spot_img
Homeజాతీయ వార్తలుRahul Gandhi Injury: రాహుల్ రక్తం కళ్ళ చూశారు.. మోడీకి ఇది మైనస్సే

Rahul Gandhi Injury: రాహుల్ రక్తం కళ్ళ చూశారు.. మోడీకి ఇది మైనస్సే

Rahul Gandhi Injury: మల్లికార్జున కార్గే నిన్న తన పుట్టినరోజు జరుపుకున్నారు.. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్లారు.. పోలీసులు కూడా వారి కేవలం శుభాకాంక్షలు తెలియజేయడానికి మాత్రమే వెళ్తున్నారని అనుకున్నారు. కానీ పోలీసులను ఒక్కసారిగా దారి మళ్ళించి కాంగ్రెస్ నాయకులు ప్రధాని నరేంద్ర మోడీ నివాసం వైపు వెళ్లారు.. అక్కడ ఆందోళన చేపట్టారు. అది కాస్త హింసాత్మకంగా మారింది.

రాహుల్ గాంధీ, సోనియాగాంధీ, మల్లికార్జున కార్గే, ప్రియాంక వాద్ర, కేసి వేణుగోపాల్ వంటి వారు నరేంద్ర మోడీ ఇంటి ముందు నిలబడి నిరసన తెలిపారు. వాస్తవానికి ఒక దేశ ప్రధాని ఇంటి ముందు నిలబడి నిరసన తెలుపడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడికి చేరుకొని కాంగ్రెస్ నాయకులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అనంతరం కాంగ్రెస్ నాయకులను అదుపులోకి తీసుకున్నారు.

ఈ ప్రక్రియలో రాహుల్ గాంధీ కింద పడిపోయారు.. అంతేకాదు తోపులాటలో ముక్కుకు గాయమైంది. అది అంత తీవ్రమైనది కాదు. కాకపోతే రక్తం రావడంతో.. కాంగ్రెస్ పార్టీ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం మొదలుపెట్టింది. రాహుల్ రక్తాన్ని మోడీ కళ్ళ చూశారని ఆరోపించడం ప్రారంభించింది. సహజంగానే మన సమాజంలో విక్టిమ్ వాయిస్ కు ప్రాధాన్యం ఉంటుంది. కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలోకి అకస్మాత్తుగా ఎంట్రీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. తన మైలేజ్ కోసం పాకులాడటం మొదలుపెట్టింది. ఇదే సమయంలో రాహుల్ గాంధీ ముక్కు నుంచి రక్తం కారడం.. ఆ పార్టీ నేతలను అరెస్ట్ చేయడం వంటి సంఘటనలను తన సోషల్ మీడియా గ్రూపుల ద్వారా విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నది.

రాహుల్ గాంధీని.. ఇతర కాంగ్రెస్ నాయకులను అదుపులోకి తీసుకుంటున్నప్పుడు పోలీసులు కాస్త సమయమనం తో వ్యవహరించి ఉంటే ఇటువంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు.. కొన్ని సందర్భాలలో ఓపికను ప్రదర్శించాలి. నేర్పరితనాన్ని చూపించాలి. అంతేతప్ప సమస్యను పరిష్కరించేటప్పుడు దూకుడుగా వ్యవహరించకూడదు. అలా చేస్తే ఇదిగో ఇలాంటి పరిణామాలు ఎదురవుతాయి. మరి దీన్ని నరేంద్ర మోడీ ఎలా పరిష్కరిస్తారు.. ఈ సమస్యకు ఎలాంటి దారి దీపాన్ని చూపుతారు.. అనే ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం తెలియాల్సి ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

Ram Gopal Varma: ఆ హీరోను చంపేస్తా…ఆర్జీవీ కి చెప్పిన ఫ్యాక్షనిస్టు…వైరల్ వీడియో…

Ram Gopal Varma: 'శివ' సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ దశాదిశా మార్చిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ...అప్పటి వరకు తెలుగు సినిమాలు అంటే ఒక మూస ధోరణి కథలతో సాగేవిగా ఉండేవి...కానీ...

YSRCP: వైసీపీలో కాపు నేతల తిరుగుబాటు!

YSRCP: కాపు అస్త్రంతో కూటమిని చీల్చాలని జగన్మోహన్ రెడ్డి భావించారు. ఇప్పుడు అదే కాపు అస్త్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గుచ్చుకోబోతోంది. కూటమిని ఇరకాటంలో పెట్టేందుకు, కాపు ఓటు బ్యాంకు ను ఆకట్టుకోవడానికి...

Nagarjuna: రాజమౌళి – అఖిల్ కాంబోను సెట్ చేయాలని చూసిన నాగార్జున…జక్కన్న రియాక్షన్ ఇదేనా…

Nagarjuna: దర్శక ధీరుడు రాజమౌళి చేసే ప్రతి సినిమా విషయంలో చాలా క్లారిటి ని మెయింటైన్ చేస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా సక్సెస్ ను సాధించాడానికి గల ముఖ్య...

Music Directors: ఈ ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ కి తిరుగులేదా…

Music Directors: సినిమా ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్లకు చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది. ఒక సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తుంటారు. ఇక ఏది ఏమైనా కూడా ఒక సినిమాని...

Jagan Mohan Reddy: జగన్ కోసం ఢిల్లీలో రంగంలోకి ఆ సీనియర్!

Jagan Mohan Reddy: అధికారంలో ఉన్నప్పుడు ఆ దర్పం వేరేలా ఉంటుంది. కోల్పోతే అసలు విషయం తెలిసి వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అదే ఎదురైంది. ఒకప్పుడు ఢిల్లీలో అడుగుపెడితే చాలు రాచమర్యాదలు...
Oktelugu Epaper
Exit mobile version