A. R. Rahman- The Kerala Story: మొత్తానికి ఏఆర్ రెహమాన్ కు “కేరళ స్టోరీ” అర్థమైంది: చివరకు దండం పెట్టేశాడు

ముస్లింలు మసీదు ప్రాంతాన్ని పవిత్రమైన స్థలంగా చూస్తారు. అందులో ఇతర అన్యమతస్తులకు, మహిళలకు ప్రవేశం ఉండదు. కానీ అలాంటి మసీదులో హిందూ సంప్రదాయంలో ఓ పెళ్లి జరిగింది.

Written By: K.R, Updated On : May 6, 2023 9:10 am

A. R. Rahman- The Kerala Story

Follow us on

A. R. Rahman- The Kerala Story: కేరళ స్టోరీ.. ఈ సినిమాపై దేశవ్యాప్తంగా ఎంతటి చర్చ నడుస్తుందో తెలుసు కదా! అంతటి ఏఆర్ రెహమాన్ కూడా ఆ సినిమా పట్ల ఒకింత నిరసన స్వరాన్ని వ్యక్తం చేశాడు. కానీ అలాంటి వ్యక్తి కూడా ఇది కదా కేరళ స్టోరీ అంటూ దండం పెట్టాడు.. ఇంతకీ అంతటి ఏఆర్ రెహమాన్ నూ కదిలించిన ఆ కేరళ స్టోరీ ఏమిటో మీరూ చదివేయండి.

పవిత్రమైన స్థలం

ముస్లింలు మసీదు ప్రాంతాన్ని పవిత్రమైన స్థలంగా చూస్తారు. అందులో ఇతర అన్యమతస్తులకు, మహిళలకు ప్రవేశం ఉండదు. కానీ అలాంటి మసీదులో హిందూ సంప్రదాయంలో ఓ పెళ్లి జరిగింది. ముస్లింలే దగ్గరుండి ఈ పెళ్లి జరిపించారు. మత సామరస్యం గొప్పతనాన్ని చాటిన ఈ వీడియోను ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి, మానవత్వాన్ని చాటి చెప్పిన ప్రజలందరికీ చేతులు జోడించి నమస్కరించారు.

వైరల్ వీడియో

ది కేరళ స్టోరీ నిన్న విడుదల నేపథ్యంలో..ఆ సినిమా ఏమో గాని ఈ కేరళ స్టోరీ చూడండి అంటూ నిన్నటి నుంచి సామాజిక మాధ్యమాల్లో ఒక వీడియో బాగా వైరల్ అవుతున్నది. కేరళ రాష్ట్రం అలప్పుజ చెరువల్లి లోని ఓ మహిళ తన కుమార్తె పెళ్లి చేసేందుకు తీవ్ర ఇబ్బంది పడుతోంది. తన కుమార్తె పెళ్లి కోసం సహాయం చేయాలంటూ అక్కడున్న స్థానిక ముస్లిం కమిటీని ప్రాధేయపడింది. దీంతో ఆమె పడుతున్న ఇబ్బందులు గమనించిన అక్కడి ముస్లిం పెద్దలు ఆర్థిక సహాయం మాత్రమే కాకుండా, తనకు అత్యంత పవిత్రమైన మసీదులోనే హిందూ సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి జరిపి మతసామరస్యం అర్థం చాటిచెప్పారు. ఇప్పుడు ఈ వీడియో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నది.

ఏ ఆర్ రెహమాన్ హర్షం

ఈ వీడియోను చూసిన ఏఆర్ రెహమాన్ సంతోషం వ్యక్తం చేశారు. వీడియోను ట్విట్టర్ వేదికగా షేర్ చేసి తన ఆనందాన్ని పంచుకున్నారు.” మీరు చేసిన ఈ పని చాలా గొప్పగా ఉంది. వ్యవస్థను సమూలంగా మార్చి వేసేలా ఉంది. ఈ విషయంలో నేను పూర్తిగా గర్వపడుతున్నాను. మీ మానవత్వానికి నా జోహార్లు అంటూ” వ్యాఖ్యానించారు. అన్నట్టు ఈ పెళ్లిలో పరిణయ తంతు మాత్రమే కాకుండా పెళ్లి కుమార్తెకు ముస్లిం పెద్దలు 10 తులాల బంగారం, 20 లక్షల నగదు కానుకగా ఇచ్చారు. అంతేకాదు పెళ్లిచూసేందుకు వచ్చిన 1000 మంది అతిధులకు నోరూరించే వంటకాలు ఒకసారి కొసరి కొసరి వడ్డించారు. ఇక ఈ పెళ్లి చేసిన మత పెద్దలు మాట్లాడుతూ మతసామరస్యం అంటే ఏమిటో చాటి చెప్పేందుకే ఇలాంటి కృతజ్ఞతలు నిర్వహించామని తెలిపారు. అయితే ఈ వీడియో ఇప్పటిది కాదని, 2020లో జరిగిందని కొంతమంది చెబుతున్నారు.. ది కేరళ స్టోరీ అనే సినిమాకు కౌంటర్ గా ఇలా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ దీనిని షేర్ చేయడంతో దేశవ్యాప్తంగా వైరల్ గా మారింది.