సామర్ధ్యాలను చూడటానికి మన రెండు కళ్ళు చాలవు. ఆ చూసే రోజు కోసం, ఆసక్తిగా ఎదురు చూద్దాం.

    Also Read:NTR- Rajamouli: ఎన్టీఆర్ పుట్టినరోజు ని రాజమౌళి అందుకే పట్టించుకోలేదా!
    Recommended videos


    Tags