Rahul Gandhi : ఈ దేశాన్ని సుదీర్ఘకాలం పరిపాలించిన ఘనత కాంగ్రెస్ పార్టీది. దానిని ఎవరూ కాదనరు కూడా. బిజెపి ఏకచత్రాధిపత్యం సాగుతున్న నేటి కాలంలోనూ కాంగ్రెస్ పార్టీ దక్షిణాదిలో రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. తమిళనాడులో మిత్రపక్షమైన డీఎంకే ఉంది. నేటికీ జనాలకు కాంగ్రెస్ పార్టీ మీద కొద్దో గొప్పో నమ్మకం ఉందంటే.. దాని కారణం ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులే. ఇప్పుడు టైం బాగోలేదు. చేసినవన్నీ కూడా ఎదురు తంతున్నాయి. అలాంటప్పుడు పార్టీ కీలక నాయకుడిగా.. పార్టీ భారాన్ని మోస్తున్న వ్యక్తిగా రాహుల్ గాంధీ కీలక నిర్ణయాలు తీసుకోవాలి. నరేంద్ర మోడీని ఇరకాటంలో పెట్టే విధంగా వ్యవహరించాలి. కానీ రాహుల్ గాంధీ ఏం చేస్తున్నాడు.. దేశ అంతర్గత ప్రయోజనాల విషయంలోనూ రాజకీయ వెతుక్కుంటున్నాడు. దేశ భద్రత అంశం లో అడ్డగోలుగా వ్యాఖ్యలు చేస్తున్నాడు. చివరికి జోకర్ అయిపోతున్నాడు. ఇలా రాస్తున్నందుకు కాస్త ఇబ్బందిగా ఉన్నప్పటికీ.. జరిగిన పరిస్థితులు.. జరుగుతున్న పరిణామాలు అదేవిధంగా ఉన్నాయి.
ఇటీవల దిక్కుమాలిన ఉగ్రవాద దేశంపై మన సైన్యం దాడులు చేసినప్పుడు.. అదే తీరుగా ఉగ్రవాద దేశం మన మీద కౌంటర్ ఎటాక్ మొదలు పెట్టినప్పుడు.. మన గగనతలాన్ని కంటికి రెప్పలా కాపాడింది ఎస్ 400, రఫెల్ మిసైల్స్. వాస్తవానికి ఇవి లేకపోతే పరిస్థితి దారుణంగా ఉండేది. ఎస్ 400 విషయంలో పెద్దగా ఇబ్బంది లేకపోయినప్పటికీ..రఫెల్ విషయంలో మాత్రం రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని “కాపలదారు దొంగ” అయ్యాడు అంటూ విమర్శించాడు. వాస్తవానికి రఫెల్ ను ప్రాన్స్ నుంచి దిగుమతి చేసుకున్నాం. అప్పట్లో రక్షణ శాఖ మంత్రిగా ఉన్న మనోహర్ పరీకర్ ఆధ్వర్యంలో ఈ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం చేసుకోవడం చైనాకు ఏమాత్రం ఇష్టం లేదు. ఎందుకంటే దీనివల్ల భారత రక్షణ వ్యవస్థ మరింత పటిష్టమవుతుంది. అప్పుడు భారత్ లాంటి దేశంతో పెట్టుకుంటే చైనాకు ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. అందువల్లే చైనా తన అభిప్రాయాన్ని మొహమాటం లేకుండా చెప్పేసింది. ఇలాంటి వ్యవహారాలలో కాస్త ఆచితూచి మాట్లాడాల్సిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. నేరుగా చైనా మాటే మాట్లాడారు. నరేంద్ర మోడీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అసలు ఫ్రాన్స్ నుంచి రఫెల్ ను కొనుగోలు చేయాల్సిన అవసరం ఏంటని? డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు.
Also Read : అన్ని పార్టీలు కలిసికట్టుగా పాకిస్తాన్ ని ఎండగట్టడానికి ప్రపంచ యాత్ర
చుట్టూ శత్రు దేశాలు.. ఏ ఒక్క దేశంతో కూడా మన ఎదుగుదలను చూసి తట్టుకోలేవు. అలాంటి దేశాల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే రక్షణ పరంగా అత్యంత సమర్థంగా ఉండాలి. కానీ ఈ మాత్రం సోయి లేని రాహుల్ గాంధీ నాడు అడ్డగోలుగా వ్యాఖ్యలు చేశారు. కానీ రఫెల్ వల్ల మన దేశానికి ఎంత లాభం ఇటీవల ఆపరేషన్ సిందూర్ నిరూపించింది. ఈ విషయంలో ఇప్పుడు రాహుల్ గాంధీ నోరు మెదపడం లేదు. అన్నట్టు నాడు రఫెల్ ను ఫ్రాన్స్ నుంచి తీసుకోవడం చైనాకు ఏమాత్రం ఇష్టం లేదు. నీతో ఆ ఒప్పందానికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ నోరు విప్పాడు. వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై చౌకీదార్ చోర్ హై ఆరోపణలు చేశాడు. అయితే నాడు రఫెల్ ఒప్పందాన్ని సుప్రీంకోర్టు సమర్ధించింది. దేశ అంతర్గత భద్రతకు అలాంటి ఆయుధాలు అవసరం అని వ్యాఖ్యానించింది. ఇక ఇప్పుడు ఆపరేషన్ సిందూర్ ద్వారా వచ్చిన ఫలితంతో ఒక్కసారిగా అందరి నోర్లు మూతపడ్డాయి. చివరికి చైనా కూడా సైలెంట్ అయిపోయింది. మనం చేస్తున్న యుద్ధానికి సపోర్ట్ ఇవ్వని పరిస్థితి నెలకొంది.
ఇక రఫెల్ చేసిన యుద్ధ విన్యాసం ఉగ్రవాద దేశానికి చుక్కలు చూపించింది..ఆ పరిణామం రాహుల్ గాంధీ నోరు మూతపడేలా చేసింది. అందుకే రాజకీయాలు ఒక పరిధి వరకు మాత్రమే ఉండాలి. నియంత్రణ దాటాయా.. అప్పుడు కొత్త సమస్య ఎదురవుతుంది. రాహుల్ గాంధీ ఇప్పటికైనా పరిపక్వత పాటిస్తే అతడికి మంచిది. కాంగ్రెస్ పార్టీకి మంచిది. ఈ దేశానికి అంతకంటే మంచిది.